BigTV English

Sreeleela as Neude Brand Ambassador: రూటు మార్చిన శ్రీలీల.. న్యూడ్ బ్రాండ్ అంబాసిడర్‌గా సంతకం.. పెట్టుబడి పెట్టిన దగ్గుబాటి రానా..!

Sreeleela as Neude Brand Ambassador: రూటు మార్చిన శ్రీలీల.. న్యూడ్ బ్రాండ్ అంబాసిడర్‌గా సంతకం.. పెట్టుబడి పెట్టిన దగ్గుబాటి రానా..!

Sreeleela as Brand Ambassador to Neude Skincare Brand: టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల. ఈ అందం గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. పెళ్లి సందడి సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఫస్ట్ మూవీతోనే మంచి హిట్ అందుకుంది. ఈ మూవీలో తన అందం, అభినయంతో సినీ ప్రియుల్ని ఆకట్టుకుని కుర్రకారు గుండెల్ని పిండేసింది. దీంతో టాలీవుడ్‌లో పలు అవకాశాలు అందుకుని అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకుంది.


స్టార్ హీరోలతో సైతం జతకట్టి తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ తన డాన్స్‌తో ఎక్కువ మందిని ఆకట్టుకుంది. తనకున్న క్రేజ్‌తో గతేడాది ఏకంగా ఏడేనిమిది సినిమాలు చేసింది. కానీ అందులో ధమకా మూవీ తప్ప మరేది ఆమెకు మంచి హిట్ ఇవ్వలేదు. అయినా ఆమె క్రేజ్ ఎక్కడా తగ్గలేదు.

ఇదంతా ఒకెత్తయితే సినీ ఇండస్ట్రీలో ఉండే చాలా మంది సెలెబ్రిటీలు ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బిజినెస్‌లపై ఫోకస్ పెడుతున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు, దీపికా పదుకొనే, అలియా భట్‌సహా మరింత మంది అటు సినిమాలు, ఇటు బిజినెస్‌లపై దృష్టి సారించారు. ఇప్పుడు ఇదే కోవలోకి శ్రీలీల వచ్చి చేరింది. తాజాగా న్యూడ్ స్కిన్‌కేర్ బ్రాండ్‌లోని హై గ్లేజర్ లైన్‌కు శ్రీలీల బ్రాండ్ అంబాసిడర్‌గా సంతకం చేసింది.


Also Read: దొంగగారి గర్ల్ ఫ్రెండ్ కు తల పొగరు ఎక్కువట.. ?

సౌత్‌లో శ్రీలీలకు ఉన్న ఫుల్ పాపులారిటీ, మార్కెట్‌ను బట్టి ప్రొడక్ట్స్ సేల్స్‌ను మరింత పెంచేందుకు న్యూడ్ బ్రాండ్ శ్రీలీలను సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. సినిమాలలో తన అందం, నటన, డాన్స్‌తో సినీ ప్రియుల్ని మెస్మరైజ్ చేసే శ్రీలీలే దీనికి పర్ఫెక్ట్ అని సంస్థ భావించినట్లు తెలుస్తోంది. ఇక దీనిపై శ్రీలీల కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. తన స్కిన్ కేర్ కోసం పాలను ఉపయోగించే పెరిగానని తెలిపింది.

ఇప్పుడు వాటితోనే న్యూడ్ సరికొత్త ప్రొడక్టులను తీసుకురావడం చాలా ఆనందంగా ఉందని చెప్పుకొచ్చింది. ఈ సరికొత్త స్కిన్ సంరక్షణ బ్రాండ్‌తో కలిసి వర్క్ చేయడం సంతోషంగా ఉందని పేర్కొంది. ఫ్యూచర్‌లో ఈ కంపెనీతో మరింత ముందుకు వెళ్లాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పుకొచ్చింది. ఈ మేరకు న్యూడ్ సౌత్‌బే టాలెంట్ సీఈఓ ప్రశాంత్ మాట్లాడుతూ.. సౌత్‌బే టాలెంట్‌తో న్యూడ్ స్కిన్ ప్రొడక్ట్స్ ప్రచారం కోసం శ్రీలీల చేతులు కలపడం హ్యాపీగా ఉందని అన్నారు. అలాగే టాలీవుడ్ హీరో కమ్ నిర్మాత రానా దగ్గబాటి తన స్పిరిట్ మీడియా ద్వారా ఇందులో పెట్టుబడి పెట్టారని తెలిపారు.

Also Read: Kalki Movie Music Director: రేపే ‘కల్కి’ మూవీ విడుదల.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మ్యూజిక్ డైరెక్టర్

అందువల్ల వీరిద్దరి కాంబినేషన్‌ న్యూడ్ జర్నీలో కొత్త అద్యాయాన్ని క్రియేట్ చేస్తుందని సీఈఓ ప్రశాంత్ తెలిపారు. ఇక న్యూడ్ బ్రాండ్ అంబాసిడర్‌గా శ్రీలీల సెలెక్ట్ కావడం.. అందులోనూ దగ్గుబాటి రానా ఇన్వెస్ట్ చేయడం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇక సినిమాలలో తన సత్తా చాటిన శ్రీలీల ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్‌గా అడ్వర్టైజ్‌మెంట్స్‌తో ప్రేక్షకుల్ని అట్రాక్ట్ చేస్తుందో లేదో చూడాలి.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×