Tollywood Heros : సినీ ఇండస్ట్రీలోకి అవకాశాలు ఎప్పుడు ఉంటాయో.. హిట్ సినిమాలు పడతాయో లేదో చెప్పడం కాస్త కష్టమే.. అందంగా, మంచి నటన స్కిల్స్ ఉంటే సరిపోదు.. ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి.. అప్పుడే సినిమాలు సక్సెస్ అవుతాయి. లేదంటే మాత్రం హిట్ సినిమాల కోసం నిరీక్షణ తప్పదు.. ఇటీవల కాలంలో కొందరి హీరోల పరిస్థితి అలానే ఉంది. ఒక్క హిట్ సినిమా అన్న పడుతుందేమో అని ఆశగా ఎదురు చూస్తున్నారు. చిత్ర పరిశ్రమలో అవకాశాలు రావడం కష్టమే.. వచ్చిన అవకాశాలను కాపాడుకోవడం కూడా సులువు కాదు..ఇటీవల వరుస హిట్ సినిమాలో నటించిన హీరో హీరోయిన్లు కూడా ఒక్క ఫ్లాప్ సినిమా పడితే ఆ తర్వాత అవకాశాలు అదృశ్యం అవుతున్నాయి. ఇక సోషల్ మీడియాను నమ్ముకుని హీరోయిన్లు అయితే అందాలను ఆరబోస్తున్న కూడా డైరెక్టర్లు పెద్దగా పట్టించుకోవడం లేదు. అటు హీరోల పరిస్థితి దాదాపు అంతే. ఒక్క ఫ్లాప్ సినిమా హీరోను పలకరిస్తే ఆ తర్వాత సినిమా అవకాశాలు రావడం అందని ద్రాక్ష లాగా మారుతున్నాయి. ఒకవైపు సినిమా అవకాశాలు వస్తున్న కూడా సినిమాలు మాత్రం హిట్ అవడం లేదు. దాంతో హీరోలు కాస్త గ్యాప్ తీసుకొని సరికొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో కొందరు హీరోలు పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. ఏడాదికి ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా కూడా ఆ సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాయి. దాంతో అవకాశాలు కూడా దూరమైపోతున్నాయి. అలాంటి హీరోలు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు.. గత కొన్నేళ్లుగా సరైన హిట్ సినిమాలేని స్టార్ హీరోలు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మాస్ మహారాజ రవితేజ… టాలీవుడ్ సీనియర్ హీరో రవితేజ వరుసగా సినిమాలు అనౌన్స్ చేసుకుంటూ మరోవైపు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.. ఈమధ్య ఈయన ఖాతాలో సరైన హిట్ సినిమా పడలేదు.. ధమాకా తర్వాత వచ్చిన సినిమాలన్నీ యావరేజ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.. గ తేడాది మిస్టర్ బచ్చన్ సినిమాతో భారీ అంచనాల తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. కానీ ఆ సినిమా వచ్చిన మొదటి రోజే యావరేజ్ టాక్ ను అందుకోవడంతో కొద్దిరోజులకే థియేటర్ల నుంచి దూరమైంది. ప్రస్తుతం రవితేజ ఓ భారీ ప్రాజెక్టులో నటిస్తున్నాడు. ఆర్ 75 పేరుతో ఆ సినిమా తెరకెక్కుతుంది.. ఆ మూవీలో రవితేజకు జోడిగా శ్రీ లీలా నటిస్తుంది. ఈ సినిమా గురించి ఓ కీలక అప్డేట్ ను మేకర్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది..
విజయ్ దేవరకొండ.. టాలీవుడ్ యంగ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ గురించి అందరికీ తెలుసు. ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ హిట్స్ చిత్రాల్లో నటించాడు. ఆయన ఇప్పటివరకు చేసిన సినిమాల్లో కొన్ని సినిమాలు భారీ బిజీ అయినందుకుంటే మరికొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టాయి. గతేడాది ఫ్యామిలీ సార్ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఆ మూవీ మిక్స్డ్ టాక్ ని అందుకోవడంతో ఎక్కువగా కలెక్షన్స్ ని రాబట్ట లేక పోయింది. ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. ఇందులో ఒక్క సినిమా అన్న హిట్ అయితేనే మళ్లీ ఆయన ట్రాక్ రికార్డు మారుతుంది.. లేదంటే మాత్రం ఇండస్ట్రీకి దూరమైయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.
అక్కినేని హీరో నాగ చైతన్య.. ఈ హీరో నటించిన థాంక్యూ, కస్టడీ డిజాస్టర్స్ అయ్యాయి. నాగార్జున వారసుడిగా ఎంట్రీ ఇచ్చి స్టార్ ఇమేజ్ సొంతం చేసుకోలేకపోయిన నాగ చైతన్యకు ఒక సాలిడ్ హిట్ కావాలి. తండేల్ తో తన కోరిక నెరవేరుతుందని భావిస్తున్నాడు. నాగ చైతన్యకు కూడా అర్జెంటుగా హిట్ కావాలి.. నాగచైతన్య ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ తండేల్ లో నటిస్తున్నాడు. ఫిబ్రవరి 7న ఈ సినిమా రాబోతుంది. ఇప్పటి వరకైతే పాజిటివ్ టాక్ అందుకున్న ఈ సినిమా నాగచైతన్య లైఫ్ ను ఎలా టర్న్ చేస్తుందో చూడాలి.
ఇక వీళ్లే కాదు అటు గోపీచంద్ కెరియర్ కూడా దాదాపు క్లోజ్ అయినట్లే తెలుస్తుంది. ఈమధ్య చేసిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మారుతున్నాయి. మెగా వరుణ్ తేజ్ పరిస్థితి కూడా దాదాపు అలానే ఉంది. గద్దల కొండ గణేష్ తర్వాత వచ్చిన సినిమాలు యావరేజ్ టాక్ ను అందుకున్నాయి. ఇక రామ్ పోతినేనికి కూడా ఇస్మార్ట్ శంకర్ తర్వాత హిట్ సినిమా పడలేదు. సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చినా కూడా ఆ సినిమా వచ్చిన ఒక్క రోజుకే వెనుతిరిగి వెళ్ళింది. ప్రస్తుతం ఓ భారీ ప్రాజెక్టులో రామ్ పోతినేని నటిస్తున్నారు. ఇక శర్వానంద్ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. సక్సెస్ చూసి ఏళ్ళు గడిచిపోతున్నాయి. ఎలాంటి ప్రయోగం చేసినా ఫలితం దక్కడం లేదు. ఆయన గత చిత్రం మనమే ప్లాప్ ఖాతాలో చేరింది. ప్రస్తుతం నారీ నారీ నడుమ మురారి టైటిల్ తో రొమాంటిక్ లవ్ డ్రామా చేస్తున్నారు.. ఈ హీరోల అందరికీ గత కొంతకాలంగా సరైన హిట్ సినిమాలు లేవు. ఈసారన్నా హిట్ సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తారేమో చూడాలి.. మరోవైపు కొందరు హీరోలు మాత్రం పాన్ ఇండియా సినీమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.