BigTV English
Advertisement

Thug Life: హీరోలు వెళ్లిపోతున్నారా.. వెళ్లగొట్టేస్తున్నారా..?

Thug Life: హీరోలు వెళ్లిపోతున్నారా.. వెళ్లగొట్టేస్తున్నారా..?

Thug Life: ఒక స్టార్ కాంబో వస్తుంది అంటే ఆ సినిమాపై అభిమానులు ఎన్ని అంచనాలను పెట్టుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులో కుర్ర హీరోలు కూడా నటిస్తున్నారు అంటే.. ఆ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తూ ఉంటారు. ఇక అలా ఫ్యాన్స్ అందరూ ఎదురుచూస్తున్న కాంబో కమల్ హాసన్- మణిరత్నం. నాయకుడు సినిమా తరువాత ఈ కాంబో నుంచి వస్తున్న చిత్రం థగ్ లైఫ్. 36 ఏళ్ల తరువాత ఈ కాంబో రిపీట్ అవుతుందని తెలియడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేశారు.


రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్ & రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో కమల్ తో పాటు జయం రవి, దుల్కర్ సల్మాన్, సిద్దార్థ్ లాంటి హేమాహేమీలు నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన కమల్ ఫస్ట్ లుక్ ఏ రేంజ్ లో సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ సినిమా అసలు ముందుకు వెళ్తుందో లేదో అనే సందిగ్ద అవస్థను ప్రస్తుతం ఎదుర్కొంటుంది. అందుకు కారణం.. మణిరత్నం. గత కొన్నిరోజులుగా ఈ సినిమా నుంచి స్టార్ హీరోలు ఒక్కొక్కరిగా తప్పుకుంటూ వస్తున్నారు.

మొదట దుల్కర్, తరువాత జయం రవి.. ఇప్పుడు సిద్దార్థ్ సైతం ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. వీరందరూ చెప్పే మాట ఒకటే.. మణిరత్నం మీద తమకు గౌరవమున్నా.. తమ డేట్స్ తీసుకొని వాటిని వేస్ట్ చేస్తున్నాడు అని, ఈ డేట్స్ కనుక వేరే సినిమాకు ఇస్తే తమ మార్కెట్ ఇంకా పెరుగుతుందని వారు అభిప్రాయపడుతున్నారట. అందుకే ఒక్కొక్కరిగా వెళ్లిపోతున్నారని టాక్. ఇక ఇప్పడూ దుల్కర్ ప్లేస్ లోకి శింబు వచ్చి చేరాడు. మరి మిగతా వారి ప్లేస్ లలో ఏ హీరోలు నటిస్తారు అనేది తెలియాల్సి ఉంది. అయితే ఇక్కడ మణిరత్నం ఎందుకు లేట్ చేస్తున్నాడు అనేది పాయింట్. హీరోలు వెళ్లిపోతున్నారా.. లేక కావాలనే లేట్ చేసి వెళ్లగొట్టేస్తున్నారా..? అనేది తెలియాల్సి ఉంది.


Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×