Sreeleela : టాలీవుడ్ యంగ్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రీలీల గురించి ఎంత చెప్పిన తక్కువే. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఆ మూవీ తర్వాత ఈమెకు వరుస అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని అందుకుంటూ ఇండస్ట్రీలో దూసుకుపోతుంది. అయితే అతి తక్కువ కాలంలో పదుల సంఖ్యలో సినిమాలు చేసింది. అయితే అందులో కొన్ని సినిమాలు మాత్రమే స్టార్ ఇమేజ్ ను అందుకొనేలా చేశాయి. మిగిలిన సినిమాలు కనీసం యావరేజ్ టాక్ ను కూడా అందుకోలేక పోయాయి.. అయితే ఏడాది పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ వరుస సినిమాలతో బిజీ అవుతుంది. తాజాగా ఈ అమ్మడు గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి చక్కర్లు కొడుతుంది. అదేంటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..
హీరోయిన్ శ్రీలీల ఇండస్ట్రీలోకి వచ్చిన కొంత కాలంలోనే ఈమె స్టార్ ఇమేజ్ ను అందుకుంది. రాకెట్ లాగా దూసుకుపోతు వరుస సినిమాలను లైన్లో పెట్టుకుంటూ అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. చేతిలో ఒక సినిమా ఉండగానే మరో నాలుగు సినిమాలను లైన్లో పెట్టుకుంది.. కథలు ఎంపిక విషయంలో సరిగ్గా జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఆమె నటించిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. కానీ శ్రీలీలకు దిష్టి తగిలిందో ఏమో గానీ వరుస పరాజయాలు చవిచూసింది. అవకాశాలు తగ్గాయి. అయితే ‘పుష్ప-2’లో కిస్సిక్ అంటూ చేసిన సందడితో మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది.. ఇప్పుడు మళ్లీ పరుస అవకాశాలు ఆమెను పలకరిస్తున్నాయి. అయితే శ్రీలీల గతంలో చేసిన తప్పే ఇప్పుడు మళ్ళీ చేస్తుందని వార్త నెట్టింట ప్రచారంలో ఉంది..
ఒక్క ఐటెం సాంగ్ ఆమె జీవితాన్ని మార్చేసిందని చెప్పాలి. వరుసగా సినిమాలను లైన్లో పెట్టుకుంటూ బిజీగా ఉన్న శ్రీలీల, రెమ్యూనరేషన్ ను కూడా భారీగా పెంచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. శ్రీలీల ఇక్కడ ఓ తప్పు చేస్తుందని టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. అదేంటంటే.. కాల్షీట్లు అందుబాటులో ఉన్నాయో, లేదో చూడకుండా అడ్వాన్సులు తీసుకుంటోందట. డేట్ల గురించి ఆలోచించుకున్న వరుసగా సినిమాలను అనౌన్స్ చేస్తూ బిజీగా ఉంది. ఇక్కడే శ్రీలీల ఒక సినిమాకు మరో సినిమాకు ఆలస్యం చేస్తుందనే టాక్ ని అందుకుంది. రవితేజ ‘మాస్ జాతర’లో శ్రీలీల కథానాయిక. అయితే ఇప్పుడు శ్రీలీల వల్ల ఈ ప్రాజెక్ట్ ఆలస్యం అవుతోంది. ఇప్పటి వరకూ 12 రోజులపాటు కాల్షీట్లు ఇచ్చింది. మరో 20 రోజుల పాటు తన డేట్లు కావాలి. కానీ ఆమె ఓ తమిళ సినిమాకు వరుస డేట్లు ఇచ్చింది ఇలా చేయడం వల్ల కొత్త సినిమాలు ఏమో గాని ఉన్న సినిమాలు కూడా చేజారి పోయే అవకాశాలు ఉన్నాయని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. డబ్బులు ముఖ్యం కాదు.. ఇండస్ట్రీలో ఉన్న క్రేజ్ ను చెడగొట్టుకోవద్దు సలహా ఇస్తున్నారు.. మరి శ్రీలలా ఫ్యాన్స్ కోరిక మేరకు సినిమాలను తగ్గించుకుంటుందో లేదో చూడాలి..