Game Changer.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రాజమౌళి (Rajamouli ) దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు రామ్ చరణ్ (Ram Charan). ఈ సినిమాతో ఏకంగా గ్లోబల్ స్టార్ గా బిరుదు కూడా సొంతం చేసుకున్నారు. అంతేకాదు ఈ సినిమా అందించిన విజయంతో ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ అందుకున్న రామ్ చరణ్.. పలు గౌరవాలను కూడా అందుకోవడం జరిగింది. ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 10వ తేదీన విడుదల చేసిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ (Shankar) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఘోరపరాభావాన్ని చవిచూసింది. ముఖ్యంగా రూ.400 కోట్లకు పైగా బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలవడంతో చాలామంది క్రిటిక్స్ కంటెంట్ ను తీవ్రంగా విమర్శించారు. ఇక ఇప్పుడు లోక్ సత్తా అధినేత మాజీ ఐఏఎస్ అధికారి, జయప్రకాష్ నారాయణ్ (Jayaprakash Narayan ) కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ విమర్శలు గుప్పించారు.
గేమ్ ఛేంజర్ మూవీపై జయప్రకాష్ నారాయణ్ ఫైర్..
జయప్రకాష్ నారాయణ్ మాట్లాడుతూ.. “గేమ్ ఛేంజర్” సినిమా దర్శకుడు, స్క్రిప్ట్ రచయితలు మూర్ఖులు. గేమ్ ఛేంజర్ దర్శకుడు చూపించాలనుకున్న అంశం పూర్తిగా తప్పుదోవ పట్టింది. యువతను అందర్నీ నేను ఒకటే కోరుతున్నాను. ఈ సినిమాలో చూపించిన అంశాలను.. ఇలాంటి పిచ్చి ఆలోచనలను దృష్టిలో పెట్టుకోకండి. ఆ సినిమా డైరెక్టర్ ఎవరో తెలియదు.. స్క్రిప్టు రచయిత కూడా ఎవరో తెలియదు.. అలాంటి మూర్ఖులు ఇలాంటి పిచ్చి భావాలను అప్రజాస్వామిక బానిసత్వ భావాలను ప్రవేశపెట్టడాన్ని క్షమించలేనివి.. ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ప్రతినిధులను మనం గౌరవించకపోతే.. ప్రజాతీర్పును గౌరవించకపోతే.. ఎలా? ఓటు అంటే అంత ఆషామాషీ అనుకుంటున్నారా? ప్రతినిధులు తప్పులు చేస్తే.. జీ హుజూర్ అని కాళ్లు పట్టుకోమని ఎవరు కూడా అనడం లేదు. కానీ ప్రజా ప్రతినిధికి, చట్టసభలకు, ప్రజాస్వామ్యానికి గౌరవం ఇవ్వకుండా నువ్వు ఐదేళ్లు ఉంటావు.. పోతావు.. నేను 30 ఏళ్లు ఉంటాను.. అనడం ఎంత అహంకారమో ఒకసారి ఆలోచించండి” అంటూ ఆయన కామెంట్లు చేశారు.
గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకోవాలంటున్న లోకసత్తా అధినేత..
అలాగే ఆయన మాట్లాడుతూ.. ఒక స్వాతంత్ర సమరయోధుడు.. ఒక మంత్రి గారు.. అన్యాయంగా నక్సలైట్ల దాడిలో మరణించాడు. ఆయనను గుర్తు చేసుకుంటూ..” సర్ నేను.. ప్రజలు ఎన్నుకోకపోతే బయటకు పోతాను” అని నాడు ఆయన అన్నారు. అప్పటికి నేను ఇంకా చిన్నవాడిని. ట్రైనింగ్ లో ఉన్న నేను..నన్ను సార్ అని పిలవద్దు. మీరు చాలా పెద్దవారు అని అన్నాను. ఆయన మంత్రి హోదాలో ఉన్నారు పైగా పెద్ద వ్యక్తి కూడా.. ఐఏఎస్ ట్రైనింగ్ లో ఉన్న నన్ను ఎంతో గౌరవంగా ఒక అధికారితో మాట్లాడారు. ప్రజా ప్రతినిధులు అందరూ గౌరవం ఇచ్చుపుచ్చుకుంటారు. కానీ దేశానికి వెన్నెముకగా మారిన యువత ఎందుకు ఇవన్నీ ఆలోచించడం లేదు.. నిజంగా దేశాన్ని ప్రేమిస్తే, ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తే.. ప్రజాప్రతినిధులను ఎవరు ఇలాంటి మాటలు అనరు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించకపోతే.. ఒకరోజు పరీక్ష పాసైన అధికారికి ఇంత అహంకారమా …? ఈరోజు నీకు అదృష్టం ఉండొచ్చు.. చదువుకున్నవాడిగా గొప్పవాడివి కావచ్చు. అంతమాత్రాన ఇంత అహంకారమా అంటూ గేమ్ ఛేంజర్ లో రామ్ చరణ్ పాత్ర పై విమర్శలు కురిపించారు. ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఏది ఏమైనా గేమ్ ఛేంజర్ సినిమాతో పాటు అందులోని పాత్రలను ఆయన విమర్శిస్తూ చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. ఈ సినిమాలో రామ్ చరణ్ ఐఏఎస్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">