Srinivas Reddy:టాలీవుడ్ ఫేమస్ కమెడియన్స్ అనగానే ఎంతోమంది కమెడియన్ల పేర్లు వినిపిస్తాయి. వారందరిలో శ్రీనివాస్ రెడ్డి (Srinivas Reddy) కూడా ఒకరు. అయితే అలాంటి శ్రీనివాస్ రెడ్డి గతంలో జూనియర్ ఎన్టీఆర్(Jr.NTR) తో చాలా సన్నిహితంగా ఉండేవారు. ఎంతలా అంటే ఇప్పటికి కూడా రాజీవ్ కనకాల (Rajeev kanakala) , ఎన్టీఆర్ ఎంత సన్నిహితంగా ఉంటారో.. అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ శ్రీనివాస్ రెడ్డిలు అలా ఉండేవారు. అయితే వీరిద్దరి మధ్య ఏం గొడవలు వచ్చాయో ఏమో తెలియదు కానీ సడన్గా వీరిద్దరి మధ్య గ్యాప్ పెరిగింది. అయితే ఎన్టీఆర్ తో ఎందుకు గొడవ జరిగింది..? ఇద్దరి మధ్య గ్యాప్ రావడానికి కారణమేంటి? అనే విషయం గురించి.. శ్రీనివాస్ రెడ్డికి ఓ ఇంటర్వ్యూలో ప్రశ్న ఎదురైంది.
శ్రీనివాస్ రెడ్డి – ఎన్టీఆర్ మధ్య గ్యాప్ రావడానికి కారణం..?
అయితే ఆ ఇంటర్వ్యూలో శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. జూనియర్ ఎన్టీఆర్(Jr. NTR) కి, నాకు గ్యాప్ వచ్చింది నిజమే.కానీ గొడవలు అయితే ఎక్కడా జరగలేదు. పైగా ఈ గ్యాప్ మాకు మేము ఇచ్చుకున్నది కాదు ఎవరో మా ఇద్దరి మధ్య క్రియేట్ చేసింది.ఒకప్పుడు ఎన్టీఆర్ తో నేను చాలా సన్నిహితంగా ఉండేవాడిని. కానీ ఎన్టీఆర్ కి ఎవరు ఏం చెప్పారో తెలియదు కానీ మా ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిపోయింది. ఒకప్పుడు ఆయన సినిమాల్లో నేను నటించేవాడిని. కానీ ఆయనకు పెళ్లయిపోవడం, నేను కూడా సినిమాల్లో బిజీగా ఉండడం,ఆ తర్వాత ఆయన తన సినిమాల్లో అవకాశాలు ఇచ్చినా కూడా ఆ పాత్రలకు అంతగా ప్రాముఖ్యత లేకపోవడంతో నేను అందులో చేయలేదు. దాంతో మా మధ్య మరింత గ్యాప్ పెరిగింది.
నావల్లే ఎన్టీఆర్ ఉన్న కారుకు యాక్సిడెంట్ అయిందన్నారు..
అయితే జూనియర్ ఎన్టీఆర్ కి నాకు మధ్య గ్యాప్ పెరిగింది ఎన్నికల ప్రచార సమయంలో.. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ టిడిపి పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సమయంలో రాజీవ్ కనకాల(Rajeev Kanakala),సమీర్ (Sameer), రాఘవ (Raghava),రఘు (Raghu) ఇలా ఎంతోమంది ఆయనతో ప్రచారంలో పాల్గొన్నాం. నేను ఖమ్మంలో జాయిన్ అవుతాను అని చెప్పాను. అలా ఖమ్మం కి వచ్చాక నేను ఎన్టీఆర్ (NTR)తో ప్రచారంలో జాయిన్ అయ్యాను. ఇక ఆరోజు జరిగిన ప్రచారంలో ఖమ్మందే టాప్.. అయితే అదే రోజు హైదరాబాద్ వెళ్లే సమయంలో ఎన్టీఆర్ ఆయన కారులోనే నన్ను ఎక్కమన్నారు. కానీ నా బ్యాగు వేరే కార్ లో ఉండడంతో వెనుక కారులో వస్తానని చెప్పాను. అప్పుడే సడన్గా ఎన్టీఆర్ ఉన్న కారుకి యాక్సిడెంట్ అయింది. ఒక పిచ్చివాడు ఎవరితోనో మాట్లాడుతున్నాడని అటు చూడగా కారు బోల్తా పడింది. ఆ తర్వాత ఎన్టీఆర్ ని బయటికి తీయగా అస్సలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాడు. తల నుండి రక్తస్రావం జరుగుతోంది.
కావాలనే మా మధ్య గ్యాప్ క్రియేట్ చేశారు- శ్రీనివాస్ రెడ్డి
దాంతో నేను వెంటనే నా బ్యాగ్ లో ఉన్న క్లాత్ ని తీసి ఆయన తలకు చుట్టేసాను.ఆ తర్వాత కిమ్స్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. ఎన్టీఆర్ దెబ్బలు తాకి ఇబ్బంది పడుతున్న సమయంలో ఒక వ్యక్తి కావాలనే అన్నాడో లేదో నాపై సెటైర్ వేసాడో తెలియదు కానీ నువ్వు అడుగు పెట్టావు ఎన్టీఆర్ కి యాక్సిడెంట్ జరిగింది అంటూ నన్ను అపశకునంగా మాట్లాడాడు.దాంతో నాకు కోపం వచ్చి నన్ను అవమానిస్తున్నారా..? అసలు నేను అక్కడ లేకపోతే ఆయన ఏమయ్యేవారో..? నేను ఉండబట్టే ప్రాణాలతో వచ్చారు.. అని చెప్పాను. అయితే ఇదే మాటను వేరే విధంగా ఎన్టీఆర్ కి చెప్పారు కావచ్చు.. అందుకే అప్పటినుండి నన్ను ఎన్టీఆర్ (NTR) దూరం పెట్టారు.అయితే నేను మాట్లాడిన ఉద్దేశం వేరు. వాళ్ళు ఎన్టీఆర్ కి చెప్పింది వేరు.. అందుకే మా మధ్య గ్యాప్ వచ్చింది అంటూ ఎన్టీఆర్ చుట్టూ ఉన్నవాళ్లు తనకు ఎన్టీఆర్ కి మధ్య గ్యాప్ పెంచారంటూ ఇండైరెక్ట్ గా చెప్పారు శ్రీనివాస్ రెడ్డి.. ప్రస్తుతం శ్రీనివాస్ రెడ్డి (Srinivas Reddy) మాట్లాడిన మాటలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.