Sridevi: సినీఇండస్ట్రీలో హీరోయిన్‌గా ఓ వెలుగువెలిగింది.. నటి శ్రీదేవి. బాలనటిగా ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసిన శ్రీదేవి తన అందం, అభినయంతో సినీ ప్రియులను అలరించింది. అన్ని భాషల్లోనూ దిగ్గజ హీరోల సరసన నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. భారతీయ చిత్రసీమను ఏలి.. ఎన్నో అవార్డులను, రివార్డులను అందుకుంది. ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించిన శ్రీదేవి.. 2018 ఫిబ్రవరి 24న మరణిచింది.
ప్రస్తుతం శ్రీదేవీ జీవితంలో జరిగిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పుస్తక రూపంలో తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రముఖ పరిశోధకుడు, రచయిత ధీరజ్ కుమార్ శ్రీదేవి బయోగ్రఫీని రచించనున్నారు. ది లైఫ్ ఆఫ్ ఎ లెజెండ్ పేరుతో శ్రీదేవి జీవిత చరిత్రను పుస్తకరూపంలో తీసుకురానున్నారు.
ధీరజ్ కుమార్, శ్రీదేవి జీవిత చరిత్రను పుస్తకంగా రాయడం తనకు ఎంతోషంగా ఉందని.. శ్రీదేవి భర్త బోనీ కపూర్ అన్నారు. శ్రీదేవి ఒక అద్భుతమని.. ఆమెకు నటన అంటే ఎంతో ఇష్టమని వెల్లడించారు. అభిమానుల నుంచి వచ్చే స్పందనను చూసి శ్రీదేవి ఎంతో సంతోషించేదని తెలిపారు.