BigTV English

Friedrich Merz Germany Elections: జర్మనీ చాన్స్‌లర్‌ ఎన్నికల్లో మెర్జ్‌ గెలుపు.. మూడో స్థానానికి పడిపోయిన అధికార పార్టీ

Friedrich Merz Germany Elections: జర్మనీ చాన్స్‌లర్‌ ఎన్నికల్లో మెర్జ్‌ గెలుపు.. మూడో స్థానానికి పడిపోయిన అధికార పార్టీ

Friedrich Merz Germany Elections| జర్మనీ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిపక్ష నేత ఫ్రెడరిక్ మెర్జ్ నేతృత్వంలోని సంప్రదాయవాదుల ( రైట్ వింగ్ సీడీయూ/సీఎస్‌యూ కూటమి) విజయం దాదాపు ఖరారైంది. ఈ నేపథ్యంలో అధికారం తమదేనని మెర్జ్ ఆత్మవిశ్వాసంతో వ్యక్తం చేశారు. జర్మనీ పార్లమెంట్ దిగువ సభ ‘బుందెస్టాగ్’కు ఆదివారం ఎన్నికలు జరిగాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం, ప్రస్తుత ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్ నేతృత్వంలోని సోషల్ డెమొక్రటిక్ పార్టీ (ఎస్‌డీపీ) పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్నడూ లేనంత పేలవ ప్రదర్శనతో మూడో స్థానానికి పరిమితం కావడం షాకింగ్ పరిణామం. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఎన్నికల్లో ఎస్‌డీపీ ఇంత దారుణ ఫలితాలు ఎదుర్కోవడం ఇదే తొలిసారి.


మొత్తం బుందెస్టాగ్ పార్లమెంట్ లో మొత్తం 630 సీట్లుండగా.. ఫ్రెడరిక్ మెర్జ్ కు చెందిన క్రిస్టియన్ డెమొక్రటిక్ యూనియన్ (సీడీయూ), మార్కస్ సోడర్ నేతృత్వంలోని క్రిస్టియన్ సోషల్ యూనియన్ (సీఎస్‌యూ) కూటమికి అత్యధికంగా 208 సీట్లు లభించాయి. కానీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన 316 సీట్లు మేజిక్ ఫిగర్ ఈ పార్టీకి దక్కకపోవడం గమనార్హం. ఇప్పుడు మెర్జ్ కూటమికి పార్లమెంటులో మెజారిటీ సాధించడానికి మిగతా 108 సీట్లు అవసరం. దీని కోసం మెర్జ్ కూటమి మిగతా పార్టీలతో కలిసి మహా కూటమి ఏర్పాటు చేయడానికి రాబోయే రోజుల్లో చర్చలు చేపట్టే అవకాశం ఉంది.

Also Read: అధ్యక్ష పదవి వదులుకుంటా.. మరి అలా చేస్తారా?.. జెలెన్‌స్కీ అతి తెలివి..


మెర్జ్ కూటమి తరువాత రెండో స్థానంలో ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ (ఎఎఫ్‌డి) పార్టీ ఉంది. ఎఎఫ్‌డి పార్టీకి మొత్తం 151 సీట్లు లభించాయి. మూడో స్థానంలో ఉన్న ప్రస్తుత ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ నాయకత్వంలోని ఎస్‌డీపీకి కేవలం 121 సీట్లు దక్కించుకుంది. అయితే ఈ రెండు పెద్ద పార్టీలలో మెర్జ్ కూటమి ఓలాఫ్ కు చెందిన ఎస్‌డీపీతో జత కట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే రెండో స్థానంలో ఉన్న ఎఎఫ్‌డి పార్టీ ఒక ఫార్ రైట్ సిద్ధాంతాలు కలది. ఆ పార్టీ ఎవరితోనూ కలిసేది లేదని ముందే స్పష్టం చేసింది. మెర్జ్ కూటమికి కూడా ఎఎఫ్‌డి పార్టీ ముందు నుంచి వ్యతిరేకిస్తూ వస్తోంది.

అయితే ఇప్పుడు జర్మనీలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఎంత కాలం పడుతుందనేది చెప్పలేని పరిస్థితి. గతంలో 2017 సంవత్సరంలో జర్మనీ పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు ఇలాగే హంగ్ ఏర్పిడింది. దీంతో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో జర్మనీ చరిత్రలోనే మొదటిసారి ఎన్నికల తరువాత ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 6 నెలల సమయం పట్టింది. పార్టీల మధ్య బేరసారాలు కుదరడానికి చర్చలు విపరీతంగా జరిగాయి. ఇప్పుడు కూడా దాదాపు అదే పరిస్థితి. కానీ అధికార ఓలాఫ్ ఎస్‌డీపీతో మెర్జ్ కూటమి నాయకులకు సన్నిహిత సంబంధాలున్నాయి. దీంతో ఈ సారి ఈ రెండు పార్టీలు కూటమి కట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

జర్మనీ ఎన్నికల ఫలితాలు రాగానే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. ఏ పని చేయని పార్టీని ప్రజలు ఓడించారని.. చెబుతూ అత్యధిక సీట్లు సాధించిన ఫ్రెడరిక్ మెర్జ్ కు శుభాకాంక్షలు తెలిపారు. జర్మనీలో ప్రస్తుతం ఆర్థిక సంక్షోభం నెలకొంది. దీంతో అక్కడ ఏ పార్టీ ప్రభుత్వం వచ్చినా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం కత్తి మీద సాములా మారింది.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×