BigTV English

India’s Bullet Train: ఇండియన్ బుల్లెట్ రైలు పరుగు మొదలు.. ఇదిగో చూసేయండి!

India’s Bullet Train: ఇండియన్ బుల్లెట్ రైలు పరుగు మొదలు.. ఇదిగో చూసేయండి!

India’s Bullet Train Trial: భారతీయ రైల్వే రోజు రోజుకు మరింత ముందడుగు వేస్తోంది. ఇప్పటికే వందే భారత్ రైళ్లు సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టాయి. అత్యంత వేగం, ప్రపంచ స్థాయి సౌకర్యాలతో ప్రయాణీకులకు మెరుగైన రవాణా సేవలను అందిస్తున్నాయి. త్వరలో వందేభారత్ స్లీపర్ రైళ్లు కూడా అందుబాటులోకి రాబోతున్నాయి. 180 కిలో మీటర్ల వేగంతో దూసుకెళ్లనున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియన్ రైల్వే మరో గుడ్ న్యూస్ చెప్పింది. ముంబై- అహ్మదాబాద్ లో పరుగులు తీయనున్న షింకన్ సెన్ రైళ్ల ట్రయల్స్ మొదలైనట్లు తెలిపింది. జపాన్ లో వీటిని టెస్ట్ చేస్తున్నారు. తాజాగా  ఈ టెస్ట్ రన్ కు సంబంధించి వీడియోలు సోషల్ మీడియా చక్కర్లు కొడుతున్నాయి. తెలుపు, నీలం రంగు కలిగిన ఈ బుల్లెట్ రైలు చూసేందుకు చాలా అందంగా కనిపిస్తోంది.


రెండు బుల్లెట్ రైళ్లను గిఫ్ట్ గా ఇస్తున్న జపాన్

మన దేశంలో అందుబాటులోకి రానున్న బుల్లెట్ రైళ్లను జపాన్ నుంచి కొనుగోలు చేస్తోంది భారత ప్రభుత్వం. వ్యూహాత్మక ఇండో-జపనీస్ భాగస్వామ్యంలో భాగంగా రెండు రైళ్లను గిఫ్ట్ గా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ రైళ్లతో ఇండియాలో టెస్ట్ రన్ నిర్వహించనున్నారు. ఇందుకోసం E5, E3 సిరీస్‌ల నుంచి ఒక్కో రైలు చొప్పున భారత్ కు పంపించనుంది. గంటకు 320 కి.మీ వేగంతో నడిచేలా రూపొందించబడిన ఈ రైళ్లు 2026 ప్రారంభంలో మనకు డెలివరీ చేయబడతాయి.


జపాన్ లో ట్రయల్స్ ప్రారంభం

ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ ప్రాజెక్టు(MAHSR) లో భాగం కాబోతున్నమొదటి షింకన్ సెన్ బుల్లెట్ రైళ్లు ప్రస్తుతం జపాన్ లో ట్రయల్స్ జరుపుకుంటున్నాయి. ఈ ట్రయల్స్ లో డ్రైవింగ్ పరిస్థితులు, హీట్ జెనరేషన్, ధూళి నిరోధకతను పరిశీలించనున్నారు. ఇంజిన్ పని తీరు, వేగం పరిమితి సహా ఇతర కీలక అంశాలను స్టడీ చేయనున్నారు. సుమారు 10 రోజుల పాటు వీటిని పరీక్షించనున్నట్లు తెలుస్తోంది.  టెస్ట్ పూర్తి కాగానే వీటిని ఇండియాకు పంపించనున్నారు. ‘మేక్ ఇన్ ఇండియా’లో భారత్ కు E10 సిరీస్ షింకన్ సెన్ రైళ్లను ఉత్పత్తి చేస్తున్నట్లు జపాన్ తెలిపింది.

ముంబై-అహ్మదాబాద్ మధ్య తగ్గనున్న ప్రయాణ సమయం

నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHSRCL) డెవలప్ చేసిన 508 కిలోమీటర్ల MAHSR కారిడార్, ముంబై- అహ్మదాబాద్ మధ్య ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించనుంది. కేవలం 2 గంటల 7 నిమిషాల్లో ఇరు నగరాలకు ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఈ మార్గంలో థానే, విరార్, బోయిసర్, వాపి, సూరత్, వడోదరతో సహా 12 స్టేషన్లు ఉంటాయి.  అన్ని అనుకున్నట్లు జరిగితే 2030 నాటికి భారత్ లో బుల్లెట్ రైళ్లు పరుగులు తీయనున్నాయి.

2016లో బుల్లెట్ రైళ్ల కోసం భారత్-జపాన్ ఒప్పందం

భారత్-జపాన్ నడుమ 2016లో హై-స్పీడ్ రైలు ప్రాజెక్టుపై ఒప్పంద జరిగింది. ఇది ప్రాజెక్ట్ ఖర్చులో దాదాపు 80% కవర్ చేస్తుంది. జపాన్ ఆర్థిక సంస్థలు తక్కువ వడ్డీకి రుణాలను అందించనుంది. అంతేకాదు, బుల్లెట్ రైలుకు సంబంధించిన టెక్నాలజీని కూడా జపాన్ మనతో పంచుకోనుంది. జపాన్ అందించే షింకన్ సెన్ రైళ్లు భారత రవాణా వ్యవస్థలు కీలక ముందడుగు కాబోతోంది.  రెండు ప్రధాన ఆర్థిక కేంద్రాల మధ్య పర్యాటక రంగంతో పాటు వాణిజ్యాన్ని గణనీయంగా పెంచనుంది. బుల్లెట్ రైళ్లు దేశంలో హై-స్పీడ్, హై-ఎఫిషియెన్సీ ప్రజా రవాణాలో కొత్త శకానికి నాంది పలకనుంది.

Related News

Secunderabad Station: ఆ 32 రైళ్లు ఇక సికింద్రాబాద్ నుంచి నడవవు, ఎందుకంటే?

Raksha Bandhan 2025: వారం రోజుల పాటు రక్షాబంధన్ స్పెషల్ ట్రైన్స్.. హ్యపీగా వెళ్లొచ్చు!

Garib Rath Express: గరీబ్ రథ్ ఎక్స్‌ ప్రెస్ రైలు పేరు మారుతుందా? రైల్వే మంత్రి ఏం చెప్పారంటే?

Safest Cities In India: మన దేశంలో సేఫ్ సిటీ ఇదే, టాప్ 10లో తెలుగు నగరాలు ఉన్నాయా?

Vande Bharat Express: ఆ మూడు రూట్లలో వందే భారత్ వస్తోంది.. ఎన్నేళ్లకో నెరవేరిన కల.. ఎక్కడంటే?

SCR Special Trains: చర్లపల్లి నుండి కాకినాడకు స్పెషల్ ట్రైన్.. ఏయే స్టేషన్లలో ఆగుతుందంటే?

Big Stories

×