BigTV English

Hunt: ఆయన వళ్లే నా లైఫ్ యూటర్న్ తిరిగింది: సుధీర్ బాబు

Hunt: ఆయన వళ్లే నా లైఫ్ యూటర్న్ తిరిగింది: సుధీర్ బాబు

Hunt: మహేష్ దర్శకత్వంలో యంగ్ హీరో సుధీర్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ ‘హంట్’. భవ్య క్రియేషన్స్ పతాకంపై నిర్మాత వి. ఆనంద ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సీనియర్ హీరో శ్రీకాంత్, ‘ప్రేమిస్తే’ ఫేమ్ భరత్ ఈ మూవీలో ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా రిపబ్లిక్ డే కానుకగా ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.


ఈ సందర్భంగా హైదరాబాద్‌లో మేకర్స్ ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరోలు సుధీర్ బాబు, శ్రీకాంత్, భరత్, డైరెక్టర్ మహేష్, నిర్మాత ఆనంద ప్రసాద్, మేకర్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుధీర్ బాబు మాట్లాడుతూ.. సూపర్ స్టార్ కృష్ణ మృతి చెందాక వస్తున్న తన తొలి సినిమా ‘హంట్’ అని అన్నారు. ‘‘కృష్ణ ఇచ్చిన ధైర్యంతోనే ఈ సినిమా చేశాను. నా ప్రతి సినిమా రిలీజ్ అయ్యాక కృష్ణగారి నుంచి ఫోన్ వచ్చేది. ఇప్పుడు నేను అది మిస్ అవుతాను. నేను సినిమాల్లోకి రావడానికి ఆయనే కారణం. సినిమాల్లోకి వెళ్తాను అని చెప్పగానే మా ఇంట్లో అందరూ కంగారు పడ్డారు. ‘కృష్ణ కష్టపడితే సక్సెస్ అవుతాడు.. చెయ్యనివ్వండి’ అని కృష్ణ అనడంతో ఇంట్లో అందరూ ఒప్పుకున్నారు. అప్పటి నుంచి నా లైఫ్ యూటర్న్ తిరిగింది. జన్మజన్మలకు ఆయనకు రుణపడి ఉంటాను. ‘హంట్‌’ సినిమా కొత్త పాయింట్‌తో వస్తోంది. అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాము. ఇప్పటి వరకు తెలుగులో ఇటువంటి సినిమాను ఎవరూ చేయలేదు. ఇందులో యాక్షన్ కంటే ఎమోషనల్ సీన్లు సినిమాను నిలబెడతాయి. నేను అర్జున్ ఏ, అర్జున్ బి రెండు క్యరెక్టర్లలో కనిపిస్తాను. ఈ సినిమా కోసం నిర్మాత ఆనంద ప్రసాద్ ఎంతో రిస్క్ చేశారు. యాక్షన్ సీన్లు అన్ని రియల్‌గా ఉండాలని కోట్ల రూపాయలు పెట్టి విదేశీయులతో చేయించారు. హీరో శ్రీకాంత్ నుంచి చాలా నేర్చుకోవాలి. నా పిల్లలు, మహేష్ పిల్లలతో కూడా ఆయన సినిమాలు చేస్తాడు. భరత్ కూడా అద్భుతమైన నటుడు. అతను నటించిన ‘ప్రేమిస్తే’ సినిమాను నా చిన్నప్పుడు చూశాను’’ అని అన్నారు.

‘‘డైరెక్టర్ మహేష్ స్టోరీ చెప్పగానే నాకు చాలా నచ్చింది. వెంటనే సినిమాకు ఒకే చెప్పాను. అనుకున్న దాని కంటే ఈ సినిమా బాగా వచ్చింది. సుధీర్‌బాబు రెండు వెర్షన్‌లలో అద్భుతంగా యాక్ట్ చేశాడు. సినిమాలో నాది పాజిటివ్ క్యారెక్టరా? నెగిటివ్ క్యారెక్టరా? అనేది సస్పెన్స్. నేను ‘హంట్’ చూశా. పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం నాకు ఉంది. నిర్మాత ఆనంద ప్రసాద్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా.. ఖర్చుకు వెనకాడకుండా సినిమా నిర్మించారు’’ అని సీనియర్ హీరో శ్రీకాంత్ చెప్పుకొచ్చారు.


హీరో సుధీర్ బాబు గురించి చెప్పాల్సిన అవసరం లేదని నిర్మాత ఆనంద ప్రసాద్ అన్నారు. హీరో శ్రీకాంత్‌తో కలిసి తొలిసారి సినిమా చేయడం ఆనందంగా ఉందని వెల్లడించారు. ఈనెల 26న రిపబ్లిక్ డే కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న ‘హంట్’ సినిమాను ఆదరిస్తారని ఆశిస్తున్నానని అన్నారు.

‘హంట్’ సినిమా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం తనకు ఉందని డైరెక్టర్ మహేష్ అన్నాడు. ‘‘ నిర్మాత ఆనంద ప్రసాద్‌కి రుణపడి ఉంటాను. వాళ్లు నన్ను నమ్మకపోతే ఈరోజు పనిలేకుండా ఎక్కడో ఉండే వాడిని. ఈ సినిమాలో హీరో సుధీర్‌బాబు అద్భుతంగా నటించాడు. సినిమా కోసం ఆయన ఎంతో కష్టపడ్డాడు. సుధీర్ కెరీర్‌లో ఇది బెస్ట్ మూవీ అవుతుంది. శ్రీకాంత్‌, భరత్‌తో కలిసి సినిమా చేయడం గౌరవంగా ఉంది. వాళ్లతో కలిసి పనిచేస్తున్నప్పుడు ఎంతో ఎంజాయ్ చేశాను. ఈ సినిమాలో స్ట్రాంగ్ ఎమోషనల్ కంటెంట్ ఉంది. అది ప్రేక్షకుల మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. థియేటర్‌కు వచ్చి సినిమా చూసే ప్రతి ఒక్కరికి మంచి కిక్ వస్తుంది అని వెల్లడించారు.

‘హంట్’ సినిమాలో తాను ఒక భాగం కావడం సంతోషంగా ఉందని నటుడు భరత్ అన్నాడు. సినిమా చూశాక తాను ఎగ్జైట్ అయ్యానని చెప్పారు. సుధీర్‌బాబు సినిమాల్లో ఇది బెస్ట్ అవుతుంది. ఈ మూవీ స్టోరీ విన్నాక.. తెలుగులోకి మళ్లీ రావడానికి ఇదే సరైన సమయమని అనుకున్నారు. ఈ సినిమా భారీ విజయం సాధిస్తుందనే నమ్మకం తనకు ఉందని వివరించారు.

Related News

Avika Gor : ప్రేమించిన వాడితో ఏడడుగులు వేసిన చిన్నారి పెళ్ళికూతురు.. చెప్పినట్టే చేసిందిగా!

Janulyri -Deelip Devagan: దిలీప్ తో బ్రేకప్ చెప్పుకున్న జానులిరి … తప్పు చేశానంటూ?

Singer Lipsika: గుడ్ న్యూస్ చెప్పిన సింగర్ లిప్సిక.. కీరవాణి చేతుల మీదుగా?

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Big Stories

×