Samantha: సమంత సినిమాలకు ఒక ఏడాది గ్యాప్ ఇచ్చిన విషయం తెల్సిందే. ఏడాది వెకేషన్ ఎంజాయ్ చేసి, ఈ మధ్యనే సినిమాలను ఒప్పుకుంటుంది. ఆమె సినిమాలు పక్కన పెడితే.. అందరూ సామ్ నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ ఎప్పుడెప్పుడు ఓటీటీలో రిలీజ్ అవుతుందా అని వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.
హాలీవుడ్ లో ప్రియంకా చోప్రా నటించిన సిటాడెల్ సిరీస్ ను బాలీవుడ్ లో సామ్ సిటాడెల్ హానీ బన్నీ అనే పేరుతో రీమేక్ చేశారు. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో స్టార్ డైరెక్టర్స్ గా మారిన రాజ్ అండ్ డీకే ఈ సిరీస్ కు దర్శకత్వం వహించగా వరుణ్ ధావన్ హీరోగా నటించాడు. ఇప్పటివరకు సెట్ లో స్టిల్స్ తప్ప ఈ సిరీస్ నుంచి ఒక్క పోస్టర్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేయలేదు.
అమెజాన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సిరీస్ ను నిర్మించింది. గత రెండేళ్లుగా ఈ సిరీస్ కోసం సామ్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. లేడీ స్పై గా సామ్ యాక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయని, అంతేకాకుండా వరుణ్ తో సామ్ ఇంటిమేటెడ్ సీన్స్ కూడా ఉండనున్నాయని తెలియడంతో ఫ్యాన్స్ అస్సలు ఆగలేకపోతున్నారు.
ఇక ఎట్టకేలకు సిటాడెల్ నుంచి మంచి అప్డేట్ రానుందని తెలుస్తోంది. తాజాగా సామ్.. ముంబైలో ప్రత్యేక్షమయ్యింది. అందుతున్న సమాచారం ప్రకారం రేపు ముంబైలో సిటాడెల్ ప్రెస్ మీట్ ఉండబోతుందని తెలుస్తోంది. దీనికోసమే సామ్ ముంబై వెళ్లినట్లు తెలుస్తోంది. ఇక ముంబై లో ఈ చిన్నదాని స్టైలిష్ లుక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
బ్లాక్ టాప్.. గాగుల్స్ తో సామ్ అదిరిపోయింది. ఇక సిటాడెల్ ప్రమోషన్స్ షురూ అయ్యాయి అంటే.. అప్డేట్స్ రావాడం మొదలయ్యినట్లే. ఇక సిటాడెల్ హనీ బన్నీ అని హ్యాష్ ట్యాగ్స్ పెట్టి ట్రెండ్ స్టార్ట్ చేయండిరో అని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సిరీస్ తో సామ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.