Allari Naresh: కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్.. అల్లరి నరేష్. ఆయన కామెడీ టైమింగ్ వేరే లెవెల్. ఫన్ కావాలంటే నరేష్ సినిమాలు చూడాల్సిందే. ఆయన సినిమా రిలీజ్ అయిందంటే చాలు థియేటర్లన్నీ దద్దరిల్లిపోతాయి. కితకితలు, కత్తికాంతారావు, సీమశాస్త్రి, బెండు అప్పారావు, సుడిగాడు, కెవ్వుకేక, యముడికి మొగుడు వంటి సినిమాలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు.. నరేష్.
అయితే కామెడీ హీరోగా మంచి పేరు తెచ్చుకున్న నరేష్.. ప్రస్తుతం ట్రెండ్ మార్చాడు. సీరియస్ సినిమాలపై ఫోకస్ పెట్టాడు. నాంది, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం వంటి సినిమాల్లో నటించి తనలోని సీరియస్ యాంగిల్‌ను ప్రేక్షకులకు రుచి చూపించాడు. విజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన నాంది సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.
ప్రస్తుతం విజయ్, నరేష్ కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతోంది. ఆ సినిమా పేరే ఉగ్రం. ఈ మూవీ ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో నరేష్ సరసన దర్శన నటిస్తోంది. అయితే నాంది సినిమా హిట్ కావడంతో.. మళ్లీ వారిద్దరి కాంబినేషన్‌లో ఈ మూవీ వస్తుండడంతో ప్రేక్షకులలో అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇక ఈ మూవీ టీజర్‌ను శివరాత్రి సందర్భంగా ఈనెల 18న రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట.