Sri Simha Pre wedding.. ప్రస్తుత కాలంలో యంగ్ హీరోలు, హీరోయిన్లు వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకులు ఎం ఎం కీరవాణి (M.M.Keeravani )కొడుకు ,ప్రముఖ యంగ్ హీరో శ్రీ సింహ (Sri Simha) ఏడడుగులు వేయబోతున్నారు. సీనియర్ నటులు మురళీమోహన్ (Murali Mohan)మనవరాలు రాగ మాగంటి (Raga Maganti) తో ఏడడుగులు వేయడానికి సిద్ధమయ్యారు. అందులో భాగంగానే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ హైదరాబాదులో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి పలువురు సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు.
శ్రీ సింహ – రాగ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్..
కీరవాణి చిన్న కొడుకు శ్రీ సింహ హీరోగా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఇటీవలే ‘మత్తు వదలరా-2’ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇదిలా ఉండగా శ్రీ సింహ.. మురళీమోహన్ మనవరాలు రాగమాగంటితో ఏడడుగులు వేయడానికి సిద్ధమయ్యారు అంటూ గత కొద్ది రోజులుగా వార్తలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ వార్తలు కాస్త నిజం అయ్యాయి. మురళీమోహన్ కొడుకు కూతురైన రాగ మాగంటి ఇటీవలే విదేశాలలో చదువు పూర్తి చేసుకుని, ఇండియాకి వచ్చి ప్రస్తుతం కుటుంబ వ్యాపారాలు చూసుకుంటోంది. ఇప్పుడు ఈమెతోనే శ్రీ సింహ పెళ్లి జరగబోతోంది.
రిసెప్షన్లో సందడి చేసిన సెలెబ్రిటీస్..
ఇక పెళ్లి తేది దగ్గర పడుతున్న నేపథ్యంలో.. శ్రీ సింహ, రాగా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ హైదరాబాదులోని గోల్కొండ రిసార్ట్స్ లో చాలా ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరై, కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. ఇకపోతే ఈ కార్యక్రమానికి వీ.కే.నరేష్(V.K.Naresh), పవిత్ర లోకేష్ (Pavitra Lokesh) తో పాటు దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli ), సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కూడా వచ్చి సందడి చేశారు. రాజమౌళి శ్రీ సింహ కు వరుసకు బాబాయి అవుతారన్న విషయం అందరికీ తెలిసిందే. అంతేకాదు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్లో ప్రముఖ రాజకీయ నాయకులు రఘురామ కృష్ణంరాజు(Raghu Rama krishnam Raju) కూడా సందడి చేశారు. ఇకపోతే నిన్న అనగా నవంబర్ 17వ తేదీ ఆదివారం రాత్రి ఈ కార్యక్రమం జరిగినట్లు తెలుస్తోంది.. ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది.
ఆకట్టుకున్న మహేష్ బాబు లుక్..
ఇకపోతే ఈ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో మహేష్ బాబు లుక్ అందరినీ ఆకట్టుకుంది. పెరిగిన జుట్టుతో చాలా స్టైలిష్ గా కనిపించారు. రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు చాలానే కష్టపడుతున్నారు అందులో భాగంగానే ఈ లుక్ మెయింటెన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మహేష్ బాబు విషయానికి వస్తే.. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఎస్ ఎస్ ఎం బి 29 అనే వర్కింగ్ టైటిల్ తో అడ్వెంచర్ మూవీ చేయడానికి సిద్ధమయ్యారు. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరొకవైపు వ్యాపార రంగాల్లో పట్టుబడులు పెడుతూ తన ఆదాయాన్ని పెంచుకుంటున్నారు. అందులో భాగంగానే తాజాగా ట్రూజన్ సోలార్ లో పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. వేలకోట్లకు అధిపతి అయిన మహేష్ బాబు ఇప్పుడు తన ఆదాయాన్ని మరింత పెంచుకునే పనిలో పడ్డారని చెప్పవచ్చు.