Sreekanth Family: ప్రముఖ సినీ నటుడు శ్రీకాంత్ (Srikanth)తన కుటుంబంతో కలిసి ఇటీవల శ్రీకాళహస్తి(Srikalahasti) వెళ్లిన విషయం తెలిసిందే. శ్రీకాళహస్తిలో ఈయన ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే శ్రీకాంత్ తన భార్య పిల్లలతో కలిసి శ్రీకాళహస్తిలోని రాఘవేంద్ర స్వామి మఠంలో ఈ నెల 29వ తేదీ నవగ్రహ శాంతి పూజలు చేయించుకున్నారు. శ్రీకాళహస్తి ఆలయంలో పనిచేసే కొంతమంది అర్చకులు వేద పండితుల సమక్షంలో ఈ పూజా కార్యక్రమాలను శ్రీకాంత్ ఫ్యామిలీకి ప్రత్యేకంగా జరిపించారు.
నవగ్రహ శాంతి పూజలు…
ఇలా శ్రీకాంత్ ఫ్యామిలీ కోసం పండితులు ప్రవేట్ పూజ చేసినటువంటి ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి .దీంతో పూజ చేసిన పండితులకు ఆలయ అధికారుల నుంచి ఊహించని షాక్ ఎదురైంది. శ్రీకాళహస్తి ఆలయంలో పనిచేసే అర్చకులకు కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. అక్కడ పనిచేసే పండితులు ఎవరూ కూడా బయట ఎలాంటి ప్రైవేటు పూజలు చేయకూడదనే నియమాలు ఉన్నాయి. ఏ ఆలయంలో పనిచేసే అర్చకులు ఆ ఆలయంలోనే పనిచేయాలని, అలా కాకుండా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే వారిపై దేవాదాయ శాఖ చట్ట ప్రకారం చర్యలు తీసుకొనే అవకాశాలు కూడా ఉన్నాయి.
నిబంధనలకు విరుద్ధంగా….
ఇప్పుడు శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయంలో పనిచేసే అర్చకులు రాఘవేంద్ర స్వామి మఠంలో శ్రీకాంత్ కోసం పూజలు చేయడంతో ఆ పండితుడి పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్న నేపథ్యంలో దేవస్థానం ఈవో బాపిరెడ్డి ఈ ఘటనపై స్పందిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేవాలయ నియమ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన తీరుపై సదరు పండితుడిని సస్పెండ్(Suspende) చేస్తూ ఉత్తర్వులను జారీ చేశారు.దేవాదాయ ధర్మాదాయ శాఖ చట్టం 30/1987 ఉద్యోగి నియమాలను ఉల్లంఘించిన నేపథ్యంలో ఆయనను విధుల నుంచి తొలగించినట్లు బాపిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
హీరో శ్రీకాంత్ కి ప్రైవేటు పూజలు చేసారని పండితుడిపై సస్పెన్షన్ వేటు
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి ఆలయ వేద పండితుడిపై సస్పెన్షన్ వేటు పడింది. సినీ నటుడు శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేటుగా నవగ్రహ శాంతి పూజలు నిర్వహించిన వ్యవహారంపై శ్రీకాళహస్తి ఆలయ అర్చకుడిపై ఆలయ అధికారులు… pic.twitter.com/MvR8sVDeI8
— ChotaNews App (@ChotaNewsApp) May 31, 2025
ఇకపోతే గతంలో కూడా ఇలా ఎంతోమంది పండితులు ప్రైవేట్ గా పూజలు చేసినప్పటికీ వారిపై చర్యలు తీసుకోలేదు కానీ ఇటీవల కాలంలో ఈ విధమైనటువంటి నియమ నిబంధనలను పెట్టినట్టు తెలుస్తోంది. ఇలా నియమాలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటే ఇకపై ఇలాంటి తప్పులు ఎవరు చేయరన్న ఉద్దేశంతోనే సస్పెండ్ చేశారని తెలుస్తోంది. ఇలా తన ఫ్యామిలీ కోసం ప్రత్యేకంగా పూజలు చేసిన పండితులపై వేటుపడటం పట్ల ఇప్పటివరకు శ్రీకాంత్ ఎక్కడ స్పందించలేదు. మరి ఈ ఘటనపై శ్రీకాంత్ స్పందన ఏంటి అనేది తెలియాల్సి ఉంది. ఇక శ్రీకాంత్ విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్నారు. యంగ్ హీరోల సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ పలు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇలా సపోర్టివ్ రోల్స్ చేస్తూ శ్రీకాంత్ ప్రస్తుతం బిజీగా గడుపుతున్నారు. మరోవైపు తన పెద్ద కుమారుడు రోషన్ కూడా ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక రోషన్ కూడా తన సినిమా పనులలో బిజీ బిజీగా ఉంటున్నారు.