PM Modi: భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. అయితే రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలపై అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, ప్రధాని మోదీకి కాల్ చేసి మాట్లాడారు. ప్రస్తుతం జరుగుతోన్న పరిస్థితులపై అడిగి తెలుసుకున్నారు.
ప్రధానికి అమెరికా వైస్ ప్రెసిడెంట్ కాల్
ఈ సందర్భంగా ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ పాక్ మా దేశంపై దాడి చేస్తే.. తిరిగి అటాక్ చేస్తామని జేడీ వాన్స్ కు ప్రధాని స్పష్టం చేశారు. తమ సంయమనం బలహీనత కాదని.. భారతదేశ భద్రతపై ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడే ప్రసక్తే లేదని ప్రధాని మోదీ ఆయనతో చెప్పారు. భూమి ఉగ్రవాదం లేకుండా చేయాలని జేడీ వాన్స్ కు తెలియజేశారు. ప్రస్తుతం సీజ్ ఫైర్ లో భాగంగా సహనంతో ఉన్నామని, కానీ ఈ సారి పాక్ దాడి చేస్తే తమ వైపు నుంచి సమాధానం తీవ్రంగా ఉంటుందని అన్నారు. పాక్ ఏదైనా చేయాలని చూస్తే ఈ సారి విధ్వంసమేనని ప్రధాని మోదీ తెలియజేశారు.
పాక్ యుద్ధంలో ఓడిపోయింది..
రేపు పాకిస్థాన్ తో కాల్పుల విరమణకు సంబంధించి చర్చలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ కాల్ చేయడం చర్చనీయాంశమైంది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలో భారత్ -దాయాది దేశం పాకిస్థాన్ ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరుగుతున్న క్రమంలో జేడీ వాన్స్ ఫోన్ చేసి ప్రధానితో మాట్లాడారు. అయితే దీనికి కాసేపటి క్రితమే పీవోకే విషయంతో తమ వైఖరి మారేది లేదని ప్రధాని మోదీ క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. యుద్దంలో పాకిస్థాన్ దారుణంగా ఓడిపోయిందని కూడా ప్రధాని వ్యాఖ్యానించారు.
పీవోకే విషయంలో ఎవరి జోక్యం వద్దు
పాక్ ఆక్రమిత కశ్మీర్ విషయంలో భారత్ రాజీపడే ప్రసక్తే ఉండదని ప్రధాని మోదీ చెప్పారు. దీనికి ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని కూడా అమెరికాకు పరోక్షంగా చెప్పేశారు. పీవోకే తమదేనని.. ఇందులో ఎవరు జోక్యం అవసరం లేదని ప్రపంచానికి తెలిసేలా ప్రధాని మోదీ సందేశాలు పంపారు. ఇక, పీవోకేను తమకు అప్పగించడం ఒక్కటే పాకిస్తాన్ కు ఉన్న గత్యంతరం అని మోదీ తెగేసి చెప్పిన విషయం తెలిసిందే.
Also Read: PM Modi Warning: ఆపరేషన్ సిందూర్ ముగియలేదు.. మోదీ సంచలన వ్యాఖ్యలు
మొత్తానికి ప్రధాని మోదీ వ్యాఖ్యలను బట్టి.. భారత్ – పాకిస్తాన్ విషయంలో ఎవరి మధ్యవర్తిత్వం తమకు అవసరం లేదని అన్నట్లుగా తెలుస్తోంది. ఆపరేషన్ సిందూర్ ముగిసిపోలేదని.. అది సాధారణంగా జరుగుతూనే ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ఇది పాకిస్తాన్, అలాగే ప్రపంచం కూడా ఈ విషయాన్ని పరిగణించాలని అన్నట్లు తెలుస్తోంది. పాక్ తో చర్చలు జరపాలంటే ఇండియాపై దాడి చేసిన టెర్రరిస్టులను అప్పగించి చర్చలకు రావాలని ప్రధాని మోదీ అన్నారు. అంటే ఉగ్రవాదంపై ప్రధాని ఎంతో సీరియస్ గా ఉన్నారో అర్థం అవుతోంది.
భారత్ – దాయాది దేశం పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ప్రధాని స్పందన ఏంటి..? అని చూస్తున్న తరుణంలో.. యూఎస్ వైస్ ప్రెసిడెంట్ వాన్స్ తో మోదీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
Also Read: Imran Khan: పాక్ మాజీ పీఎం ఇమ్రాన్ ఖాన్ దారుణ హత్య..?