Sreeleela Engagement :కుర్రాళ్ళ క్రష్ మారిపోయిన యంగ్ బ్యూటీ శ్రీ లీల (Sree Leela) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘పెళ్లి సందD’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. ‘ధమాకా’ సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. అలా తెలుగు, తమిళ్ భాషల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె.. ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్(Karthik Aryan) హీరోగా.. ఒక క్రేజీ లవ్ స్టోరీ లో నటిస్తోంది. ఆషికీ 3 టైటిల్ అంటూ వార్తలు వస్తున్నాయి. కానీ దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. ఇదిలా ఉండగా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ.. తాజాగా అభిమానులకు షాక్ ఇస్తూ కొన్ని ఫోటోలు ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. ఈ ఫోటోలు చూసిన అభిమానులు కంగారు పడిపోయారు.. ఈ ఫోటోలలో ఈమెకు పసుపు రాస్తూ కొంతమంది పెద్దలు ఆశీర్వదిస్తున్నట్లు ఉంది. పైగా ఈరోజు నాకు బిగ్ డే అంటూనే.. పూర్తి వివరాలు కమింగ్ సూన్ అంటూ కామెంట్ పెట్టింది ఈ ముద్దుగుమ్మ.
శ్రీ లీల ఎంగేజ్మెంట్.. అసలు నిజం ఇదే
అలా ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన ఈ ఫోటోలు, స్టోరీస్ లో చూసి అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అదేంటి.. ఇంత సడన్ గా నిశ్చితార్థం చేసుకుంది. త్వరలోనే పెళ్లి గురించి రివీల్ చేస్తుందా ? అంటూ కామెంట్ చేశారు. అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం విని.. ఒరేయ్ అబ్బాయిలు.. కాస్త ఊపిరి పీల్చుకోండి. శ్రీ లీలకు ఎంగేజ్మెంట్ అవ్వలేదంట అంటూ నిజం తెలిసిన నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే తాజాగా శ్రీలీలా షేర్ చేసిన ఫోటోలు ఎంగేజ్మెంట్ కాదని సమాచారం. జూన్ 14వ తేదీన ఆమె పుట్టిన రోజు.. కానీ తిథుల ప్రకారం … నిన్న శ్రీలీల బర్త్ డే . ప్రతి ఏడాది మే 30న వాళ్ల ఫ్యామిలీతో ఇలానే బర్త్ డే ని సెలబ్రెట్ చేసుకుంటుందట.ఈ ఏడాది కూడా అలానే సెలబ్రెట్ చేసుకుంది. ఆ బిగ్ డే అని కామెంట్ పెట్టడం వల్ల ఎంగేజ్మెంట్ అనుకున్నారు. అదన్నమాట అసలు నిజం.. అలా శ్రీ లీల చేసిన ఈ పోస్టు అభిమానులను ఒక్కసారిగా కలవరపాటుకు గురిచేసిందని చెప్పవచ్చు. మొత్తానికి అయితే అసలు విషయం తెలిసి అటు అభిమానులు కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఏది ఏమైనా అభిమానులకు చిన్న జలక్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ అని నెటిజన్స్ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
శ్రీ లీల కెరియర్..
శ్రీ లీల విషయానికొస్తే.. 2019లో వచ్చిన ‘కిస్’ అనే కన్నడ చిత్రంతో ఇండస్ట్రీకి అరంగేట్రం చేసింది. ఇందుకు సైమా అవార్డ్స్ బెస్ట్ ఫిమేల్ డెబ్యూ – కన్నడ అవార్డు అందుకుంది. ఆ తర్వాత ‘భరతే’ సినిమా చేసి, తెలుగులో 2021లో ‘పెళ్లి సందD’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇకపోతే ఒకే ఏడాది 9 చిత్రాలకు సైన్ చేసిన హీరోయిన్గా పేరు సొంతం చేసుకుంది. ఇకపోతే శ్రీ లీల యునైటెడ్ స్టేట్స్ లోని ఒక తెలుగు కుటుంబంలో 2001 జూన్ 14న జన్మించింది.. కర్ణాటకలోని బెంగళూరులో పెరిగారు.. ఈమె తల్లి స్వర్ణలత.. బెంగళూరులో ప్రముఖ గైనకాలజిస్ట్. స్వర్ణలత పారిశ్రామికవేత్త సూరపనేని శుభకరన్ ను వివాహం చేసుకొని, బిడ్డ పుట్టాక విడిపోయారు. ఇకపోతే శ్రీ లీలా చిన్నతనంలోనే భరతనాట్యం నృత్యంలో శిక్షణ ప్రారంభించింది. తన తల్లిలాగే డాక్టర్ అవ్వాలని ఎంబిబిఎస్ కూడా పూర్తి చేసింది. అంతేకాదు గురు, శోభిత అనే ఇద్దరు వికలాంగ పిల్లల్ని కూడా దత్తత తీసుకుంది. ఇక ఇటీవల మరో చిన్న పాపను కూడా దత్తత తీసుకున్నట్లు సమాచారం.
ALSO READ:Anaganaga Movie: ‘అనగనగా’ డిలీటెడ్ సీన్స్ చూశారా? ఓ తల్లి ఆవేదన?