NZ vs BAN: ఛాంపియన్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో ( ICC Champions Trophy 2025 ) భాగంగా… ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. ఈ టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ బంగ్లాదేశ్ వర్సెస్ న్యూజిలాండ్ ( Bangladesh vs New Zealand ) మధ్య… ఆరవ మ్యాచ్ జరగనుంది. గ్రూప్ ఎ లో ఉన్న ఈ రెండు జట్లు ఇవాళ పాకిస్తాన్ లోని రావల్పిండి స్టేడియం లో ( Rawalpindi Cricket Stadium ) తలపడబోతున్నాయి. ఇప్పటికే న్యూజిలాండ్… ఒక విజయంతో దూసుకు వెళ్ళగా… బంగ్లాదేశ్ మాత్రం టీమిండియా చేతిలో ఓడిపోయింది. అటు పాకిస్థాన్ ను చిత్తు చేసిన న్యూజిలాండ్… ఇవాళ మ్యాచ్ లో గెలిచి సెమీఫైనల్ కి వెళ్లాలని… ప్రయత్నాలు ప్రారంభించింది. అటు ఎలాగైనా ఈ మ్యాచ్లో గెలిచి… సెమిస్ బరిలో ఉండాలని బంగ్లాదేశ్ స్కెచ్ లు వేస్తోంది.
Also Read: Hardik Pandya Watch: పాక్ మ్యాచ్ లో ఖరీదైన వాచ్ తో పాండ్యా..ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే ?
పాకిస్థాన్ లోని రావల్పిండి వేదికగా జరగబోతున్న… బంగ్లాదేశ్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం రెండు గంటలకు టాస్ ప్రక్రియ ఉంటుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీం… మొదట బ్యాటింగ్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇప్పటివరకు న్యూజిలాండ్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య 45 మ్యాచ్ లు జరిగాయి. ఇందులో న్యూజిలాండ్ టీం 33 మ్యాచ్లలో విజయం సాధించింది. అటు బంగ్లాదేశ్ కేవలం 11 మ్యాచ్లోనే విజయం సాధించడం జరిగింది.
ఈ రెండు జట్ల మధ్య రిజల్ట్ రాకుండా ఒకే ఒక్క మ్యాచ్ ఉంది. చివరిసారిగా 2023 సంవత్సరంలో న్యూజిలాండ్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య వన్డే మ్యాచ్ జరిగింది. నీ పేరు వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ జట్టు పైన న్యూజిలాండ్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక ఈ రెండు జట్ల మధ్య చివరి 5 వన్డే మ్యాచ్లో రిజల్ట్ ఒకసారి పరిశీలిస్తే… న్యూజిలాండ్ నాలుగు విలువగా బంగ్లాదేశ్ కేవలం ఒక మ్యాచ్ లో గెలిచింది. ఇక చాంపియన్స్ ట్రోఫీలో ఈ రెండు జట్ల మధ్య రెండు మ్యాచ్లు జరిగాయి. ఇందులో న్యూజిలాండ్ ఒక్క మ్యాచ్ గెలవగా బంగ్లాదేశ్ మరొక మ్యాచ్ గెలిచింది. అయితే ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ గెలిస్తే.. పాకిస్తాన్ కు సెమిస్ అవకాశాలు ఉంటాయి. ఒకవేళ బంగ్లాదేశ్ ఓడిపోతే.. పాకిస్తాన్ తో పాటు బంగ్లా కూడా ఇంటికి వెళ్లాల్సిందే. అప్పుడు టీమిండియా అలాగే న్యూజిలాండ్ సెమీఫైనల్ కు వెళ్తాయి.
Also Read: Chiranjeevi in Ind vs Pak match: దుబాయ్ మ్యాచ్ కు చిరు, టీడీపీ నేతలు…అభిషేక్ శర్మతోనే సిట్టింగ్ !
బంగ్లాదేశ్ , న్యూజిలాండ్ ప్లేయింగ్ XIలను అంచనా
బంగ్లాదేశ్:
తాంజిద్ హసన్, సౌమ్య సర్కార్, నజ్ముల్ హొస్సేన్ శాంటో (సి), మెహిదీ హసన్ మిరాజ్, తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్ (WK), జాకర్ అలీ, రిషద్ హుస్సేన్, తంజిమ్ హసన్ సకీబ్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహ్మాన్.
న్యూజిలాండ్:
విల్ యంగ్, డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (WK), గ్లెన్ ఫిలిప్స్, మైకేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్ (c), నాథన్ స్మిత్, మాట్ హెన్రీ, విల్ ఓ’రూర్క్.