Illu Illalu Pillalu Today Episode April 11th : నిన్నటి ఎపిసోడ్ లో.. డబ్బులు చేతిలో పడటంతో భాగ్యం మొహం వెలిగిపోతుంది. పడ్డాడు బుట్టలో అని సంబరపడిపోతుంది. అనంతరం ఇరు ఫ్యామిలీలు కలిసి బట్టలు కొనడానికి షాపింగ్‌కి వెళ్తారు. అమ్మోయ్.. ఇంత పెద్ద బట్టల కొట్టుకి మనం ఎప్పుడూ రాలేదు కదే.. మన బండారం బయటపడిపోతుందేమోనని భయంగా ఉందే అని అంటుంది శ్రీవల్లి.. నువ్వేం మాట్లాడకుండా రా అమ్మడు నేను చూసుకుంటాను కదా అనేసి భాగ్యం అంటుంది.. ఎస్కలేటర్ మీద ఎక్కడానికి అందరూ భయపడిపోతారు.. పైకి వెళ్ళగానే ఆనంద్ రావు ఎస్కులేటర్ ని దిగడానికి భయపడి కింద పడతాడు సాగరు సెటైర్లు వేస్తాడు. పెళ్ళికొడుకు బట్టలు పెళ్ళికొడుకు తీసుకుంటారు ముందు మనకి బట్టలు తీసుకుందాం రండి అని భాగ్యం అంటుంది. వేదవతి కూడా అలాగే వదిన గారు అందరికీ బట్టలు తీసుకుందాం పదండి అని అంటుంది. భాగ్యం ప్లాన్ ప్రకారం వేదవతి కుటుంబానికి చీప్ గా చీరలు కొనిపిస్తారు. భాగ్యమాత్రం ఖరీదైన చీరల్ని సెలెక్ట్ చేసుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ప్రేమ, నర్మదను ప్రేమను తీసుకెళ్లి బట్టలు కొనిపించమని తన కొడుకులకు చెప్తుంది. అక్కడిదో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. ప్రేమ మాత్రం వద్దని అనేస్తుంది. తీసుకోమని ధీరజ్ అనేసరికి.. ‘మీ నాన్న అన్నమాటల్ని నువ్వు మర్చిపోతావేమో కానీ.. నేను మర్చిపోలేను.. అంతకీ నీకు చీర కొనాలంటే.. నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బులు ఇవ్వు కొనుక్కుంటా అని అంటుంది. నా దగ్గర 15 వందలే ఉన్నాయి అని ధీరజ్ అంటే.. అవే చాలు నాకు చీర రేటు కంటే కూడా ఆత్మాభిమానమే ముఖ్యం అని అంటుంది ప్రేమ. తన నిర్ణయాన్ని చూసినా ధీరజ్ పెళ్లికి అంత తక్కువలో చీరలు కొంటే ఏం బాగుంటాయి అనంటే ఏం పర్లేదు నాకు అవే బాగుంటాయి నువ్వు కొనిస్తేనే కొనుక్కుంటా లేదంటే నేను అసలు చీరలే కొనుక్కొని ప్రేమ అంటుంది.
నర్మదా సాగర్ ఇద్దరూ బట్టలను సెలెక్ట్ చేసుకోవడానికి వెళ్తారు.. నర్మద ముందుగా సాగర్ కి షర్టు సెలెక్ట్ చేసి ఈ షర్ట్ ను వేసుకుంటే చాలా బాగుంటుంది నువ్వు నా సెలెక్షన్ కచ్చితంగా కరెక్ట్ అంటావు అని గొప్పగా చెప్పుకుంటుంది. ఇప్పుడు వాళ్ళ పెళ్లి అవుతుంది కదా ఇప్పుడు ఏమైనా చేసుకోవచ్చు ఎక్కడైనా చేసుకోవచ్చని సాగర్ కి ఇండైరెక్టుగా నర్మదా హింట్ ఇస్తుంది. ఇక సాగర్ అది గుర్తుపెట్టుకుని షర్ట్ ని ట్రై చేయడానికి లోపలికి వెళ్తాడు. నర్మదను లోపలికి రమ్మని పిలుస్తాడు వాళ్ళిద్దరూ రొమాన్స్ చేసుకుంటుంటే మధ్యలో వాళ్ళ అక్క వచ్చి వాళ్ళని డిస్టర్బ్ చేస్తుంది.
ఇక ప్రేమ ధీరజిద్దరూ తక్కువ బడ్జెట్ లో చీరలు కావాలని షాపులోని వ్యక్తిని అడుగుతారు. అతను అంత తక్కువలో ఇక్కడ ఉండవండి. ఇక్కడ అన్ని ఐదువేలకు పైగానే ఉంటాయి. ఇంత చీప్ గా కొనడానికి వచ్చారా అని ఎగతాళి చేస్తాడు. ఎగతాళి చేయడం ఆపేసి మాకు కావాల్సిన చీరలు ఎక్కడున్నాయో చెప్పండి అనేసి ప్రేమ అడుగుతుంది.. చీరలు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రేమ ఎలా ఉందో చూసుకోవాలని అద్దం ముందుకు వెళుతుంది. అక్కడ ధీరజ్ ని చూసి అందరూ నవ్వుతుంటే డీలర్స్ ఇంకా ఎంతసేపు అని గట్టిగా లాగుతాడు. ప్రేమ ధీరజ్ దగ్గరికి వచ్చేస్తుంది అందరూ చూసి నవ్వుకుంటారు.
ఇక రామరాజు తన కొడుకు పెళ్లి కాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంటాడు. కొడుకు పెళ్లి ని ఇంత ఆలస్యంగా చేస్తున్నానని బాధ నాకు ఉండేది కానీ ఇప్పుడు ఆ బాధంతా పోయిందని బుజ్జమ్మతో అంటాడు.. పెద్దమ్మాయి తర్వాత ఇన్నాళ్లకు మన పెద్దబ్బాయి పెళ్లి చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అని రామరాజు సంతోషానికి అవధులు లేవని చెప్తాడు. అవునండి మన పెద్దోడు పెళ్లి ఇక జీవితంలో చూడలేం అనుకున్నాం ఇప్పుడు పెళ్లి జరుగుతుంది నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అని వేదవతి అంటుంది.
సేన రామరాజు కొడుకుకి పెళ్లి కాకుండా జీవితాంతం కుమిలి ఏడ్చేలా చేయాలని అనుకున్నాం అక్క. ఇప్పుడు వాడి కొడుకుకి పెళ్లి చేయబోతున్నాడు. రేపు వాడి ఇంట్లో పెళ్లి జరుగుతుంది అంటేనే నాకు రక్తం మరిగిపోతుంది అని భద్రత అంటాడు. మనం ఎలాంటి ప్లాన్లు వేసినా అది మనకే రివర్స్ అవుతున్నాయి వాడికే మంచి జరుగుతుందని భద్ర కూడా సీరియస్ గా ఉంటుంది. విశ్వం మాత్రం అత్త ఎందుకు అంత సీరియస్ అవుతున్నారు అంత ఆలోచించాల్సిన పనిలేదు. ఆ పెళ్లి జరగదు అని చెప్పాను కదా జరక్కుండా చేసే బాధ్యత నాది అని విశ్వం అంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..