Kushboo Sundar: సీనియర్ బ్యూటీ ఖుష్బూ సుందర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కలియుగ పాండవులు అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ సుందరి వరుసగా స్టార్ హీరోల సరసన నటించి అప్పట్లో స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. తెలుగు, తమిళ్ భాషల్లో ఈ చిన్నది ఎన్నో మంచి చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇక ఖుష్బూ అందానికి తమిళ తంబీలు ఫిదా అయ్యి ఆమెకు ప్రత్యేకంగా ఒక గుడిని కూడా కట్టించిన విషయం తెలిసిందే.
కెరియర్ పిక్స్ లో ఉన్నప్పుడే సుందర్ అనే తమిళ డైరెక్టర్ ను ఖుష్బూ ప్రేమించి వివాహం చేసుకుంది. ఆ తర్వాత ఆమె ఒక పక్క సినిమాలు ఇంకోపక్క నిర్మాతగా కూడా మారి పలు సినిమాలు నిర్మించింది. వీటితోపాటు ఆమె రాజకీయాల్లో కూడా చేరి తన సత్తా చాటింది. మొదటి నుంచి బొద్దుగా ఉండే ఖుష్బూ ఈ మధ్యకాలంలో బక్క చిక్కి మరింత అందంగా మారిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఖుష్బూ జబర్దస్త్ షోకు లేడీ జడ్జిగా వ్యవహరిస్తుంది.
Anasuya: ఛీఛీ.. సిగ్గుగా అనిపించడం లేదా.. ఇద్దరు పిల్లల తల్లి అయ్యి ఉండి అలా చూపించడానికి.. ?
ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఖుష్బూ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకుంది. కొన్నిసార్లు కొంతమంది నటీనటులు కొన్ని సినిమాల్లో ఎందుకు నటించామా అని ఫీల్ అవుతూ ఉంటారు. అది సర్వసాధారణమైన విషయమే. ఖుష్బూ కూడా అలానే ఒక సినిమాలో నటించినందుకు ఫీల్ అయ్యినట్లు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
“ఇప్పటివరకు నేను ఎన్నో సినిమాల్లో నటించాను. కొన్ని సినిమాల్లో అనవసరంగా నటించానే అని బాధపడిన సందర్భాలు ఉన్నాయి. నేను ఎక్కువ బాలీవుడ్ సినిమాల కన్నా సౌత్ సినిమాలోని నటించాను. బాలీవుడ్ లో నేను చేసిన సినిమాల గురించి ఎప్పుడు బాధపడలేదు. కానీ, సౌత్ లో నేను నటించిన కొన్ని సినిమాల్లో ఎందుకు నటించాను అని బాధ పడిన సందర్భాలు ఉన్నాయి.
Karishma Kapoor:@49లో పెళ్లికి సిద్ధమవుతున్న బాలీవుడ్ బ్యూటీ.. వరుడు ఎవరంటే?
ఉదాహరణకు రజనీకాంత్ తో నేను ఒక సినిమా చేశాను. అందులో నేను, మీనా హీరోయిన్స్ గా నటించాము. మాకు కథ చెప్పినప్పుడు మా ఇద్దరి పాత్రలు చాలా కీలకమని డైరెక్టర్ చెప్పుకొచ్చాడు. మా పాత్రలు.. అందులోనూ నా పాత్ర బాగా నచ్చడంతో నేను వెంటనే ఓకే చేశాను. అందులో మా ఇద్దరికీ రజినీకాంత్ తో సాంగ్స్ కూడా ఉంటాయని చెప్పారు.
సరే.. రజనీకాంత్ కు ఇంకో హీరోయిన్ ఉండదు కదా అని నేను వెంటనే ఓకే చేశాను. కానీ, సినిమా సెట్స్ మీదకు వెళ్లాక మొత్తం తారుమారు అయ్యింది. మా దాని కన్నా వేరే వాళ్ళకి ఎక్కువ స్క్రీన్ ప్రజెన్స్ దొరికింది. కథ లో చెప్పిన విధంగా నా పాత్రను స్క్రీన్ పైకి తీసుకురాలేదు. అలా చేస్తారనుకోలేదు. దీంతో ఆ సినిమాలో నేను నటించినందుకు చాలా బాధపడ్డాను” అని చెప్పుకొచ్చింది.
Tollywood: మళ్లీ తల్లి కాబోతున్న బ్యూటీ.. కొత్త ఏడాది.. కొత్త శుభవార్తతో వీడియో షేర్..!
అయితే ఆ సినిమా ఏంటి అనేది మాత్రం కుష్బూ చెప్పలేదు. ఆమె చెప్పకపోయినా ఆ సినిమా పెద్దన్న అని అందరికీ తెలిసిన విషయమే. రజినీకాంత్ హీరోగా నటించిన ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటించింది. ఖుష్బూ, మీనా కీలకపాత్రలకు మాత్రమే పరిమితమయ్యారు. ఈ సినిమా తమిళ్ లో అంతంత మాత్రం హిట్ అయిన తెలుగులో మాత్రం భారీ పరాజయాన్ని అందుకుంది. ఇక ఈ చిత్రంలో రజనీకాంత్ చెల్లిగా కీర్తి సురేష్ నటించిన విషయం తెలిసిందే.