BigTV English

Bournvita: హెల్త్ డ్రింక్స్ కేటగిరి నుంచి బోర్న్ విటాను తొలగించండి.. కేంద్రం కీలక ఆదేశాలు

Bournvita: హెల్త్ డ్రింక్స్ కేటగిరి నుంచి బోర్న్ విటాను తొలగించండి.. కేంద్రం కీలక ఆదేశాలు

Bournvita: కేంద్ర ప్రభుత్వం ఈ-కామర్స్ సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. బోర్న్ విటా సహా ఇతర పానీయాలను హెల్త్ డ్రింక్స్ కేటగిరీ నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇటీవలే బోర్న్ విటాలో పరిమితికి మంచి అధికంగా చక్కర స్థాయిలు ఉన్నాయని ఎన్‌సీపీసీఆర్ నిర్థారించిన విషయం తెలిసిందే.


చాక్లెట్ మాల్ట్ డ్రింక్ మిశ్రమాల బ్రాండ్ లకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. పలు తయారీ కంపెనీల వెబ్ సైట్ లు, ఇతర మాద్యమాల్లో పలు చాక్లెట్ మాల్ట్ డ్రింక్ ఉత్పత్తులు ప్రస్తుతం హెల్త్ డ్రింక్స్ అంటూ ప్రచారం చేసుకుంటున్నాయి. అయితే కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈకామర్స్ కంపెనీలకు ఆ హెల్త్ డ్రింక్ అనే పదాన్ని వెంటనే తొలగించాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఇటీవలే సీఆర్‌పీసీ-2005 చట్టంలోని సెక్షన్-14 కింద బోర్న్ విటాపై విచారణ చేపట్టింది. ఎఫ్ఎస్ఎస్ చట్టం 2006లో హెల్త్ డ్రింక్ అని దేన్నీ నిర్థారించలేమని కేంద్రం ఏప్రిల్ 10న ప్రకటించింది.


ఇటీవలే ఓ యూట్యూబర్ బోర్న్ విటాలో చక్కెర స్థాయిలు కేంద్రం నిర్దేశించిన స్థాయికి మంచి ఉన్నాయంటూ ఓ వీడియోను విడుదల చేశారు. దీనిపై సదురు యూట్యూబర్ ఎన్‌సీపీసీఆర్ కు కూడా ఫిర్యాదు చేశాడు. బోర్న్ విటా హెల్త్ డ్రింక్ అంటూ ప్రచారం చేస్తుండడంతో అది చిన్న పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉందంటూ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Also Read: బీజేపీ లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్..!

అయితే ఆ యూట్యర్ చేసిన ఫిర్యాదును ఎన్‌సీపీసీఆర్ స్వీకరించి.. విచారణకు ఆదేశించింది. ఈ ఎన్‌సీపీసీఆర్ బోర్న్ విటా సంస్థపై విచారణ జరిగి.. అనుమతించిన దానికంటే అధికంగా చక్కెర స్థాయిలు ఉన్నట్లు గుర్తించింది. ఈ తరుణంలో కేంద్రం బోర్న్ విటా, ఇతర పానీయాలు, బేవరేజెస్ ను హెల్త్ డ్రింక్స్ కేటగిరి నుంచి తొలగించాలంటూ ఈ-కామర్స్ సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. వెంటనే వీటిని అమలు చేయాలని స్పష్టం చేసింది.

Tags

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×