Harish Rao: మాజీ మంత్రి, బీఆర్ ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకు బిగ్ షాక్ తగిలింది. హరీష్ రావుపై మరో కేసు నమోదు అయింది. చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు నగరంలో బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.
మాజీ మంత్రి హరీష్‌రావుపై మరో కేసు నమోదైంది. హరీష్‌రావు పై బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. హరీష్‌రావుతో పాటు ఇటీవల జైలు నుండి విడుదలైన తన అనుచరులు బెదిరింపులు దిగుతున్నారని.. చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. దీంతో ఆయనపై BNS యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు పోలీసులు. హరీష్ రావుతో పాటు సంతోష్ కుమార్, రాములు, వంశీపై కేసు నమోదు అయ్యింది. హరీష్ రావుపై 351(2), ఆర్‌డబ్ల్యూ 3(5)సెక్షన్ల్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్ఐర్‌లో రెండో నిందుతుడిగా హరీష్‌రావు పేరును పోలీసులు తెలిపారు.
Also Read: ఖద్దరు నేరస్థుల్ని వదిలేయాలా? శిక్షలు వద్దంటున్న కేంద్రం
ఇప్పటికే పంజాగుట్ట పోలీస్టేషన్‌లో తన పైన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో.. ఆయన కుటుంబమే కాకుండా, డ్రైవర్ సైతం కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారు. లొకేషన్‌తో కాకుండా మిగతా అన్ని అంశాలకు సంబంధించి ఎవిడెన్స్‌తో సహా పండాగుట్ట పీఎస్ పరిధిలో సబ్మిట్ చేయడంతో.. ఆ కేసుకి సంబంధించి వెంటనే విత్ డ్రా చేసుకోవాలనేది చక్రధర్ గౌడ్ని నిందులు బెదిరిస్తున్నారు. దీంతో బాచుపల్లి పోలీసులు ఫిర్యాదు ఆధారంగా హరీష్‌రావుతో పాటు, ఇటీమల జైలు నుంచి విడుదలైనటువంటి అంశారులకు సంబంధించి బెదిరింపులకు దిగుతున్నారని ఎఫ్ఐర్ నమోదు చేశారు.
ఇదిలా ఉంటే.. SLBC టన్నెల్‌లో పనులు మొదలే కాలేదన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మంత్రి జూపల్లి కృష్ణారావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అనుకోకుండా జరిగినా ప్రమాదాలను కూడా రాజకీయం చేయడం ఏంటని ప్రశ్నించారు. కాళేశ్వరం గురించి గొప్పులు చెప్పుకునే బీఆర్ఎస్..దాని కన్నా చిన్నదైన ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌ను..ఎందుకు పూర్తి చేయలేకపోయిందో చెప్పాలన్నారు. బీఆర్ఎస్ కామెంట్లకు జూపల్లి కౌంటర్ ఎటాక్ చేశారు.