Trinamool MP – Rohit Sharma: భారత క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ పై కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ షమా మహమ్మద్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆమె రోహిత్ శర్మను అధిక బరువు ఉన్నాడని, భారత్ లో ఎప్పుడు లేని విధంగా ఆయన ఆకట్టుకోలేని కెప్టెన్ గా నిలిచాడని, రోహిత్ శర్మ వెంటనే బరువు తగ్గాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా న్యూజిలాండ్ పై విజయం తర్వాత ఈ ట్వీట్ చేసింది షమా మొహమ్మద్.
Also Read: Mausami Singh: పాకిస్తాన్ ను ఓడించినందుకు.. రోహిత్ శర్మ పై కాంగ్రెస్ కుట్రలు?
దీంతో ఆమె వ్యాఖ్యలపై క్రీడాభిమానులతో పాటు బిజెపి నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. మరోవైపు బీసీసీఐ కూడా ఆమె వ్యాఖ్యల పట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో కాంగ్రెస్ పార్టీ దిద్దుబాటు చర్యలకు దిగింది. షమా మహమ్మద్ కామెంట్లకు, పార్టీకి ఎటువంటి సంబంధం లేదని పేర్కొంది. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని ఆమెను ఆదేశించామని.. క్రీడాకారులను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ గౌరవిస్తూనే ఉంటుందని ఆ పార్టీ సీనియర్ నేత పవన్ ఖేరా పేర్కొన్నారు.
ఇక పార్టీ ఆదేశాలతో షమా మొహమ్మద్ ఆమె చేసిన పోస్టులు, కామెంట్లను ఎక్స్ {ట్విటర్} నుండి డిలీట్ చేసింది. అయితే తాజాగా రోహిత్ శర్మని ప్రశ్నిస్తూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి షమా మొహమ్మద్ చేసిన వ్యాఖ్యలను త్రుణముల్ కాంగ్రెస్ ఎంపీ సౌగత్ రాయ్ {Trinamool MP – Rohit Sharma} సమర్ధించారు. రోహిత్ శర్మ పై షమా మొహమ్మద్ చేసిన కామెంట్స్ తప్పేమీ కాదన్నారు. అంతేకాకుండా రోహిత్ శర్మ అధిక బరువుతో బాధపడుతూ ఫిట్ గా లేడని.. అతడు జట్టులో ఉండకూడదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.
” దీనికి రాజకీయాలతో సంబంధం లేదు. నేను మాట్లాడేది క్రికెట్ గురించి. రెండేళ్లకు ఒకసారి సెంచరీ సాధించడం, ఇతర మ్యాచ్లలో త్వరగా అవుట్ కావడం వల్ల జట్టులో రోహిత్ శర్మకి స్థానం దక్కదు. అతడు జట్టులో కేప్టన్ గా ఉండకూడదు. రోహిత్ శర్మ పై కాంగ్రెస్ నాయకురాలు షమా మొహమ్మద్ చేసిన సరైనవి. నిజంగానే రోహిత్ శర్మ అధిక బరువుతో ఉన్నాడు. దీనిని ప్రజలు పట్టించుకోవడం లేదు.
Also Read: BCCI: రోహిత్‌పై బాడీ షేమింగ్ కామెంట్స్.. కాంగ్రెస్ పై BCCI యాక్షన్?
మనం ఫీట్ గా మరియు సమర్ధుడైన కెప్టెన్ గురించి మాట్లాడుకుంటే చాలామంది కొత్త ఆటగాళ్లు బాగా రాణిస్తున్నారు. ఫిట్నెస్ సమస్య అయితే బూమ్రా లాంటి వ్యక్తి ఫీట్ గా ఉంటే గొప్ప కెప్టెన్ కావచ్చు. శ్రేయస్ అయ్యర్ కూడా కెప్టెన్ కావచ్చు. కానీ రోహిత్ శర్మకి జట్టులో స్థానం ఉండకూడదు” అంటూ {Trinamool MP – Rohit Sharma} హాట్ కామెంట్స్ చేశాడు. అయితే షమా మొహమ్మద్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ స్పందించిన నేపథ్యంలో.. టీఎంసీ సౌఘత్ రాయ్ వ్యాఖ్యల పట్ల ఏ విధంగా స్పందిస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.