Faria Abdullah..అందానికి తగ్గ అందమే కాదు నటన, ప్రతిభతో కూడా ఎంతోమందిని ఆకట్టుకుంది ఆరడుగుల ముద్దుగుమ్మ ఫరియా అబ్దుల్లా (Faria Abdullah). ‘జాతి రత్నాలు’ సినిమాలో చిట్టి పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ, మొదటి సినిమాతోనే అందరిని ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా ఈమెను చూసిన ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోవడానికి కారణం ఆమె హైట్. ప్రభాస్ (Prabhas ) హైట్ తో సరితూగుతూ.. అందరిని అబ్బురపరిచింది. తన అందంతో, అభినయంతో ఆకట్టుకుంది. కానీ ఈమె హైట్ ఈమె కెరియర్ కు అడ్డంకిగా మారిందని చెప్పవచ్చు. ముఖ్యంగా హీరో కంటే హీరోయిన్ కాస్త హైట్ లో తక్కువగా ఉంటే జోడి చక్కగా ఉంటుంది. కానీ ఈమె ప్రభాస్ (Prabhas), మహేష్ బాబు (Mahesh Babu) లాంటి హీరోలకు మాత్రమే సరితూగుతుంది. అందుకే చిన్న చిన్న సినిమాలలో కూడా ఈమెకు అవకాశాలు రావడం లేదు. అందుకే స్పెషల్ సాంగ్ లతో సరిపెట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉండగా తాజాగా ఫరియా అబ్దుల్లా.. తనకు ఆరడుగుల బాయ్ ఫ్రెండ్ వున్నాడని, అందుకే అలా కొత్తగా ట్రై చేద్దాం అనిపించింది అంటూ సంచలన కామెంట్స్ చేసింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
ఆరడుగుల బాయ్ ఫ్రెండ్ అంటూ ఫరియా కామెంట్స్..
సాధారణంగా ఏ సినిమా ఇండస్ట్రీ అయినా సరే తప్పకుండా హీరోయిన్లు రిలేషన్ షిప్ లో ఉంటారన్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా అలాంటి రిలేషన్ వెతుక్కోని వారు కేవలం కొద్ది మంది మాత్రమే తారస పడుతూ ఉంటారు . ముఖ్యంగా చాలామంది హీరోయిన్స్ తమకు ఉన్న పాపులారిటీతో సంబంధం లేకుండా రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇక అందులో భాగంగానే తాను కూడా డేటింగ్ లో ఉన్నానంటూ హాట్ బాంబ్ పేల్చింది ఫరియా అబ్దుల్లా. తాజాగా ఓటీటీ షోకి సంబంధించిన ప్రోమోలో అసలు విషయాన్ని బయట పెట్టింది. అందరిలాగే తనకు కూడా ఒక బాయ్ఫ్రెండ్ ఉన్నాడని, అయితే అతడు కూడా తన లాగే ఆరడుగులు ఉంటాడు అంటూ చెప్పుకొచ్చింది. ఈ విషయాన్ని చాలా సీరియస్ గా చెబుతూ.. తన డేటింగ్ విషయాన్ని బయట పెట్టింది. ఇది చూసి అభిమానులందరూ ఆశ్చర్యపోగా ..వెంటనే నవ్వుతూ అదంతా ఉత్తిదే అంటూ ఝలక్ ఇచ్చింది ఫరియా..
కొత్తగా ఉంటుందని ట్రై చేశా..
ఇక ఇదే విషయంపై ఫరియా మాట్లాడుతూ.. “ఎవరైనా సరే ఏ హీరోయిన్ ని అడిగినా అందరూ ఒకటే చెబుతారు
బాయ్ఫ్రెండ్ లేడు.. రిలేషన్ షిప్ లో లేము అని, నాకెందుకో కొత్తగా ట్రై చేయాలనిపించింది. అందుకే అలా చెప్పాను” అంటూ నవ్వుతూ జవాబు ఇచ్చింది ఫరియా. ఇకపోతే ఫరియా సమాధానం చెప్పింది కానీ సోషల్ మీడియా మాత్రం దీనిని నమ్మడం లేదు. గతంలో ప్రేమలు, పెళ్లిళ్లపై కూడా ఫరియా చెప్పిన స్టేట్మెంట్స్ ని ఇప్పుడు బయటకు తీస్తూ ట్రెండ్ చేస్తున్నారు. జోడియన్ నూరాబ్ అనే ఒక ఆర్టిస్ట్ ఈమె రిలేషన్ లో ఉన్నట్లు, అతడు ఇండస్ట్రీలో పలు షార్ట్ ఫిలిమ్స్ లో చేస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు స్వయంగా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంటూ ప్రకటించింది. అంతలోనే ఎవరూ లేరు అంటూ కామెంట్లు చేసింది. మరి నిజంగానే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేక కావాలనే ఇలా చెప్పిందా అనే విషయాలు మాత్రం సస్పెన్స్ గానే ఉన్నాయి.