Miss World 2025: మిస్ వరల్డ్ 2025 అందాల పోటీల ఫైనల్స్ హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో అంగరంగ వైభవంగా జరిగాయి. మిస్ వరల్డ్ విజేతను ప్రకటించారు. మిస్ వరల్డ్ 2025 టైటిల్‌ను థాయిలాండ్‌కు చెందిన ఓపల్ సుచాత గెలుచుకుంది. దాదాపు 108 దేశాల నుంచి పోటీదారులు పాల్గొన్నారు. వీరంతా తమ అందం, టాలెంట్ తో న్యాయనిర్ణేతలను ఆకట్టుకునేలా ప్రదర్శన ఇచ్చారు. ఇంతమంది అందగత్తెలను వెనక్కి నెట్టి ఓపల్ సుచాత కిరీటాన్ని కైవసం చేసుకుంది. మిస్ వరల్డ్ కిరీటాన్ని సీఎం రేవంత్ రెడ్డి, జూలియా మోర్లీ, క్రిస్టినా పిజ్కోవా అలంకరించారు. టాప్-4లో మార్టినిక్, ఇథియోపియా, పొలెండ్, థాయిలాండ్ అందగత్తెలు పోటీలో నిలవగా.. ఓపల్ సుచాత అత్యుత్తమ సమాధానం చెప్పి మిస్ వరల్డ్ కిరీటాన్ని అందుకున్నారు. రన్నరప్ గా మిస్ ఇథియోపియా నిలిచింది.
హైటెక్స్‌లో జరిగిన మిస్ వరల్డ్ ఫైనల్స్‌లో సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. సీఎం రేవంత్‌రెడ్డి దంపతులు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దంపతులు, హీరో చిరంజీవి మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, టాలీవుడ్, బాలీవుడ్, పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. మొత్తం 3,500 మంది అతిథులు కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక న్యాయ నిర్ణేతలుగా నటుడు సోనూ సూద్, మేఘా ఇంజనీరింగ్ గ్రూప్ డైరెక్టర్ సుధారెడ్డి, 2017 మిస్ వరల్డ్ విజేత మానుషి చిల్లార్ ఉన్న విషయం తెలిసిందే.
ఇప్పటి వరకు భారత్ నుంచి ఆరుగురు ఈ కిరీటాన్ని దక్కించుకున్నారు. 1966లో రీటా ఫారియా, 1994లో ఐశ్వర్యా రాయ్, 1997లో డయానా హైడెన్, 1999లో యుక్తాముఖి, 2000లో ప్రియాంకా చోప్రా, 2017లో మానుషి చిల్లార్ మిస్ వరల్డ్ అయ్యారు. వెనిజులా కూడా ఆరుసార్లు కిరీటం గెలుచుకుని ఇండియా సరసన నిలిచింది. తర్వాతి స్థానాల్లో యూకే ఐదుసార్లు, యూఎస్ఏ, సౌతాఫ్రికా చెరో మూడుసార్లు కిరీటం గెలిచాయి. తాజా పోటీలో ఎవరికి కిరిటం దక్కబోతోందన్న ఉత్కంఠ పెరుగుతోంది. ఈసారి భారత్ గెలిస్తే మిస్ వరల్డ్ ఎక్కువసార్లు గెలిచిన రికార్డు సొంతమవుతుంది.
ALSO READ: Miss World 2025 Final: మిస్ వరల్డ్ ఫినాలే నేడే.. కిరీటం ఆమెకేనా? ప్రైజ్ మనీ అన్ని కోట్లా?
ఈ సారి అందాల పోటీలు డిఫరెంట్ గా జరిగాయి. మిస్ వరల్డ్ పోటీలు అంటే.. వివిధ దేశాల నుంచి కంటెస్టెంట్లు రావడం, పోటీల్లో పాల్గొనడం, వారి పనేదో వారు చూసుకుని విజేతను ప్రకటించేసి వెళ్లడం ఇదే జరుగుతోంది. కానీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం.. ఈ మెగా బ్యూటీ ఈవెంట్ ను తెలంగాణకు బూస్టప్ వచ్చేలా చేయడంలో సరికొత్తగా ఆలోచించారు. వందకు పైగా దేశాల నుంచి సుందరీమణులు, మీడియా, వారి ప్రతినిధి బృందాలను తెలంగాణలోని ఫేమస్ టూరిస్ట్ ప్రాంతాలకు పంపించారు. అక్కడ కార్యక్రమాలు చాలా పకడ్బందీగా నిర్వహించారు. ప్రపంచదేశాల్లో మంచి కవరేజ్ వచ్చేలా చూసుకున్నారు. శెభాష్ అనిపించుకున్నారు.
ALSO READ: Miss World 2025: మిస్ వరల్డ్ పోటీల నుంచి మిస్ ఇండియా ఔట్
మే 10న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ప్రారంభ వేడుకలు నిర్వహించిన విషయం తెలిసిందే. వివిధ దేశాల నుంచి ఈ పోటీలకు వచ్చిన పోటీదారులంతా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. పర్యటక ప్రాంతాలైన నాగార్జునసాగర్‌లోని బుద్ధిస్టు థీమ్ పార్క్, హైదరాబాద్‌లో చార్మినార్, లాడ్ బజార్, చౌమహల్లా ప్యాలస్, ఓరుగల్లు కోట, భూదాన్ పోచంపల్లి ప్రాంతాల్లో సందడి చేశారు. తెలంగాణ సచివాలయానికి కూడా వెళ్లారు. ఈ పోటీల నిర్వహణకు 27 కోట్ల దాకా ప్రభుత్వం ఖర్చు పెట్టారంటున్నారు. ప్రతిపక్షాలు మాత్రం 200 కోట్ల దాకా అయ్యాయంటున్నాయి.