Anaganaga Movie:ప్రముఖ హీరో సుమన్ (Suman) చాలా రోజుల తర్వాత నటించిన చిత్రం ‘అనగనగా’. ఈ సినిమా నేరుగా థియేటర్లలో విడుదల కాకుండా.. ఈటీవీ విన్ వేదికగా విడుదలై అందరి హృదయాలను దోచుకుంది. ఇందులో ఉండే సన్నివేశాలు అన్నీ కూడా ఆలోచింపచేసే విధంగా ఉన్నాయని అటు సినీ ఇటు రాజకీయ ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపించారు. అంతే కాదు ఈ సినిమాను ఇప్పుడు థియేటర్లలో విడుదల చేయాలి అని కూడా ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుండి ఈ కథలోని కొన్ని డిలీటెడ్ సన్నివేశాలను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. అందులో రామ్.. “నాన్న.. ఓ కథ చెప్పవా” అంటూ వ్యాస్ ను అడగగా..తెలివిగా “ముపాసా సింబా” కథ చెప్పాడు.
అనగనగా.. ఓ తల్లి ఆవేదన..
ఆ తర్వాత రామ్ తన అకాడమిక్ ఎడ్యుకేషన్ లో సరిగా చదవకపోవడంతో తల్లి ఆవేదన వ్యక్తం చేస్తుంది. తన కొడుకు స్పోర్ట్స్ లో ముందు లేడని, చదువులో కూడా అన్ని జీరోలే వస్తున్నాయని తన కొడుకు పెద్దయితే.. ఏమవుతాడో అని ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇంతలోనే వ్యాస్..” నేనున్నాను కదా.. నీకెందుకు” అంటూ భార్యను దగ్గరకు తీసుకుంటాడు. ఈ రెండు సన్నివేశాలు సినిమా స్టోరీ నుండి తప్పించడంతో అభిమానులు ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. ఈ రెండు సీన్స్ ను ఎందుకు డిలీట్ చేశారు అంటూ ప్రశ్నిస్తున్నారు. మొత్తానికైతే ఇప్పుడు ఈ రెండు సన్నివేశాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అనగనగా స్టోరీ కథ..
సుమంత్ (Sumanth), కాజల్ చౌదరి (Kajal Chowdary), మాస్టర్ విహర్ష్ (Master Viharsh) ప్రధాన పాత్రలో నటించిన ఈ కథకు సన్నీ సంజయ్ (Sunny Sanjay) దర్శకుడిగా పనిచేశారు. ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. వ్యాస్ (సుమంత్) ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ టీచర్ గా పని చేస్తూ ఉంటాడు. బట్టీ చదువుల వల్ల పిల్లలు ఎగ్జామ్స్ లో పాస్ అయినా జీవితంలో ఫెయిల్ అవుతారని ఆయన నమ్మకం. ర్యాంకుల పేరుతో చిన్నారులపై ఒత్తిడి తీసుకురావద్దని, తరచూ తోటి ఉపాధ్యాయులు, స్కూల్ యాజమాన్యంతో వాదిస్తూ ఉంటాడు. అందుకే పాటలను కథల రూపంలో వివరిస్తూ చెబితేనే పిల్లలకు సులభంగా అర్థమవుతుందని అంటాడు. ఇక భార్య భాగ్య (కాజల్ చౌదరి) ఆ స్కూల్ కి ప్రిన్సిపాల్ అయినప్పటికీ మేనేజ్మెంట్ మాటలకు కట్టుబడి తరచూ భర్త పై కోప్పడుతూ ఉంటుంది. కేవలం ర్యాంకులు, పేరు ప్రతిష్టల కోసమే పాకులాడే ఆ స్కూల్.. వ్యాస్ మాటలు పట్టించుకోకపోగా అతనిని ఉద్యోగం నుంచి తీసేస్తుంది. కానీ చదువులో వెనుకబడుతున్న చిన్నారులకు ఏదైనా చేయాలనుకున్న వ్యాస్ ఆ తర్వాత ఏం చేశాడు? వారిని స్కూల్ టాపర్లుగా ఎలా తీర్చిదిద్దాడు.. ? ఆ తర్వాత వ్యాస్ జీవితం ఎలా మలుపు తిరిగింది? అనేదే ఈ సినిమా కథ. మొత్తానికైతే నేటి విద్యా వ్యవస్థ, దాని తీరు తెన్ను ప్రశ్నిస్తూ తండ్రి కొడుకుల మధ్య ఉన్న బంధాన్ని భావోద్వేగా ఫలితంగా చూపించిన చిత్రమే ఇది. ఈ సినిమా ప్రేక్షకులనే కాదు అటు విద్యా వ్యవస్థపై కూడా భారీ ప్రభావాన్ని చూపించింది అని చెప్పవచ్చు.
ALSO READ:Manchu Vishnu: ఆమె మరణం నాన్నకు నరకం.. ఎవరూ ఊహించని నిజాలు బయటపెట్టిన విష్ణు!