BigTV English

NTR: బాలా బాబాయ్ కు పద్మభూషణ్.. అబ్బాయ్ ఏమన్నాడంటే.. ?

NTR: బాలా బాబాయ్ కు పద్మభూషణ్.. అబ్బాయ్ ఏమన్నాడంటే.. ?

NTR: గణతంత్ర దినోత్సవ సందర్భంగా కేంద్రప్రభుత్వం  పద్మ పురస్కారాలను  ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలను అందించిన ప్రముఖులకు పద్మ పురస్కారాలను అందించి గౌరవించనుంది. ఈ నేపథ్యంలోనే సినిమా రంగంలో విశేష సేవలు అందించిన నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ ప్రకటించిన విషయం తెల్సిందే. ఇక దీంతో టాలీవుడ్ లో సంబురాలు మొదలయ్యాయి. బాలయ్యకు అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా కంగ్రాట్స్ చెప్తూ పోస్టులు పెడుతున్నారు.


ఎంతమంది  బాలయ్యకు కంగ్రాట్స్ చెప్పినా కూడా.. ఎప్పుడెప్పుడు ఎన్టీఆర్ కంగ్రాట్స్ చెప్తాడా.. ? అని ఎదురుచూస్తూ ఉంటారు అభిమానులు. కానీ, ఇప్పుడు బాబాయ్ కు అవార్డు రావడంతో అబ్బాయే అందరికన్నా ముందు కంగ్రాట్స్ చెప్పుకొచ్చాడు.  బాలయ్యకు అవార్డు రావడం చాలా సంతోషం అని ఎన్టీఆర్ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.

ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డును అందుకుంటున్నందుకు బాలా బాబాయ్‌కి హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను. ఈ గుర్తింపు సినిమా రంగానికి మీరు చేసిన అసమానమైన సేవలకు మరియు మీ నిర్విరామ ప్రజాసేవకు నిదర్శనం” అంటూ రాసుకొచ్చాడు. ఇక  ఎన్టీఆర్ తో పాటు ఆయన అన్న, హీరో కళ్యాణ్ రామ్ కూడా బాలయ్యకు శుభాకాంక్షలు తెలిపాడు.


Nandamuri Balakrishna: బ్రేకింగ్.. నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్

ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డు అందుకోనున్న మా బాబాయ్ నందమూరి బాలకృష్ణ గారికి హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను . ఈ సన్మానం సినిమా ప్రపంచానికి మీరు చేసిన విశేషమైన సేవలకు మరియు సమాజ సేవలో మీ నిర్విరామ కృషికి నిజమైన గుర్తింపు” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్టులు నెట్టింట వైరల్ గా మారాయి.

గత కొన్ని రోజులుగా  ఎన్టీఆర్ కు, బాలయ్యకు మధ్య  విభేదాలు నడుస్తున్నాయని  వార్తలు వినిపిస్తున్న విషయం తెల్సిందే. ఎన్టీఆర్ ఎప్పుడు.. నందమూరి  ఈవెంట్స్  లో పాల్గొనడు. అందుకు చాలా కారణాలు ఉన్నాయి. బాలయ్య అన్న హరికృష్ణ మొదటి భార్య కొడుకు కళ్యాణ్ రామ్ కాగా.. రెండో భార్య కొడుకు ఎన్టీఆర్. హరికృష్ణ ఉన్నంతవరకు అన్నదమ్ములను బాగా చూసుకునేవాడు.

హరికృష్ణ మరణించగా వారి తండ్రి స్థానాన్ని బాలయ్య అందుకున్నాడు. కొన్ని రోజుల వరకు బాగానే ఉన్నా.. ఆ తరువాత అన్నదమ్ములు ఒకటిగా ఉండగా.. బాలయ్య వేరు అయ్యాడు. అయితే వీరిమధ్య ఎన్ని మస్పర్దలు ఉన్నా కూడా..  బాలయ్యకు అవార్డు రావడంతోనే ఎన్టీఆర్ స్పందించిన విధానం హర్షదాయకం అని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.  

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×