Medchal Students Protest : మేడ్చల్ లోని ఓ ఇంజనీరింగ్ కళాశాల దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గర్ల్స్ హాస్టల్ లోని అమ్మాయిల వీడియో తీశారని ఆరోపిస్తూ కాలేజిలోని అమ్మాయిలంతా బయటకు వచ్చి ధర్నాకు దిగారు. రాత్రి వేళ అమ్మాయిలంతా కళాశాల ప్రాంగణంలో గుమ్మిగూడి పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. దీంతో పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కళాశాలలో ఏం జరిగిందనే విషయమై ఆందోళనలు రేకెత్తుతున్నాయి.
మేడ్చల్ లోని సీఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో అమ్మాయిల కోసం ప్రత్యేక హాస్టల్ నిర్వహిస్తున్నారు. ఈ హాస్టల్ లో ఉండే అమ్మాయిల వీడియోలను.. అనుమతి లేకుండా అసభ్యకరంగా చిత్రీకరించారని ఆరోపిస్తూ అమ్మాయిలు ధర్నాకు దిగారు. విషయం తెలుసుకున్న కళాశాలకు చెందిన యువకులు సైతం వారి హాస్టల్ వద్దకు చేరుకుని ధర్నాలోకి దిగారు. తమకు న్యాయం చేయాలి అంటూ విద్యార్థినీ విద్యార్థులు నినాదాలు చేస్తున్నారు. కళాశాల యాజమాన్యం ఈ విషయమై స్పందించాలని, తమతో సంప్రదింపులు జరపాలని.. వెంటనే ఈ ఘటన సంబంధించి విచారణ మొదలు పెట్టాలని విద్యార్థులుడిమాండ్ చేస్తున్నారు.
విద్యార్థుల ఆందోళన విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విద్యార్థులను శాంతింపజేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏమైనా పొరపాట్లు జరిగితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తున్న పోలీసులు.. విద్యార్థులని ధర్నా నుంచి ఉపసంహరించేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా.. విద్యార్థులు మాత్రం మేనేజ్ మెంట్ స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.
కాలేజీ గర్ల్స్ హాస్టల్లో అమ్మాయిల వీడియోలు ఎవరు తీసారని విషయమే చర్చ నడుస్తుంది. కాగా హాస్టల్లో వంట చేసేందుకు వచ్చే వారు వీడియోలు తీసి ఉంటారని కొంతమంది విద్యార్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనుమతి లేకుండా, అసభ్యకరంగా వీడియోలు తీసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని.. వెంటనే విచారం జరిపించాలని, నిందితులను గుర్తించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థినీ విద్యార్థుల నిరసనలతో సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీ ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి
Also Read : పనితీరు మెరుగుపరుచుకోండి.. మంత్రులకు, ఎమ్మేల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి సూచన