Pushpa 2 Ticket Prices: అల్లు అర్జున్‌ను మూడేళ్ల తర్వాత వెండితెరపై చూడడం కోసం ఫ్యాన్స్ అంతా ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. చివరికి ‘పుష్ప’ మూవీతో దేశవ్యాప్తంగా ఫ్యాన్స్‌ను అలరించాడు బన్నీ. ఆ తర్వాత ఆ మూవీ సీక్వెల్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తానని మాటిచ్చాడు. కానీ ఆ మాట నిలబెట్టుకోవడానికి తనకు మూడేళ్లు పట్టింది. ‘పుష్ప 2’ సినిమా ఎన్నో వాయిదాలు, ఎన్నో కాంట్రవర్సీలు పూర్తి చేసుకొని ఫైనల్‌గా డిసెంబర్ 5న రిలీజ్ డేట్‌ను ఖరారు చేసుకుంది. కానీ ఇప్పటికీ ఈ సినిమా చుట్టూ ఏదో ఒక కాంట్రవర్సీ నడుస్తూనే ఉంది. తాజాగా ‘పుష్ప 2’కు లీగల్ కష్టాలు కూడా మొదలయ్యాయి. పెరిగిన టికెట్ రేట్లే దీనికి కారణం.
విపరీతమైన ధరలు
‘పుష్ఫ 2’ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిందని, పాన్ ఇండియా సినిమా అని కారణాలు చెప్తూ.. ఈ మూవీకి టికెట్ రేట్లు పెంచాలని తెలంగాణ ప్రభుత్వాన్ని అనుమతి కోరారు మేకర్స్. దీంతో తెలంగాణ ప్రభుత్వం కూడా టికెట్ రేట్లు పెంచడానికి అనుమతినిచ్చింది. అనుమతి ఇచ్చింది కదా అని మామూలు మిడిల్ క్లాస్ మూవీ లవర్స్ సినిమాను థియేటర్లలో ఎంజాయ్ చేయడానికి ఆలోచించే రేంజ్‌లో ధరలు పెంచేశారు నిర్మాతలు. దీంతో చాలామంది ప్రేక్షకులకు ఈ రేంజ్‌లో టికెట్ ధరలు పెరగడం నచ్చలేదు. ఇదే విషయంపై తాజాగా తెలంగాణ హైకోర్టులో పిటీషన్ ఫైల్ అయ్యింది. ‘పుష్ప 2’ టికెట్ రేట్లు పెరిగిన విషయంపై మంగళవారం హైకోర్టులో విచారణ జరగనుంది.
Also Read: పీలింగ్స్ పాటలో ఇది గమనించారా..? సుక్కు ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యావ్..
మూడేళ్లు లేటు
‘పుష్ప 2’ సినిమా మొదలయినప్పటి నుండి ఎన్నో అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. అసలైతే ‘పుష్ప’ విడుదలయిన ఏడాదిలోనే ఈ సీక్వెల్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తానని స్టేట్‌మెంట్ ఇచ్చారు మేకర్స్. కానీ ఈ సీక్వెల్ షూటింగ్ ప్రారంభించుకోవడానికే ఏడాది పట్టింది. అప్పటివరకు పక్కాగా ప్రీ ప్రొడక్షన్‌ను ప్లాన్ చేసుకొని ‘పుష్ప 2’ (Pushpa 2) షూటింగ్ ప్రారంభించినా మధ్యలో ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. చాలాకాలం పాటు ఈ మూవీ షూటింగ్‌కు బ్రేక్ పడింది. దానికి తగిన కారణాలు తెలియకపోయినా చాలాకాలం అల్లు అర్జున్ అసలు ఈ మూవీ షూటింగ్‌లోనే పాల్గొనలేదు. అప్పట్లో ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్ నడిచింది.
ఎన్నో రూమర్స్
సుకుమార్ (Sukumar), అల్లు అర్జున్ (Allu Arjun) ఆఫ్ స్క్రీన్ కూడా బెస్ట్ ఫ్రెండ్స్. అలాంటిది ‘పుష్ప 2’ వల్ల వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని, అందుకే అల్లు అర్జున్ అసలు సినిమా చేయను అని చెప్పి ఫారిన్ వెళ్లిపోయారని.. ఇలా చాలా రూమర్స్ వినిపించాయి. కానీ మూవీ టీమ్ మాత్రం ఈ రూమర్స్‌పై క్లారిటీ ఇవ్వాలని అనుకోలేదు. ఇప్పటికీ సుకుమార్ అసలు ఒక్క ప్రమోషనల్ ఈవెంట్‌కు కూడా రాకపోవడంతో ఇంకా బన్నీతో మనస్పర్థలు అలాగే ఉన్నాయని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఇలాంటివన్నీ దాటుకొని ‘పుష్ప 2’ డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలకు సిద్ధమయ్యింది. మంగళవారం తెలంగాణ హైకోర్టులో ఈ మూవీ టికెట్ ధరల విచారణ తర్వాత దీనిపై ఒక క్లారిటీ రానుంది.