BigTV English

Phone Tapping Case: 1200 మంది ఫోన్లు ట్యాప్ చేశాం..అందులో ఎవరెవరున్నారంటే ? : ప్రణీత్ రావు

Phone Tapping Case: 1200 మంది ఫోన్లు ట్యాప్ చేశాం..అందులో ఎవరెవరున్నారంటే ? : ప్రణీత్ రావు

Praneeth Rao Statement In Phone Tapping Case(TS today news): రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడైన మాజీ పోలీస్ అధికారి ప్రణీత్ రావు వాంగ్మూలం ఇచ్చారు. ఇందులో అనేక సంచలన విషయాలను ఆయన వెల్లడించారు.


56 మంది ఎస్‌వోటీ సిబ్బందితో కలిసి 1200 మంది ఫోన్లు ట్యాప్ చేశామని ప్రణీత్ రావు వాంగ్మూలంలో తెలిపారు. ప్రధానంగా ప్రతిపక్ష నేతలపై దృష్టి పెట్టినట్లు ఒప్పుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ పర్యవేక్షణ కోసం 17 కంప్యూటర్లు వినియోగించినట్లు వెల్లడించారు. ప్రధానంగా ప్రతిపక్ష నేతలపై నిఘా ఉంచినట్లు వాంగ్మూలంలో ప్రణీత్ రావు తెలిపారు. ప్రతిపక్ష నేతలకు వెళ్లే డబ్బును అడ్డుకున్నామని చెప్పారు.

జడ్జిలు, నేతలు, స్థిరాస్తి వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేశామన్నారు. కన్వర్జెన్స్ ఇన్నోవేషన్ ల్యాబ్ సాయంతో ట్యాపింగ్ చేసినట్లు స్పష్టం చేశారు. 17 కంప్యూటర్లను ఫోన్ ట్యాపింగ్ కోసం వినియోగించినట్లు తెలిపారు. అంతే కాకుండా ట్యాపింగ్ కోసం 56 మంది ఎస్‌వోటీ సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ట్యాపింగ్ ఆపేయాలని ప్రభాకర్ రావు చెప్పారని ప్రణీత్ రావు అన్నారు.


ఫోన్లు,పెన్‌డ్రైవ్ లు బేగంపేట్ నాలాలో పడేశామని.. అందుకే పాత వాటిని ద్వంసం చేసి వాటి స్థానంలో కొత్త వాటిని అమర్చినట్లు వెల్లడించారు. ధ్వంసం చేసిన ఆధారాలను నాగోల్, ముసారాంబాగ్ వద్ద ఉన్న మూసీ పదిలో పడేసినట్లు తెలిపారు. ఫార్మెట్ చేసిన ఫోన్లు, పెన్‌డ్రైవ్ లు బేగంపేట్ నాలాలో పడేసినట్లు తెలిపారు.

Also Read: ఫోన్ ట్యాపింగ్ కేసు.. తీగలాగితే డొంక, జడ్జీలు, అడ్వకేట్ సహా..

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడైన అదనపు ఎస్పీ నాయని భుజంగరావు రాజకీయ నాయకుల ఫోన్లనే కాకుండా జడ్జీలు, జర్నలిస్టుల ఫోన్లను ట్యాప్ చేసినట్లు  తెలిపారు. 2018 శాసన సభ ఎన్నికల ముందు ట్యాపింగ్ చేయడం ప్రారంభించామన్నారు.

Tags

Related News

Weather News: కొన్ని గంటల్లో ఈ ఏరియాల్లో భారీ వర్షం.. ఇక రాత్రంతా దంచుడే

Nagarjunasagar flood: నాగార్జునసాగర్‌ గేట్లు ఎత్తివేత.. సందర్శకులకు బిగ్ అలర్ట్!

Hyderabad Rains: అమీర్‌పేట ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు

Malreddy Ranga Reddy: రంగారెడ్డి ఎమ్మెల్యే మల్‌రెడ్డి కుటుంబంలో రాఖీ పండుగ రోజే విషాదం

Rain News: భారీ వర్షం.. ఈ జిల్లాల్లో కుండపోత వాన.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు

Guvvala Balaraju: బీజేపీలో చేరిన గువ్వల.. కేటీఆర్‌పై హాట్ కామెంట్స్..

Big Stories

×