Venkatesh: ప్రస్తుతం మల్టీ స్టారర్ ట్రెండ్ నడుస్తుంది.. మంచి కంటెంట్ తో వచ్చిన మల్టీ స్టారర్ మూవీస్ బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్ సృష్టించాయి. అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కలిసి దేవుడు చేసిన మనుషులు సినిమాలో నటించారు. ఆ తర్వాత కృష్ణ, శోభన్ బాబు అనేక చిత్రాలలో నటించారు. వారి తర్వాత ఈ జనరేషన్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి అగ్రనటులు మల్టీ స్టారర్ సినిమాలు కొంచెం తక్కువగానే చేశారని చెప్పొచ్చు. 2010 తరువాత వెంకటేష్ మల్టీ స్టారర్ సినిమా ట్రెండును తిరిగి ప్రారంభించాడు. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు లో 2013లో మహేష్ బాబు తో కలిసి వెంకటేష్ మల్టీస్టారర్ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ ని అందుకున్నాడు. ఆ తరువాత గోపాల గోపాల సినిమాలో పవన్ కళ్యాణ్, వెంకటేష్ తో నటించారు. ఈ ట్రెండ్ ఇలా కొనసాగుతూనే వుంది. ఇక ఇప్పుడు తాజాగా మరో మల్టీ స్టారర్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ మూవీలో వెంకటేష్ తో యంగ్ హీరో నటిస్తున్నట్లు సమాచారం.. ఆ వివరాలు చూద్దాం..
వెంకటేష్ తో మల్టీ స్టారర్ లో ఛాన్స్ కొట్టేసిన హీరో..
మల్టీ స్టారర్ మూవీస్ చేయడంలో వెంకటేష్ ముందుంటారు. 2013లో సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా తో ప్రేక్షకులను మెప్పించారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఈ చిత్రం కుటుంబ కథాంశంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. 2017లో గోపాల గోపాల సినిమాతో వెంకటేష్, పవన్ కళ్యాణ్ మల్టీస్టారర్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ సక్సెస్ ని అందుకుంది. కిషోర్ కుమార్ పార్థసాని ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ తర్వాత ఎఫ్2 సినిమాతో 2019లో వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీస్టారర్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రం 130 కోట్లకు పైగా కలెక్షన్స్ తో కామెడీ మూవీస్ లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించింది. ఇక ఇప్పుడు వెంకటేష్, మరో మల్టీస్టారర్ మూవీ చేయనున్నట్లు సమాచారం. తాజాగా సింగిల్ సినిమాతో విజయాన్ని అందుకున్న శ్రీవిష్ణు ఈ చిత్రంలో వెంకటేష్ తో కలిసి నటించనున్నారు. వెంకటేష్ శ్రీవిష్ణు కాంబోలో స్క్రిప్ట్ రెడీ అవుతున్నట్లు, ఆ కథకి వెంకటేష్ మాత్రమే చేయగలరని శ్రీ విష్ణు తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. స్క్రిప్ట్ పనులు పూర్తవగానే వెంకటేష్ ని కలిసి మూవీ ప్లాన్ చేయబోతున్నట్లు శ్రీవిష్ణు తెలిపారు. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మల్టీ స్టారర్ మూవీ అంటే వెంకటేష్ మాత్రమే చేయగలడు అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
కామెడీ మూవీస్ తో రానున్న వెంకటేష్ ..
ఇక వెంకటేష్ తాజాగా సంక్రాంతికి వస్తున్నామ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రం వెంకటేష్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించారు. కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రం సంక్రాంతికి రిలీజ్ అయి మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రానికి బీమ్స్ సంగీతాన్ని అందించారు. ఇప్పటికీ పాటలు సోషల్ మీడియాలో మారుమోగుతున్నాయి. ముఖ్యంగా రమణ గోకుల పాడిన గోదారి గట్టు సాంగ్ యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ సొంతం చేసుకుంది. ఇక వెంకటేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం. ఆ మూవీ తర్వాత శ్రీ విష్ణు తో మట్టి స్టార్ లో నటించే అవకాశం ఉంది. ఏది ఏమైనా వరుస కామెడీ బ్లాక్ బస్టర్స్ తో వెంకటేష్ రికార్డు సృష్టిస్తున్నారు.