BigTV English
Advertisement

Tollywood: యంగ్ హీరోలు చేసిన ఆ జాన్రా సినిమాలు వర్కౌట్ కాలేదు

Tollywood: యంగ్ హీరోలు చేసిన ఆ జాన్రా సినిమాలు వర్కౌట్ కాలేదు

Tollywood: ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమా అంచలంచెలుగా ఎదుగుతూ ప్రపంచ స్థాయి గుర్తింపును తీసుకొస్తుంది. ఇప్పుడు తెలుగు నుంచి ఒక భారీ సినిమా వస్తుంది అంటే ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ అంతా ఎదురుచూడటం మొదలుపెట్టారు. ఇక చాలామంది యంగ్ హీరోలు కూడా పాన్ ఇండియా రేంజ్ లో తమ సినిమాలను విడుదల చేస్తూ వస్తున్నారు. అయితే పాన్ ఇండియా స్థాయి సత్తా లేకపోయినా కూడా కొన్ని సినిమాలను ఆ స్థాయిలో విడుదల చేయడం అనేది కొంతవరకు మైనస్ గా మారుతుంది అని చెప్పాలి. ఈ మధ్యన యంగ్ హీరోస్ చేసిన స్పై జాన్రా కథలు పెద్దగా వర్కౌట్ కాలేదు. అఖిల్ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. కానీ ఆ తర్వాత చేసిన ఏజెంట్ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారింది.


ఏజెంట్ తో డిజాస్టర్

అతనొక్కడే సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు సురేందర్ రెడ్డి. ఆ తర్వాత ఎన్నో ప్రత్యేకమైన సినిమాలను తీసి స్టార్ డైరెక్టర్ గుర్తింపు పొందాడు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా కూడా సైరా వంటి సినిమా చేసే అవకాశం సురేందర్ రెడ్డికి దక్కింది. సురేందర్ రెడ్డి తీసిన సినిమా ఏజెంట్. ఈ సినిమాలో అఖిల్ స్పైగా కనిపిస్తాడు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన డిజాస్టర్ ను సొంతం చేసుకుంది.


స్పై సినిమా డిజాస్టర్

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోస్లో నిఖిల్ ఒకడు. నిఖిల్ కెరియర్ లో ఎన్నో కాన్సెప్ట్ బేస్ సినిమాలు కూడా ఉన్నాయి. స్వామి రారా, కార్తికేయ వంటి సినిమాలు నిఖిల్ కి మంచి పేరుని తీసుకొచ్చాయి. కార్తికేయ 2 సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. పాన్ ఇండియా స్థాయిలో నిఖిల్ కు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఆ తర్వాత నిఖిల్ చేసిన పాన్ ఇండియా సినిమా స్పై ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది.

జాక్ సినిమా డిజాస్టర్

సిద్దు జొన్నలగడ్డ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన సినిమా జాక్. ఈ సినిమా నిన్ననే ప్రేక్షకులు ముందుకు వచ్చింది. బొమ్మరిల్లు భాస్కర్ సిద్దు జొన్నలగడ్డ కలిసి చేస్తున్నారు అంటే ఖచ్చితంగా మంచి సినిమా అని అందరూ ఒక స్థాయి నమ్మకంతో థియేటర్ కి వెళ్లారు. కానీ ఈ సినిమా ప్రేక్షకుడిని పూర్తిస్థాయిలో నిరాశపరిచింది. ఈ సినిమాలో స్పైగా కనిపిస్తాడు సిద్దు జొన్నలగడ్డ. మామూలుగా బొమ్మరిల్లు భాస్కర్ సినిమా అంటేనే ఒక హై వచ్చే ఎలిమెంట్స్ కనిపిస్తూ ఉంటాయి. ఈ సినిమాలో అలా ఒకటి కూడా కనిపించకపోవడం బాధాకరం. అసలు సిద్దు ఈ కథని ఎలా ఓకే చేశాడు అని ఆలోచన రాక మానదు. ఇలా ముగ్గురు యంగ్ హీరో చేసిన స్పై జాన్రా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశనే మిగిల్చాయి.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×