Samantha:స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఒకానొక సమయంలో వరుస సినిమాలతో భారీ విజయాన్ని సొంతం చేసుకొని, ఊహించని రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత వ్యక్తిగతంగా ఇబ్బందులు ఎదుర్కొని, అప్పుడు వార్తల్లో నిలిచింది. కానీ ఇప్పుడు తన సినిమాలతో, వెబ్ సిరీస్ లతో సరికొత్త గౌరవాలు అందుకుంటూ రికార్డు సృష్టిస్తోంది.ఇప్పుడు తాజాగా ఓటీటీలో అరుదైన ఘనత సాధించింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
ఓటీటీ ఉత్తమ నటిగా సమంత..
సమంత ఈ మధ్యకాలంలో ఎక్కువగా బాలీవుడ్ లో వెబ్ సిరీస్ లు చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే చివరిగా ఈమె రాజ్ అండ్ డీకే దర్శక ద్వయంలో వచ్చిన ‘సిటాడెల్ – హనీ బన్నీ’ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యాక్షన్ పర్ఫామెన్స్ తో బెస్ట్ అనిపించుకుంది సమంత. ఇందులో వరుణ్ ధావన్ (Varun Dhawan)హీరోగా నటించారు. అయితే ఇతడి కంటే మించి తన నటనతో అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ నేపథ్యంలోనే ఒక మీడియా సంస్థ సమంతాకు ఓటీటీ ఉత్తమ నటిగా అవార్డు అందించింది. ఇక అటు సమంత కూడా ఈ అవార్డు అందుకోవడం పై సంతోషం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలియజేసింది.
నాకు దక్కిన అరుదైన గౌరవం – సమంత..
ఇకపోతే ఓటీటీ ఉత్తమ నటిగా అవార్డు అందుకోవడం పై సమంత మాట్లాడుతూ..” నాతో పాటు ఈ అవార్డుకు నాకు ఇష్టమైన ఎంతోమంది నటీమణులు ఈ అవార్డుల నామిని బరిలో నిలిచారు. నిజానికి ఈ సిరీస్ ను పూర్తి చేయడమే నాకు పెద్ద అవార్డు. ఎన్నో ప్రతికూల పరిస్థితుల మధ్య దీనిని నేను పూర్తి చేశాను. ఇక ఇప్పుడు నాకు ఉత్తమ ఓటిటి నటిగా అవార్డు లభించడం నిజంగా నాకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తాను. ముఖ్యంగా రాజ్ అండ్ డీకే, వరుణ్ ధావన్ ల కారణంగానే నేను ‘సిటాడల్ – హనీ బన్నీ’ వెబ్ సిరీస్ ను దిగ్విజయంగా పూర్తి చేయగలిగాను. ఎన్నో కష్టాలు, ఇబ్బందుల, సడన్ గా సెట్లో పడిపోవడం, ఎన్నో ఆరోగ్య సమస్యలతో నేను సతమతమయ్యాను. అయినా సరే ఓపిక తెచ్చుకొని మరీ ఈ వెబ్ సిరీస్ కోసం కష్టపడ్డాను. ఇప్పుడు అందుకు తగిన ప్రతిఫలం నాకు లభిస్తోంది” అంటూ సమంత తనకు వచ్చిన ఈ అవార్డుపై సంతోషం వ్యక్తం చేసింది.అంతేకాదు” సినిమా సెట్ లో దర్శకులు, నిర్మాతలు, హీరో తనను చాలా జాగ్రత్తగా చూసుకున్నారని, వారికి ఎప్పటికీ ఈ విషయంలో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను” అంటూ సమంత తెలిపింది. ఇకపోతే ఈ వెబ్ సిరీస్ షూటింగ్ చేస్తున్న సమయంలో ఎన్నోసార్లు స్పృహ తప్పి పడిపోయినట్లు సమంతతో పాటు ఈ చిత్ర దర్శకుడు రాజ్ కూడా వెల్లడించిన విషయం తెలిసిందే. ఏది ఏమైనా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నప్పటికీ కూడా సమంత ఇలా ఒకదాని తర్వాత ఒకటి కష్టపడుతూ వెబ్ సిరీస్ లు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక ప్రస్తుతం సమంత ‘రక్త్ బ్రహ్మాండ్’ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్ కి కూడా రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు.
Payal Rajput: టవల్తో రచ్చ చేస్తున్న పాయల్.. అందాల జాతర.. వీడియో వైరల్..!