Udit Narayan: ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు ఎప్పుడు.. ఎవరితో ఎలా ప్రవర్తిస్తారో చెప్పడం అసాధ్యంగా మారిపోయింది. ఒక్కొక్కసారి తెలిసి చేస్తారో.. తెలియక చేస్తారో తెలియదు కానీ.. వీరు చేసే పనులే వీరిని చిక్కుల్లో పడేలా చేస్తున్నాయని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఒక స్టార్ సింగర్ ఒక అమ్మాయికి లైవ్ లో పెదాలపై ముద్దు పెట్టి చిక్కుల్లో పడ్డారు. ఆయన ఎవరో కాదు ప్రముఖ సింగర్ ఉదిత్ నారాయణ్ (Udit Narayan). తాజాగా ఒక లైవ్ కాన్సర్ట్ నిర్వహించగా.. ఈయనతో ఫోటోలు దిగడానికి ఆసక్తి చూపించిన మహిళ అభిమానిని ఆయన ముద్దు పెట్టుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.. దీంతో ఆయన తీరును తప్పుపడుతూ పలువురు విమర్శల వర్షం కురిపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు నెటిజన్లు కూడా ఫోటో కావాలని అడిగితే ఇలా అసభ్యంగా ప్రవర్తిస్తారా అంటూ పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఉదిత్ నారాయణ్ ఒక ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అలా సడన్ గా ముద్దు పెట్టుకోవడానికి గల కారణాన్ని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు.
విమర్శలపై క్లారిటీ ఇచ్చిన ఉదిత్ నారాయణ్..
ఉదిత్ నారాయణ్ మాట్లాడుతూ.. “అభిమానులకు నేనంటే చాలా ఇష్టం. అందుకే తమ ఇష్టాన్ని తెలియజేయడానికి వారు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే కొంతమంది షేక్ హ్యాండ్ ఇవ్వాలని చూస్తే, మరి కొంతమంది ముద్దు పెట్టుకోవాలని అనుకుంటారు. అది కేవలం ఆత్మీయతతో కూడుకున్న విషయం మాత్రమే. నేను కూడా ఎంతో మర్యాద కలిగిన వ్యక్తిని. ఒకరితో తప్పుగా ప్రవర్తించే ఉద్దేశం నాకు ఎప్పటికీ లేదు. సమాజంలో మాకు మంచి పేరు ఉంది. అందుకే మేము వివాదాలకు దూరంగా ఉంటాము. కొంతమంది కావాలని దీనిని వివాదంగా చూస్తూ నాపై తప్పుపడుతున్నారు” అంటూ ఉదిత్ నారాయణ్ తెలిపారు. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
అసలేం జరిగిందంటే..?
ఇక అసలు జరిగిన విషయం ఏమిటి? అనే విషయానికి వస్తే.. ఇటీవల ఉదిత్ నారాయణ్ లైవ్ కాన్సర్ట్ నిర్వహించగా.. అందులో తన కెరీర్లో పేరుపొందిన పాటలను ఇందులో ఆలపించారు. ‘మోహ్రా’ లోని ‘టిప్ టిప్ బర్సా’ పాట పాడుతున్న సమయంలో కొంతమంది మహిళా అభిమానులు ఆయనతో ఫోటో దిగడానికి ఆసక్తి చూపించారు. ఈ క్రమంలోనే ఒక మహిళ అభిమాని పెదవులపై ఆయన ముద్దు పెట్టుకోవడంతో ఒక్కసారిగా హైలెట్ అయింది. ఇక ఈ విషయంపైనే ఆయనపై విమర్శలు గుప్పిస్తూ పలువురు పలు రకాలుగా కామెంట్లు చేశారు. ఇక దీనిపైనే ఈ ప్రముఖ సింగర్ క్లారిటీ ఇచ్చారు.
ఉదిత్ నారాయణ్ ఆలపించిన తెలుగు గీతాలు..
వివిధ భాషలలో మధురమైన పాటలు పాడి ప్రేక్షకులను అలరించే ఈయన తెలుగులో కూడా అంతకుమించి పాటలు పాడి ఆకట్టుకున్నారు.. ఇదివరకే “అందాల ఆడబొమ్మ..”, “కీరవాణి రాగంలో..”, “అందమైన ప్రేమ రాణి..”, ” పసిఫిక్ లో దూకెయ్ మంటే దూకేస్తానే నీకోసం.. “వంటి ఎన్నో మధురమైన పాటలు పాడి తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువయ్యారు గాయకుడు ఉదిత్ నారాయణ్.