Rashmika on VD Birthday :ప్రముఖ కన్నడ ముద్దుగుమ్మ రష్మిక మందన్న (Rashmika Mandanna), యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఎప్పుడైతే కలిసి ‘గీతా గోవిందం’ సినిమా చేశారో.. అప్పటినుంచి వీరి మధ్య పుకార్లు ఊపందుకున్నాయి. ముఖ్యంగా వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. దీంతో ఈ జంటకు ప్రత్యేకమైన అభిమానులు కూడా ఉన్నారు. ఈ సినిమా తరువాత ఎక్కడ చూసినా ఈ జంటే కనిపించింది. ఇద్దరు ఒకరి ఇంట్లో ఒకరు ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకోవడం, కలసి వెకేషన్ కి వెళ్లడం, ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అందరూ వీరిద్దరిని లవ్ బర్డ్స్ అని అనుకుంటున్నారు. కానీ ఇప్పటివరకు ఈ రూమర్లపై అటు విజయ్ దేవరకొండ కానీ, ఇటు రష్మిక మందన్న కానీ రియాక్ట్ అవ్వలేదు .దీంతో రూమర్లు మాత్రం వైరల్ అవుతూనే వున్నాయి.
ముద్దు పేరుతో పిలుస్తూ విజయ్ కి బర్తడే విషెస్ చెప్పిన రష్మిక..
ఇకపోతే వీరిద్దరూ తమ బంధం పై అప్పుడప్పుడు హింట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా.. ఇప్పటివరకు తమ బంధాన్ని క్లారిటీగా ప్రకటించడం లేదు. ఇదిలా ఉండదా ఇటీవల రష్మిక పుట్టినరోజుని రష్మిక, విజయ్ ఇద్దరు కలిసి ఒమన్ దేశంలో సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే నిన్న విజయ్ దేవరకొండ పుట్టినరోజు కావడంతో అభిమానులు, నెటిజన్లు, సెలబ్రిటీలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే రష్మిక మాత్రం విషెస్ చెప్పలేదు. దీంతో నెటిజన్స్ , ఫ్యాన్స్ కూడా ఏమైంది? ఎందుకు రష్మిక విషెస్ తెలియజేయలేదు? అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు. కానీ సడన్గా నిన్న రాత్రి చాలా లేట్ గా అయినా స్పెషల్ గా విషెస్ చేస్తూ పోస్ట్ పెట్టింది రష్మిక.. అందులో విజయ్ దేవరకొండను ముద్దు పేరుతో పిలుస్తూ మరీ పోస్టు పెట్టడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
రష్మిక.. విజయ్ ను ప్రేమగా ఏమని పిలుస్తుందంటే..?
నిన్న రాత్రి రష్మిక మందన్న తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో విజయ్ దేవరకొండ క్యూట్ ఫోటో షేర్ చేసి.. “నేను లేటుగా చెప్తున్నాను అని తెలుసు.. కానీ హ్యాపీ బర్తడే విజ్జు.. నువ్వు ప్రతిరోజు ఇలాగే సంతోషంగా, ఆరోగ్యంగా, ప్రశాంతంగా, నవ్వుతూ ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. నీ జీవితంలో నువ్వు అనుకున్న ప్రతీదీ కూడా అందుకోవాలని ఆకాంక్షిస్తున్నాను” అంటూ పోస్ట్ పెట్టింది. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. అందులో విజయ్ ను రష్మిక విజ్జు అని ప్రేమగా పిలుస్తుందని అందరికీ అర్థమైపోయింది. ఇంకేముంది మరొకసారి అభిమానులు, అటు నెటిజన్లు ఈ ప్రేమ జంట గురించి సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు.
ALSO READ ; Pushpa 3 : అన్నీ అడ్డంకులే.. ఇప్పట్లో వర్కౌట్ అయ్యేలా లేదే..?
మంచి మనసు చాటుకున్న విజయ్ దేవరకొండ..
విజయ్ దేవరకొండ నిన్న తన పుట్టినరోజు కావడంతో తన గొప్ప మనసు చాటుకున్నారు. దేశం కోసం త్యాగాలు చేస్తున్న ఇండియన్ ఆర్మీకి తన రౌడీ బ్రాండ్ దుస్తులు అందిస్తానని ప్రకటించారు. ఇక ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. విజయ్ దేవరకొండ ప్రస్తుతం కింగ్డమ్ (Kingdom ) అనే సినిమాతో మే 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే సాంకృత్యన్ ఉన్నతో కూడా ఒక సినిమా చేస్తున్నారు. అటు రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ తో పాటు పలు సినిమాలు లైన్ లో పెట్టింది.