Mahesh Babu : హోలీ వచ్చిందంటే చాలు… సాధారణ జనాలతో పాటు సెలబ్రెటీలు కూడా రంగుల్లో మునిగితేలిపోతారు. వైట్ డ్రెస్ వేసుకుని… రంగులన్నీ వేసుకుని… ఫోటోలకు ఫోజులిస్తూ… ఎంజాయ్ చేస్తారు. నిజానికి ఈ రోజు దాదాపు అందరు సెలబ్రెటీలు ఇలానే చేస్తున్నారు. మరి రాజమౌళి చెరలో ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు పరిస్థితేంటి..? ఒకసారి ఆలోచించారా..?
జక్కన్న చేతిలో బందీ అయిపోయిన మహేష్ బాబు ఈ సారి హోలీ ఎలా చేసుకున్నాడో ఇప్పుడు చూద్ధాం..
జక్కన్నతో సినిమా చేస్తే ఆ హీరో అభిమానులు నవ్వాలో లేక ఏడవాలో అర్థం కాని పరిస్థితిలో ఉంటారు. జక్కన్న చేసే సినిమాలకు కనీసం మూడు నుంచి నాలుగేళ్లు పడుతుంది. ఈ టైంలో ఆ హీరో వేరే సినిమాలు చేయొద్దు. ఎక్కడా తిరగొద్దు. అంత ఎందుకు… ఆ లుక్ కూడా లీక్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటాడు జక్కన్న. ఇక పండగలు అంటారా….? రాజమౌళితో సినిమా చేస్తున్న అన్ని సంవత్సరాలు… ఫ్యామిలీతో పండగలు చేసుకోవడం మర్చిపోవాల్సిందే. ఇప్పుడు మహేష్ బాబు కూడా అదే జరుగుతుంది.
ఎస్ ఎస్ రాజమౌళి – మహేష్ బాబు కాంబినేషన్‌లో SSMB 29 అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ మూవీ వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే హైదరాబాద్ లో ఓ షెడ్యూల్ ను పూర్తి చేసుకున్నారు. హైదరాబాద్ శివారులో ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీ లో వేసిన ఓ భారీ సెట్స్ లో షూటింగ్ జరిపారు. ప్రస్తుతం ఓడిస్సాలో ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. మహేష్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా, పృథ్విరాజ్ సుకుమారన్ ఈ షెడ్యూల్లో పాల్గొంటున్నారు.
ఈ క్రమంలోనే హోలీ పండుగ వచ్చింది. జక్కన్న సినిమాలో ఉంటే పండుగలు చేసుకోవడానికి పెద్దగా ఛాన్స్ ఏం ఉండదు. అది అందరికీ తెలిసిందే. సాధారణంగానే టూర్స్ వేస్తూ ఫ్యామిలీతో ఎంజాయ్ చేసే మహేష్ బాబు ఇప్పుడు ఇంటికి దూరంగా ఉంటున్నాడు.
ఈ హోలీని కూడా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ పెట్టి సెలబ్రెట్ చేసుకున్నాడు. మహేష్ అభిమానులు… గతంలో ఆయన హోలీ చేసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. కాగా, గతంలో భరత్ అనే నేను మూవీ షూటింగ్ లో సెట్స్ లోనే హోలీ జరుపుకున్నారు. అలాగే మరి కొన్ని హోలీ పండుగలను మహేష్ తన కూతురు సితారా, కొడుకు గౌతమ్ తో జరుపుకున్నాడు. ఆ ఫ్యామిలీ ఫోటోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అలాగే… జక్కన్నతో సినిమా అంటే.. అన్ని మర్చిపోవాల్సిందే అని నెటిజన్లు కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. గతంలో ఈయనతో చేసిన హీరోలకు కూడా ఇలాంటి పరిస్థితే ఉండేది. ఇప్పుడు మహేష్ బాబుకు కూడా అదే సిట్యుయేషన్ ఉంది.