BigTV English

CM Chandrababu Naidu: మంత్రులకు, అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

CM Chandrababu Naidu: మంత్రులకు, అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

CM Chandrababu Naidu: ఏపీలో వాట్సాప్ గవర్నెర్స్ పై, ఫైళ్ల వేగంపై సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఫైళ్ల క్లియరెన్స్ లో మంత్రులు, అధికారులు వేగం పెంచాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఈ- ఆఫీస్ లో ఫైళ్ల క్లియరెన్స్ ప్రక్రియ వేగవంతం చేయాలని, పలు శాఖల్లో ఈ ఆఫీస్ ఫైళ్ల క్లియరెన్స్ జరుగుతోన్న ప్రక్రియపై ఆర్టీజీఎస్ సీఈవో కే. దినేష్ కుమార్ ప్రజెంటేషన్ ఇచ్చారు.


గవర్నమెంట్ ఈ-ఆఫీసులో ఫైళ్లు క్లియ‌రెన్సు లో వేగం పెర‌గాలని, ఫైళ్లు ఎక్కడికక్కడ క్లియ‌ర్ కాకుండా ఆగిపోతున్నాయ‌నే దానిపైన కార్యద‌ర్శులు, శాఖ‌ల విభాగాధిప‌తులు స‌మీక్ష చేసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. ఫైళ్ల విషయంలో ఆలస్యం చేయకూడదని అన్నారు. ఆలస్యం అవ్వడానికి గల కారణాలు వెంటనే తెలుసుకుని వాటిని తొలగించి ఫైళ్లను త్వరితగతిన పరిష్కారం చేయాలని అధికారులను ఆదేశించారు. అధికారులు అందరూ సమిష్టంగా పని చేయాలని చెప్పారు. ఫైళ్లలో ఆర్థిక, ఆర్థికేతర అనే రెండు రకాల ఫైళ్లు ఉంటాయని.. ఆర్థికేతర ఫైళ్ల పరిష్కారంలో ఫైళ్లను ఎప్పటికప్పుడూ వేగవంతం చేయాలని అన్నారు. ఆర్థికేతర ఫైళ్ల పరిష్కారంలో ఎట్టి పరిస్థితుల్లో పెండింగ్ ఉంచకూడదని పేర్కొన్నారు. ఆర్థిక పరమైన ఫైళ్లు ఆయా శాఖల్లోని బడ్జెట్ తదితర అంశాలను సమీక్షించుకొని ఫైళ్లను ఎప్పటికప్పుడూ సమీక్షించాలని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.

పలు శాఖల్లో కొంత మంది అధికారులు ఫైళ్లను తమ వద్దే ఆరు నెలలు, ఏడాది వరకు ఉంచుకుంటున్నారని.. ఇది సరైన పద్దతి కాదని అన్నారు. కొన్ని ప్రభుత్వ శాఖల్లో సగటున మూడు రోజుల్లోనే ఫైళ్లు క్లియరెన్స్ అవుతున్నాయని.. మరి కొన్ని శాఖల్లో ఫైళ్లు ఆలస్యం అవుతున్నాయని .. ఆర్టీజీఎస్ సీఈవో దినేష్ కుమార్ వివరణ ఇచ్చారు. అయితే, గిరిజన హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని సీఎం నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. 1/70 చట్టాన్ని తొలగించే ఉద్దేశ్యం ఎట్టి పరిస్థితుల్లో లేదని తేల్చి చెప్పారు. గిరిజన జాతుల అస్థిత్వాన్ని కాపాడుకోవడం అంటే మన దేశ సంస్కృతిని కాపాడుకోవడమే అని తాము బలంగా నమ్ముతున్నామని స్పష్టం చేశారు. అందుకే గిరిజనుల విద్య, వైద్యం, జీవన ప్రమాణాలను మెరుగు పరుచుకోవడానికి తాము నిరంతరం పని చేస్తున్నామని చెప్పారు.


Also Read: Apprentice Jobs: ఆర్ఆర్‌సీ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 1154 అప్రెంటీస్ పోస్టులు.. టెన్త్, ఐటీఐ, ఇంటర్ పాసైతే చాలు.. మూడు రోజులే గడువు

యాక్ట్ 1/70 మార్చే ఆలోచన ప్రభుత్వానికి లేదని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. 1/70 యాక్ట్ ను పరిరక్షిస్తామని, ఆదివాసీ చట్టాలను అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని.. గిరిజనలు ఆందోళన చెందవద్దని గమంత్రి పేర్కొన్నారు. వైసీపీ నేతలు విష ప్రచారం చేస్తూ.. అసత్యాలు చెబితే కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. గిరిజనులకు మెరుగైన సంక్షేమం అందిస్తూ వారి జీవన ప్రమాణాలు మెరుగు పరిచే విధంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోందని చెప్పారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో జగన్ గిరిజన జీవితాలతో ఆడుకున్నారని తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వం అటవీ ఏరియాలను గంజాయికి అడ్డాగా మార్చారని ఆరోపించారు. కూటమి సర్కార్ రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా మార్చడంతో పాటు గిరిజనులకు మెరుగైన ఉపాధి అవకావాలు అందేలా చర్యలు తీసుకోంటుందని మంత్రి సంధ్యారాణి పేర్కొన్నారు.

Related News

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Big Stories

×