BigTV English

SSMB 28 : త‌మ‌న్ విష‌యంలో గురూజీ హ్యాపీగా లేడా?

SSMB 28 : త‌మ‌న్ విష‌యంలో గురూజీ హ్యాపీగా లేడా?

SSMB 28:ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అంటే ట‌క్కున వినిపించే సమాధానం ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లోని క్రేజీ ప్రాజెక్టుల‌న్నింటికీ త‌మ‌న్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఆ లిస్టులో మ‌హేష్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న SSMB 28 కూడా ఒక‌టి. చాలా రోజుల ముందే ఈ మూవీ మ్యూజిక్ సిట్టింగ్స్ జ‌రుగుతున్నాయి. అయితే లేటెస్ట్‌గా సినీ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోన్న స‌మాచారం మేర‌కు SSMB 28 మ్యూజిక్ విష‌యంలో త్రివిక్ర‌మ్ అంత హ్య‌పీగా లేడ‌ట‌. త‌మ‌న్ నుంచి ‘అల వైకుంఠ‌పుర‌ములో’ తరహాలో మ్యూజిక్ కావాలని గురూజీ ఎదురు చూస్తున్నాడ‌ట‌. కానీ త‌మ‌న్ నుంచి మంచి ఆల్బమ్ రాలేద‌నేది టాక్‌. మ‌రి ఈ వార్త‌ల‌పై త‌మ‌న్ సోష‌ల్ మీడియాలో ఏమైనా రియాక్ట్ అవుతాడేమో చూడాలి.


ఇది వ‌ర‌కు త‌న‌తో వ‌ర్క్ చేసిన దేవిశ్రీ ప్ర‌సాద్‌ను ప‌క్క‌న పెట్టిన త్రివిక్ర‌మ్‌.. త‌మ‌న్‌కు అర‌వింద స‌మేత‌తో అవ‌కాశం ఇచ్చాడు. ఆ సినిమా మ్యూజిక్ పరంగా ఆక‌ట్టుకుంది. త‌ర్వాత అల వైకుంఠ‌పుర‌ములో సినిమాకు కూడా ఇదే కాంబో రిపీట్ అయ్యింది. ఇక అల వైకుంఠ‌పుర‌మ‌లో పాట‌లు ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అదే మ్యాజిక్‌ను SSMB 28 రీ క్రియేట్ చేయాల‌ని త్రివిక్ర‌మ్ ఎదురు చూస్తున్నార‌ట‌. మ‌రి ఇప్పుడు ఇండ‌స్ట్రీలో మ‌రో ర‌కంగా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

SSMB 28 విష‌యంలో ఎలాగైనా హిట్ కొట్టాల‌ని త్రివిక్ర‌మ్ ఫిక్స్ అయిపోయున్నాడు. ఎందు కంటే ఇంత‌కు ముందు మ‌హేష్‌, త్రివిక్ర‌మ్ కాంబోలో వచ్చిన అత‌డు, ఖ‌లేజా సినిమాలు ఆశించిన స్థాయిలో స‌క్సెస్ కాలేదు. దాంతో ఈ సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టి మ‌హేష్ త‌న‌పై ఉంచిన న‌మ్మ‌కాన్ని నిజం చేయాల‌ని త్రివిక్ర‌మ్ ఎదురు చూస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఆగ‌స్ట్ 11న విడుద‌ల చేయాల‌నేది ప్ర‌స్తుతం మేక‌ర్స్ ఆలోచ‌న‌. మ‌రి ఇది ఇంకా ఏమైనా వెన‌కెక్కి వెళుతుందేమో చూడాలి. ఈ చిత్రంలో మ‌హేష్ స‌ర‌స‌న పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర రాధాకృష్ణ (చిన‌బాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×