ఈ రోజుల్లో సందర్భం ఏదైనా సుక్క, ముక్క కచ్చితంగా ఉండాల్సిందే. బర్త్ డే అయినా, పెళ్లి అయినా, చావు అయినా, దినం అయినా మందు తాగాల్సిందే. అయితే.. ఒక్కొక్కరు ఒక్కో రకమైన మద్యం తాగుతారు. కొందరికి విస్కీ ఇష్టం. మరికొందరికి వోడ్కా ఇష్టం. ఇంకొందరికి బీరు ఇష్టం, కొంత మంది వైన్.. ఇవన్నీ వద్దనుకుంటే కల్లు కూడా తాగుతారు. అయితే, వీటిలో ఏది శరీరానికి ప్రమాదకరం? అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
ప్రతి ఆల్కహాల్ లో ఓ కామన్ పాయిజన్ ఉంది. దానిపేరే ఇథనాల్. ఏ మద్యం తీసుకున్నా ఇది కచ్చితంగా ఉంటుంది. మద్యం తాగిన తర్వాత అది చివరికి లివర్ లోకి వెళ్తుంది. మద్యం మన బాడీని డ్యామేజ్ చేయకూడదని లివర్ చాలా కష్టపడుతుంది. దాన్ని యూరిన్ ద్వారా బయటకు పంపిస్తుంది. బీరు, వైన్, విస్కీ అనేది కేవలం నాలుకకు రుచి మాత్రమే. ఒక్కసారి గొంతులో నుంచి కిందికి జారితే బాడీకి డిఫరెన్స్ అనేది తెలియదు. ఇథనాల్ అనేది వచ్చింది. దాన్ని బాడీ నుంచి బయటకు పంపాలి అనుకుంటుంది. దాన్ని కొన్ని ఎంజైమ్స్ సాయంతో ఇథనాల్ ను ముక్కలు చేసి బయటకు పంపిస్తుంది.
30 మిల్లీ లీటర్ల విస్కీలో 1 యూనిట్ ఆల్కహాల్ ఉంటుంది. 330 మిల్లీ లీటర్ల బీరులో 1.5 యూనిట్ల ఆల్కహాల్ ఉంటుంది. 330 మిల్లీ లీటర్ల వైన్ తీసుకుంటే దాదాపు 3 యూనిట్ల ఆల్కహాల్ ఉంటుంది. 330 మిల్లీ లీటర్ల కల్లు తీసుకుంటే 3 నుంచి 5 యూనిట్ల ఆల్కహాల్ ఉంటుంది. ఫ్రెష్ కల్లులో తక్కువ ఆల్కహాల్ ఉంటుంది. ఎక్కువ సేపు ఉంటే ఆల్కహాల్ శాతం పెరుగుతుంది. వోడ్కా, జిన్ దాదాపుగా విస్కీతో సమానంగా ఆల్కహాల్ ఉంటుంది. చూడటానికి నీళ్లలాగే క్లియర్ గా కనిపించినా, 30 మిల్లీ లీటర్లలో 1 యూనిట్ ఆల్కహాల్ ఉంటుంది.
మగవాళ్లు వారానికి సుమారు 14 యూనిట్ల వరకు మద్యం తాగవచ్చని అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఆడవాళ్లు అందులో సగం, అంటే 7 యూనిట్ల వరకు ఆల్కహాల్ తీసుకోవచ్చు. ఆ లిమిట్ లో ఉంటే బాడీ ఏమీ డ్యామేజ్ కాదు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. రోజూ మద్యం తాగే వారు 14 యూనిట్లకు మించి తాగుతారు. వారానికి ఒకసారి మద్యం తాగేవాళ్లు ఈ 14 యూనిట్ల లిమిట్ ను క్రాస్ చేసే అవకాశం ఉండదు. అంతకు మించి తాగితే ఈజీగా మార్క్ క్రాస్ అవుతుంది. ప్రస్తుతం ఇండియాలో డయాబెటిస్, బీపీ, ఫ్యాటీ లివర్ సమస్యలు ఉన్నాయి. వారికి 14 యూనిట్ల నిబంధన వర్తించదు. ఇంకా తక్కువే తీసుకోవాల్సి ఉంటుంది. ఇంతకీ మద్యంలో ఏది డేంజరస్ అనే వారికి సమాధానం అన్నీ ప్రమాదకరమే. ఏదీ బెటర్ అని చెప్పడానికి లేదు. సో, మద్యానికి దూరంగా ఉండాలి. మరీ తాగాలి అనిపిస్తే, 14 యూనిట్లకు మించకుండా చూసుకోవడం మంచిది.
Read Also: గుండె సేఫ్ గా ఉండాలంటే ఏ సైడ్ పడుకోవాలి? డాక్టర్లు ఏం చెప్తున్నారంటే?