BigTV English

Actor Srikanth: హీరోయిన్ ఊహా రీఎంట్రీ.. శ్రీకాంత్ ఏమన్నాడంటే.. ?

Actor Srikanth: హీరోయిన్ ఊహా రీఎంట్రీ.. శ్రీకాంత్ ఏమన్నాడంటే.. ?

Actor Srikanth: నటుడు శ్రీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విలన్ గా కెరీర్ ను ప్రారంభించి.. హీరోగా మారి.. ఎన్నో మంచి సినిమాల్లో నటించి మెప్పించాడు. ఇక కుర్ర హీరోలు ఇండస్ట్రీని ఏలుతున్న సమయంలో హీరో నుంచి మరోసారి విలన్ గా, సపోర్టివ్ రోల్స్ లో అదరగొడుతున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్న శ్రీకాంత్.. ఈ మధ్యనే బెంగుళూరు రేవ్ పార్టీలో దొరికినట్లు వార్తలు వచ్చాయి.


ఇక ఈ రేవ్ పార్టీలో ఉన్నది తాను కాదని శ్రీకాంత్ క్లారిటీ ఇచ్చాడు. తనలానే ఎవరో ఉన్నారని, తనది పార్టీలో తిరిగే వ్యక్తిత్వం కాదు అని చెప్పుకొచ్చాడు. గతంలో తన భార్య ఊహతో కూడా విడాకులు తీసుకున్నట్లు కూడా రాశారని, ఇలాంటి రూమర్స్ ను అభిమానులు నమ్మొద్దని తెలిపాడు. శ్రీకాంత్ కు అందమైన ఒక కుటుంబం ఉంది. శ్రీకాంత్ .. హీరోయిన్  ఊహను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు. పెద్ద కొడుకు రోషన్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం మలయాళంలో మోహన్ లాల్ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నాడు.

ఇక రెండో కూతురు మేధ. హీరోయిన్లను మించిన అందం ఆమె సొంతం. ప్రస్తుతం కెనడాలో పెద్దచదువులు చదువుతుంది. ఇక మూడోవాడు రోహన్. అతడు కూడా చదువుకుంటున్నాడు. శ్రీకాంత్ కు పిల్లలే లోకం. అయితే తన పిల్లలు ఎప్పుడు తన పేరును బయట వాడడానికి ఇష్టపడరని శ్రీకాంత్ తెలిపాడు. సాధారణంగా సెలబ్రిటీల పిల్లలు అంటే .. మా నాన్న హీరో.. మా అమ్మ హీరోయిన్ అని చెప్పుకుంటారు. కానీ శ్రీకాంత్ పిల్లలు మాత్రం మా నాన్న శ్రీకాంత్ అని ఎక్కడా చెప్పుకోవడానికి ఇష్టపడరట.


ఇక ఈ విషయమై ఒక ఇంటర్వ్యూలో శ్రీకాంత్ మాట్లాడుతూ.. ” నా పిల్లలు నా పేరు ఎక్కడా చెప్పుకోవడానికి ఇష్టపడరు. రోషన్ తన చదువును పూర్తిచేసాకే హీరోగా మారాడు. కాలేజ్ లో వాడెప్పుడు మా నాన్న శ్రీకాంత్ అని చెప్పలేదు. ఇక కెనడాలో మేధ చదువుతుంది. అక్కడ తెలుగు ఫ్రెండ్స్ కూడా శ్రీకాంత్ కూతురు అని తెలియదు. వారికి నా పేరుతో కాకుండా స్వంతంగా ఎదగాలని కోరిక. తమ కష్టంతోనే పైకి రావాలని ప్రయత్నిస్తూ ఉంటారు.ఇక పెళ్లి తరువాత ఊహ సినిమాలు చేయడానికి కారణం నేను కాదు. పిల్లలే. ఆమెకు వారే ప్రపంచం. వారి ఆలనాపాలనా చూసుకుంటూ సినిమాల వైపు చూడలేదు. ఇప్పుడు అందరం హ్యాపీగా ఉన్నాం” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం శ్రీకాంత్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×