Rajamouli: ఎన్నాళ్లో వేచిన ఉదయం ఈరోజే నిజమవుతుంది అని ఒక పక్క మహేష్ ఫ్యాన్స్.. ఇంకోపక్క చరణ్ ఫ్యాన్స్ పాడుకుంటున్నారు. రేపు టాలీవుడ్ లో రెండు పెద్ద ఈవెంట్స్ జరగనున్న విషయం తెల్సిందే. అందులో ఒకటి.. గత మూడేళ్లుగా ఫ్యాన్స్ అందరూ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న SSMB29 పూజ జరుగబోతోంది. ఇంకొకటి.. అదే మూడేళ్ళుగా ఎదురుచూస్తున్న గేమ్ ఛేంజర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగబోతుంది. దీంతో అటు మహేష్ ఫ్యాన్స్.. ఇటు చరణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా అని ఎదురుచూస్తున్నారు.
ఆర్ఆర్ఆర్ తరువాత రాజమౌళి.. SSMB29 సినిమాను ప్రకటించాడు. మహేష్ – రాజమౌళి కాంబో ఇప్పటివరకు రాలేదు కాబట్టి.. ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. మూడేళ్ళుగా జక్కన ఈ సినిమా స్క్రిప్ట్ పై పని చేస్తున్నాడు. మధ్యలో మహేష్ బాబు గుంటూరు కారం సినిమాను ప్రేక్షకులకు అందించి.. ఆ తరువాత పూర్తిగా జక్కన్న సినిమాకే అంకితమయ్యాడు. ఈ సినిమా కోసం లుక్, బాడీ మొత్తం మార్చేశాడు.
Allu Arjun Case: అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్.. ప్రభుత్వానికే నోటీసులు జారీ
ఎక్కడ జక్కన్న కనిపించినా SSMB 29 అప్డేట్ అని అడిగేవారే ఎక్కువ. ఇక వారందరి ఆశలు నిజమవుతూ రేపు ఈ సినిమా పూజా కార్యక్రమం జరగనుందని సమాచారం. ఇందులో మహేష్ బాబు తప్ప మిగతా చిత్ర బృందం మొత్తం పాల్గొంటారని చెప్పుకొచ్చారు. ఇక ఇక్కడివరకు బాగానే ఉన్నా.. ఇప్పుడు వచ్చిన ఒక అప్డేట్ అభిమానులను కన్ఫ్యూజన్ లోకి నెట్టేసింది. అదేంటంటే.. రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గేమ్ ఛేంజర్. జనవరి 10 న ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది.
ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ జోరు పెంచిన మేకర్స్.. రేపు ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. తాజాగా ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా రాజమౌళి రానున్నట్లు మేకర్స్ అధికారికంగా తెలిపారు. అదేంటి.. రేపు SSMB29 పూజ పెట్టుకొని జక్కన గేమ్ ఛేంజర్ ట్రైలర్ లాంచ్ కు వస్తాడా.. ? అనే అనుమానాలు మొదలయ్యాయి. కొంపతీసి SSMB29 పూజ లేదా.. ? అందుకే జక్కన ఇటు వస్తున్నాడా.. ? అని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. లేకపోతే ఉదయం పూజ ముగించుకొని.. ట్రైలర్ ఈవెంట్ కు వస్తాడా.. ? అనేది తెలియాల్సి ఉంది.
Kushboo Sundar: రజినీకాంత్ సినిమాలో నటించినందుకు నేను చాలా బాధపడ్డాను.. అలా చేస్తారనుకోలేదు
చరణ్ కు జక్కన్నకు మధ్య ఉన్న స్నేహ బంధం గురించి అందరికీ తెల్సిందే. చరణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ మగధీర, ఆర్ఆర్ఆర్ సినిమాలను అందించింది జక్కన్ననే. గేమ్ ఛేంజర్ సినిమాకు రాజమౌళి సెంటిమెంట్ కూడా ఉంది. జక్కన్నతో సినిమా చేసిన ఏ హీరోకు అయినా ఆ తరువాత చిత్రం భారీ డిజాస్టర్ ను అందుకుంటుంది. ఆర్ఆర్ఆర్ తరువాత చరణ్ సోలో హీరోగా వస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్. ఇప్పుడు ఈ సెంటిమెంట్ చరణ్ కు కూడా వర్తిస్తుంది. ఇప్పటికే దేవర సినిమాతో ఎన్టీఆర్ ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేశాడు. ఇప్పుడు చరణ్ వంతు. మరి గేమ్ ఛేంజర్ సినిమాతో చార ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.