Ram Gopal Varma: ఎవరు ఏమనుకుంటారో అని ఆలోచించకుండా అనుకుంది అనుకున్నట్టు చెప్పేవారు చాలా తక్కువ. ఇక సినీ పరిశ్రమలో అయితే అలా చేసేవారు అస్సలు ఉండరు. కానీ అందరూ ఒకవైపు అయితే.. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) మాత్రమే ఒకవైపు. ఆయనకు అనిపించి అనిపించినట్టుగా చెప్పేయడం, నచ్చింది చేసేయడం, ఫిల్టర్స్ లేకుండా మాట్లాడడం ఆయన స్పెషాలిటీ. అందుకే ఆయన పర్సనాలిటీ అంటే చాలామంది ప్రేక్షకులకు ఇష్టం. తాజాగా బిగ్ టీవీలో పాల్గొన్న ఇంటర్వ్యూలో మరోసారి ఆసక్తికర కామెంట్స్ చేశారు ఆర్జీవీ. ఒకప్పుడు సూసైడ్ చేసుకొని చనిపోవాలనుకున్నాననే షాకింగ్ విషయం బయటపెట్టారు.
మనసు మార్చుకున్నాను
అసలు లైఫ్ అంటే ఏంటో, దానిని ఎలా బ్రతకాలో ఇప్పటికే చాలాసార్లు అందరికీ సలహాలు ఇచ్చాడు రామ్ గోపాల్ వర్మ. తనలాగే లైఫ్ లీడ్ చేయాలని అందరికీ ఉన్నా.. ఆ అదృష్టం మాత్రమే కొందరికే అని అంటుంటారు. కానీ అలాంటి ఆర్జీవీ కూడా ఒకానొక సందర్భంలో సూసైడ్ చేసుకొని చనిపోవాలని అనుకున్నానని చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బిగ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఒకసారి సూసైడ్ చేసుకొని చనిపోవాలని అనుకున్నానని, కానీ మనసు మార్చుకున్నానని తెలిపాడు. కానీ దానికి తగిన సరైన కారణం ఏంటని ఆయన బయటపెట్టలేదు. అంతే కాకుడా త్వరలోనే భారీ స్థాయిలో ఒక మూవీ ఉండబోతుందని బయటపెట్టాడు.
Also Read: సౌత్ దర్శకులనే నమ్ముకుంటున్న షాహిద్ కపూర్.. అప్పుడు సందీప్, ఇప్పుడు రోషన్..
భారీ బడ్జెట్ సినిమా
గత కొన్నేళ్లుగా రాజకీయాలపై సెటైరికల్ సినిమాలు, అడల్ట్ సినిమాలు తప్పా మరొక జోనర్‌లోకి వెళ్లడం లేదు రామ్ గోపాల్ వర్మ. ఒకప్పుడు ‘శివ’ లాంటి కమర్షియల్ చిత్రాలు తెరకెక్కించిన ఆర్జీవీనేనా ఇప్పుడు ఇలాంటి సినిమాలు చేస్తున్నాడు అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. కానీ ఆయన మాత్రం పద్ధతి మార్చడం లేదు, ఫామ్‌లోకి రావడం లేదు. తాజాగా త్వరలోనే భారీ బడ్జెట్ సినిమాను తెరకెక్కిస్తున్నానని చెప్పగానే కనీసం ఆ సినిమాతో అయినా మళ్లీ ఫామ్‌లోకి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అంతే కాకుండా ప్రస్తుతం తనకు ఉన్న డైరెక్టర్స్‌లో ఫేవరెట్ అయిన సందీప్ రెడ్డి వంగా గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పెద్ద యానిమల్
సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) తనకంటే పెద్ద యానిమల్ అని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. సందీప్ అంటే తనకు ఎంత ఇష్టమో ఇప్పటికే పలుమార్లు చెప్పుకొచ్చాడు ఆర్జీవీ. తను తెరకెక్కించిన సినిమాల గురించి తరచుగా మాట్లాడుకుంటూ ఉంటామని, కలుస్తామని, వారిద్దరి ఆలోచన తీరు దాదాపుగా ఒకేలాగా ఉంటుందని కూడా పలుమార్లు తెలిపారు ఆర్జీవీ. న్యూ ఇయర్ సందర్భంగా ప్రేక్షకులకు విషెస్ చెప్పిన ఆర్జీవీ.. తన రెజల్యూషన్స్ ఏంటో బయటపెట్టారు. తన స్టైల్‌లో తన రెజల్యూషన్స్ గురించి ట్వీట్ చేశారు. కానీ అందులో ఒకటి కూడా ఆయన పాటించరని ఫ్యాన్స్‌కు ఫుల్ క్లారిటీ ఉంది. మొత్తానికి తెలుగు ప్రేక్షకుల్లో ఆర్జీవీ కమ్ బ్యాక్ కోసం ఎదురుచూస్తున్నవారి సంఖ్య చాలానే ఉంది.