BigTV English

Ambati Rayudu : చిరు, సుక్కు పరువు మొత్తం తీసిన అంబటి… మరీ అంత పెద్ద మాట అన్నాడేంటి..?

Ambati Rayudu : చిరు, సుక్కు పరువు మొత్తం తీసిన అంబటి… మరీ అంత పెద్ద మాట అన్నాడేంటి..?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఈయనకు ఒక టాలీవుడ్ లోనే కాదు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా 150కి పైగా చిత్రాలలో హీరోగా నటించిన భారీ పాపులారిటీ అందుకున్నారు చిరంజీవి. మరొకవైపు స్టార్ డైరెక్టర్గా పేరు సొంతం చేసుకున్నారు సుకుమార్ (Sukumar). ఇటీవల వచ్చిన ‘పుష్ప’, ‘పుష్ప2’ చిత్రాలతో పాన్ ఇండియా డైరెక్టర్గా పేరు దక్కించుకోవడమే కాకుండా.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు సాధించిన రెండవ చిత్రంగా పుష్ప 2 పేరు సొంతం చేసుకుంది. దీంతో పాన్ ఇండియా డైరెక్టర్ గా పేరు అందుకున్నారు సుకుమార్. ఇంతటి పేరు సొంతం చేసుకున్న చిరంజీవి, సుకుమార్ అంటే ఇండస్ట్రీలో ఎనలేని గౌరవం. అయితే అలాంటి ఈ ఇద్దరి లెజెండ్రీ సెలబ్రిటీలపై ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు (Ambati Rayudu) చేసిన కామెంట్లు అందరిని ఆశ్చర్యపరిస్తున్నాయి.


సుకుమార్ చిరంజీవిపై అంబటి రాయుడు అనుచిత వ్యాఖ్యలు..

అసలు విషయంలోకి వెళితే.. క్రికెట్ స్టేడియం లో భారీ ఎత్తున జన సమూహం మధ్య అత్యంత ఆసక్తికరంగా మ్యాచ్ సాగుతున్న నేపథ్యంలో.. కొన్ని విజువల్స్ ని చూపిస్తూ కామెంటేటర్ తో పాటు అంబటి రాయుడు చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా క్రికెట్ స్టేడియంలో సుకుమార్ ఫోటోని చూపించారు. అప్పుడు కామెంటేటర్ మాట్లాడుతూ..” చాలా మంది సెలబ్రిటీలు ఇప్పుడు షో చూస్తున్నారు. స్క్రీన్ పై సుకుమార్ ని కూడా మనం చూడవచ్చు. తగ్గేదేలే అంటూ చూస్తున్నారు. చాలామంది తెలుగు వాళ్ళు కూడా ఇక్కడ వున్నారు. ఎవరు కూడా ఈ మ్యాచ్ మిస్ అవ్వద్దు అని అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఒకరు నాలుగైదు సార్లు అన్నారు..” సప్లై తక్కువ.. డిమాండ్ ఎక్కువ”. అని చెబుతూ వుండగా.. మధ్యలో అంబటి మాట్లాడుతూ.. “అలా అని కాదు ఇట్లాంటి చోటైతే టీవీలో ఎక్కువగా కనిపిస్తారు కదా.. ముఖ్యంగా వేరే మ్యాచ్లో కాకుండా ఇలాంటి మ్యాచ్లలో అయితే ఇంకా ఎక్కువగా కనిపిస్తారు కదా.. అదే పవర్ ఆఫ్ క్రికెట్ అంటే.. ఇది ఒక పబ్లిసిటీ స్టంట్” అంటూ స్టార్ డైరెక్టర్ ను, స్టార్ హీరోని ఉద్దేశించి కామెంట్లు చేస్తూ.. వారి పరువు తీశారు. మొత్తానికైతే అంబటి రాయుడు చేసిన ఈ కామెంట్లపై పలువురు నెటిజెన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇండస్ట్రీలో ఎన్నో సంవత్సరాలుగా తమ నటనతో ప్రేక్షకులను అలరిస్తూ.. తమ సేవా గుణంతో ఎంతోమందిని ఆదుకున్న సెలబ్రిటీలను మీరు ఇంత మాట అంటారా అంటూ కూడా ఫైర్ అవుతూ ఉండడం గమనార్హం.


Game Changer: దర్శక నిర్మాతలపై జే.పీ.విమర్శలు.. పిచ్చోళ్ళంటూ..?

అంబటి రాయుడు కెరియర్..

ఇక అంబటి రాయుడు విషయానికి వస్తే.. క్రికెటర్ గా 2001 – 2002 రంజీ ట్రోఫీలో హైదరాబాదు తరఫున ప్రాతినిధ్యం వహించిన ఈయన.. 2002- 2023 సీజన్లో ఆంధ్ర ప్రదేశ్ జట్టుపై ఒకే మ్యాచ్లో డబుల్ సెంచరీ, సెంచరీ పూర్తి చేశారు. 2005 – 2006 సీజన్లో ఒకసారి ఆంధ్రప్రదేశ్ జట్టు తరఫున కూడా ఆడారు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆట ఆడిన ఈయన.. 2023లో ఐపీఎల్ కు గుడ్ బై చెప్పాడు. క్రికెట్ పరంగా మంచి పేరు దక్కించుకున్న అంబటి రాయుడు ఇలా తెలుగు సెలబ్రిటీలపై చేసిన కామెంట్లు, నిర్లక్ష్యపు ధోరణి అటు అభిమానులకు కూడా ఆగ్రహాన్ని తెప్పిస్తోంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×