BigTV English

SSMB 29 : హైదరాబాద్‌కి వస్తున్న మణికర్ణిక ఘాట్… జక్కన్న లీలలు అందుకోలేం భయ్యా…

SSMB 29 : హైదరాబాద్‌కి వస్తున్న మణికర్ణిక ఘాట్… జక్కన్న లీలలు అందుకోలేం భయ్యా…

SSMB 29 : జక్కన్న డైరెక్షన్ స్కిల్స్‌ ఏ రేంజ్‌లో ఉంటాయో ఇప్పటికే మనం చూశాం. బహుబలి 2, ఆర్ఆర్ఆర్ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి అంటే కారణం అదే. ప్రతి సినిమాకు జక్కన్న తన స్కిల్స్‌ను పెంచుకుంటూ అధునాతన పద్దతులను నేర్చుకుంటూ తర్వాత సినిమాలను చేస్తాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత హాలీవుడ్ ప్రభావం ఎక్కువ పడిందని, ఇప్పుడు మరింత మెరుగ్గా సినిమాలు చేయొచ్చు అని కూడా ఓ సందర్భంలో జక్కన్న చెబుతాడు. అలా… SSMB29 షూటింగ్ కోసం జక్కన్న అత్యాధునిక టెక్కిక్‌లు వాడుతున్నాడని సమాచారం. అయితే… ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఒక విషయం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ సినిమా కోసం కాశీలోని మణికర్ణిక ఘాట్‌ను హైదరాబాద్‌కి తెప్పిస్తున్నారట. అది ఏంటో ఇప్పుడు చూద్దాం…


సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులతో పాటు తెలుగు సినిమా లవర్స్ అందరూ ఎదురుచూస్తున్న SSMB 29 మూవీ షూటింగ్ స్టార్ట్ అయింది. హైదరాబాద్‌లో అల్యూమినియం ఫ్యాక్టరీలో ఫస్ట్ షెడ్యూల్ జరుగుతోంది. ప్రియాంక చోప్రా ఈ షూటింగ్ లో పాల్గొంటుంది.

గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్న ఈ ఫస్ట్ షెడ్యూల్ ఫిబ్రవరి 3వ తేదితో ముగుస్తుందట. ఇక రెండో షెడ్యూల్ కోసం ఇప్పుడే పనులు మొదలు పెట్టారట.


రెండో షెడ్యూల్‌లో పలు కీలక సన్నివేశాల చిత్రీకరణ ఉంటుందట. అందుకోసం అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రత్యేకమైన సెట్స్ వేస్తున్నట్టు సమాచారం. కాశీలోని ఎంతో ప్రత్యేకమైన మణికర్ణిక ఘాట్ సెట్‌ను అల్యూమినియం ఫ్యాక్టరీలో వేస్తున్నారట.

మణికర్ణిక ఘాట్ ప్రత్యేకతలు..

కాశీలోని మణికర్ణిక ఘాట్‌కు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. సాధారణంగా ఇక్కడ ఎప్పుడూ చితి మంటలు కాలుతూనే ఉంటాయి. కాశీలో చనిపోయిన వాళ్లందరినీ ఇక్కడే కాలుస్తారు. కాశీలో చనిపోవాలని, మణికర్ణిక ఘాట్‌లో తమ చితి కాలాలి అని చాలా మంది కోరుకుంటారు. అక్కడ స్మశానంలో పూజలు చేసే అఘోరాలు కూడా ఎక్కువే ఉంటారు.

SSMB 29 కథ అదే…

కాగా… SSMB 29 మూవీ కూడా కాశీ నేపథ్యంలో ఉంటుందని తెలుస్తుంది. సినిమా స్టార్ట్ అవ్వడమే కాశీ నుంచి స్టార్ట్ అవుతుందట. అందులో మహేష్ బాబు ప్లాష్ బ్యాక్ ఉంటుందని, డిఫరెంట్ గెటప్‌లో కూడా కనిపిస్తారని సమాచారం. కాశీ తర్వాత ఆఫ్రికన్ అడవుల్లో షూటింగ్ ఉంటుందట.

ఇప్పుడు వేస్తున్న మణికర్ణిక ఘాట్ సెట్‌లో కూడా మహేష్ బాబు ఫ్లాష్ బ్యాక్‌కు సంబంధించిన సీన్స్ షూట్ చేస్తారని తెలుస్తుంది. ఇది సినిమాకు సంబంధించి ఓపెనింగ్‌గా ఉంటుందట. అలాగే కథ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుందని సమాచారం. అందుకే దీని కోసం జక్కన్న అత్యాధునిక టెక్నాలజీతో మణికర్ణిక ఘాట్ సెట్‌ను నిర్మిస్తున్నారట.

SSMB 29 మూవీ కథ మొత్తం ఆఫ్రికా అడవుల్లో ఉంటుదని రాజమౌళి చాలా సందర్భాల్లో చెప్పారు. కానీ, ఇప్పుడు ఫస్ట్ షెడ్యూల్ దాదాపు పూర్తి అయినట్టే. అతి కొద్ది రోజుల్లోనే రెండో షెడ్యూల్ కూడా స్టార్ట్ కాబోతుంది. ఫస్ట్ షెడ్యూల్ మొత్తం హైదరాబాద్ శివారులో ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీలోనే జరిగింది. ఇప్పుడు రాబోయే సెకండ్ షెడ్యూల్ కోసం ఇప్పుడు అక్కడే సెట్స్ వేస్తున్నారు. అంటే… సెకండ్ షెడ్యూల్ షూటింగ్ కూడా అక్కడే ఉండబోతుందని అర్థమవుతుంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×