Allu Ayaan in Pushpa Pre-release event : చాలామంది ప్రేక్షకులకి సినిమా వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి వాళ్ళ కెరియర్ గురించి తెలుసుకోవడంలో చాలా ఆసక్తి ఉంటుంది. అలానే వాళ్ళ కిడ్స్ పైన కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎందుకంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పుడు ఉన్న చాలామంది స్టార్ హీరోలు వారసత్వం వలన వచ్చినవాళ్లే. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలలో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఒకరు. రీసెంట్ గా ఎయిర్పోర్టులో అకీరా ఫోటో చూసి చాలామంది పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) లా ఉన్నాడు. వారసడోస్తున్నాడు అంటూ కామెంట్లు చేయడం కూడా మొదలుపెట్టారు. పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా ఎంట్రీ కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు
ఇకపోతే మహేష్ బాబు కూతురు సితార గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదివరకే చాలా యాడ్స్ అలానే ఇన్స్టాల్ రీల్స్ చేస్తూ బాగా ఫేమస్ అయింది సీతు పాప. సితార (Sithara Ghattamaneni) ఎంత యాక్టివ్ గా ఉంటుందో తన వీడియోస్ చూస్తే తెలుస్తూ ఉంటుంది. నేనొక్కడినే సినిమాలో కనిపించిన గౌతమ్ మళ్లీ మరో సినిమాలో కనిపించలేదు. గౌతమ్, అకీరా వీరిద్దరూ ఎంట్రీ కోసం తెలుగు ప్రేక్షకులు ఎంత ఎదురుచూసిన కూడా వారికంటూ సొంత ఇష్టాలు ఉన్నాయనేది వాస్తవం.
Also Read : Pushpa 2 movie pre release event : పుష్ప 2 కోసం ముఖ్య అతిథిగా రాజమౌళి, ఏమి మాట్లాడతాడో.?
రీసెంట్ టైమ్స్ లో మీమ్ పేజెస్ ఎంత బాగా పాపులర్ అయ్యాయో మనకు తెలిసిందే. ఒక క్యాజువల్ వీడియోకి కూడా కామెడీ కనెక్ట్ చేసి ఎంటర్టైన్మెంట్ ఇవ్వటంలో చాలామంది ముందు వరుసలో ఉంటారు. అలానే అల్లు ఫ్యామిలీలో అల్లు అయాన్ గురించి కొంతమందికి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అల్లు అయాన్ చేసే పనులు అలా ఉంటాయి. అల్లు ఫ్యామిలీ మొత్తం ఒకచోట కనిపించినా కూడా అల్లు అయాన్ మీదకి మన కళ్ళని వెళ్తాయి. ఎందుకంటే అయాన్ అంత యాక్టివ్ గా కనిపిస్తాడు. ఇదివరకే అల్లు అయాన్ కు సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇక సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 డిసెంబర్ 5న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ తరుణంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది చిత్ర యూనిట్. ఈవెంట్ కు అయాన్ కూడా హాజరయ్యాడు. అయితే ఆ ఈవెంట్ లో అయాన్ కనిపిస్తున్న వీడియోలు అన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రావడంతోనే అయ్యాను ఎవరు చూపించకుండానే ముందు సీట్లు వెళ్లి కూర్చున్నాడు. ఇక సుమ యాంకరింగ్ కి రకరకాల ఎక్స్ప్రెషన్స్ కూడా ఇచ్చాడు అయ్యాను ప్రస్తుతం ఆ వీడియోసే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read : RGV On Media : నేను ఏ సినిమా షూటింగ్ చేస్తే నీకు ఎందుకు.?