Gautham Menon: కోలీవుడ్‌లో యూత్‌కు ఎప్పటికీ గుర్తుండిపోయే ప్రేమకథలు తెరకెక్కించడంలో గౌతమ్ మీనన్ దిట్ట అని అందరికీ తెలిసిన విషయమే. అలాంటి డైరెక్టర్ అప్పుడప్పుడు తన కంఫర్ట్ జోన్ నుండి బయటికి వచ్చి యాక్షన్, థ్రిల్లర్ సినిమాలను కూడా తెరకెక్కించాడు. అందులో ఒకటి ‘డామినిక్ అండ్ ది లేడీస్ పర్స్’. ఎన్నో ఏళ్లుగా తమిళంలో సినిమాలు తెరకెక్కించి తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న గౌతమ్ మీనన్.. మొదటిసారి ఈ మూవీతో దర్శకుడిగా మాలీవుడ్‌లో అడుగుపెట్టాడు. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుండగా దీని ప్రమోషన్స్‌లో భాగంగా తమిళ, మలయాళ సినిమాలను పోలుస్తూ వ్యాఖ్యలు చేశాడు ఈ దర్శకుడు.
వాళ్లు ఒప్పుకోరు
మలయాళంలో తన డెబ్యూ మూవీని ప్రమోట్ చేయడానికి గౌతమ్ మీనన్ స్వయంగా రంగంలోకి దిగాడు. ఇప్పటికే ఎన్నో మలయాళ ఛానెల్స్‌కు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు. మూవీ విడుదలయిన తర్వాత కూడా ఇంకా ప్రమోషన్స్ చేస్తూనే ఉన్నాడు. అలా తను తాజాగా పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో తమిళ, మలయాళ సినిమాలను, యాక్టర్లను పోలుస్తూ మాట్లాడాడు గౌతమ్ మీనన్. మలయాళంలో తెరకెక్కించే కంటెంట్‌ను తమిళ యాక్టర్లకు ఆఫర్ చేస్తే వాళ్లు అస్సలు ఒప్పుకోరు అని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ఇక తమిళ నటులను మలయాళ యాక్టర్ అయిన ఫాహద్ ఫాజిల్‌తో పోలుస్తూ మాట్లాడాడు.
తమిళ హీరోలు అలాంటివాళ్లు
‘‘ఫాహద్ ఫాజిల్ (Fahadh Faasil) రేంజ్ ఏంటో అందరికీ తెలుసు. కుంబళంగి నైట్స్‌లో ఫాహద్ ఫాజిల్ రోల్‌ను ఏ తమిళ యాక్టర్ కూడా చేయడానికి ఒప్పుకునేవాడు కాదు. అసలు ఆ పాత్రలో ఏముంది అని అడిగేవారు. వాళ్లు ఎక్కువగా కమర్షియాలిటీ ఉన్న పాత్రలనే ఎంచుకోవానికి ఇష్టపడతారు. మలయాళంలో ఒక సినిమా హిట్ అయిన తర్వాతే దానిని రీమేక్ చేయడానికి తమిళ హీరోలు ఒప్పుకుంటారు. అది కూడా హిట్ అయ్యిందనే మాట వారి వరకు వస్తేనే రీమేక్ గురించి ఆలోచిస్తారు. అలా కాకుండా మేమే వెళ్లి ముందుగా రీమేక్ ఐడియా చెప్తే ఒప్పుకోరు’’ అంటూ తమిళ హీరోల గురించి ఓపెన్‌గా కామెంట్స్ చేశాడు గౌతమ్ మీనన్.
Also Read: తప్పు చేసిన మహారాష్ట్ర ప్రభుత్వం.. షారుఖ్ ఖాన్‌కు రూ.9 కోట్లు కట్టాల్సిందే.!
డిటెక్టివ్స్ కామెడీ
ఇక గౌతమ్ మీనన్ (Gautham Menon), మమ్ముట్టి (Mammootty) కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘డామినిక్ అండ్ ది లేడీస్ పర్స్’ (Dominic And The Ladies’ Purse) మూవీ జనవరి 23న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది మలయాళంలో దర్శకుడిగా తన మొదటి సినిమానే అయినా మమ్ముట్టి లాంటి స్టార్‌తో తెరకెక్కించడంతో దీనిపై మంచి హైప్ క్రియేట్ అయ్యింది. థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన ఈ మూవీని మమ్ముట్టి స్వయంగా నిర్మించారు. ఇందులో మమ్ముట్టితో పాటు గోకుల్ సురేశ్ లీనా, సిద్ధికీ, వీజీ వెంకటేశ్, విజయ్ బాబు, వినీత్, సుష్మిత భట్, షైన్ టామ్ చాకో తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. ఇందులో మమ్ముట్టి, గోకుల్ సురేశ్ డిటెక్టివ్స్‌గా నటిస్తూ ప్రేక్షకులను నవ్వించారు.