SCR Holi Special Trains: ఆయా ప్రత్యేక సందర్భాలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక రైళ్లను నడుపుతుంటుంది సౌత్ సెంట్రల్ రైల్వే. ఇప్పటికే వీకెండ్స్ సందర్భంగా ఏపీలోని పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడిపిన రైల్వే అధికారులు, హోలీ సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. హోలీ పండుగ సందర్భంగా ప్రయాణీకుల రద్దీని తగ్గించడానికి దక్షిణ మధ్య రైల్వే (SCR) చర్లపల్లి- హజ్రత్ నిజాముద్దీన్ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అధికారులు తెలిపారు. చర్లపల్లి – H నిజాముద్దీన్ సర్వీస్ మార్చి 6, 12, 16 తేదీలలో నడపనున్నట్లు వెల్లడించారు. అటు H నిజాముద్దీన్ – చర్లపల్లి సర్వీస్ మార్చి 8, 14, 18 తేదీలలో నడుస్తాయన్నారు. ఈ మేరకు ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. ఇక ఈ ప్రత్యేక రైళ్లలో 2AC, 3AC, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయని తెలిపారు.
ఈ రైళ్లు ఏ స్టేషన్లలో ఆగుతాయంటే?
ఇక ఈ ప్రత్యేక రైళ్లు కాజీపేట, రామగుండం, మంచిర్యాల, సిర్పూర్ కాగజ్ నగర్, బల్హార్షా, చంద్రాపూర్, నాగ్ పూర్, రాణి కమలాపతి, బీణా, ఝాన్సీ, ఆగ్రా, పల్ వాల్ స్టేషన్లలో ఆగుతాయి.
కాచిగూడ – మదార్ మధ్య ప్రత్యేక రైళ్లు
అటు హోలీ పండుగ సందర్భంగా ప్రయాణీకుల రద్దీని తగ్గించడానికి దక్షిణ మధ్య రైల్వే (SCR) కాచిగూడ – మదార్ – కాచిగూడ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వెల్లడించింది. కాచిగూడ – మదార్ (07701) సర్వీస్ మార్చి 11, 16 తేదీలలో నడవనుంది. అటు మదార్ – కాచిగూడ (07702) సర్వీస్ మార్చి 13, 18 తేదీలలో అందుబాటులో ఉంటుంది. ఈ మేరకు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటన విడుదల చేసింది.
Read Also: తొలి రాజధానికి 56 ఏళ్లు.. దేశంలో ఎన్ని రైళ్లు సేవలు అందిస్తున్నాయో తెలుసా?
ఈ రైళ్లు ఏ స్టేషన్లలో ఆగుతాయంటే?
ఇక హోలీ ప్రత్యేక రైళ్లు మల్కాజ్ గిరి, మేడ్చల్, కామారెడ్డి, నిజామాబాద్, బాసర్, ధర్మాబాద్, నాందేడ్, పూర్ణ, బాస్మత్, వాషిమ్, అకోలా, బర్హన్ పూర్, రాణి కమల్ పతి, సెహోర్, ఉజ్జైన్, మాండ్సోర్, భిల్వారా, నసీరాబాద్, అజ్మీర్ రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. తిరిగి వచ్చేటప్పుడు కూడా ఆగుతాయని రైల్వే అధికారులు వెల్లడించారు.
Read Also: ప్యాసింజర్లకు అలర్ట్, ఇకపై ఈ రైళ్లు ఆ స్టేషన్ లో ఆగవట!
షాలిమార్, సంత్రాగచ్చికి ప్రత్యేక రైళ్లు
హోలీ సందర్భంగా ఈ రైళ్లతో పాటు మరికొన్ని రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. చర్లపల్లి నుంచి షాలిమార్, సంత్రాగచ్చికి ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు ప్రకటించారు. ఈ రైళ్లు నల్లగొండ, మిర్యాలగూడ, నడికుడ, సత్తెనపల్లె, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం,రాజమండ్రి, సామర్లకోట, అనకాపల్లి, విజయనగరం, భువనేశ్వర్, కటక్, ఖరగ్ పూర్ స్టేషన్లలో ఆగనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్లను ప్రయాణీకులు వినియోగించుకోవాలని సూచించారు. అటు హోలీకి ప్రత్యేక రైళ్లు కేటాయించడం పట్ల ప్రయాణీకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక రైళ్తు లేకపోతే, తమ సొంతూళ్లకు వెళ్లేందుకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉండేదంటున్నారు.
Read Also: ఇండియన్ రైల్వే సరికొత్త నిర్ణయం, ఇక టికెట్ లేకుండా స్టేషన్ లోకి అడుగు పెట్టడం అసాధ్యం!