BigTV English
Advertisement

Maa Nanna Super Hero Trailer: కంటే తండ్రి అయిపోరు.. ఎమోషన్‌తో ఏడిపించేసిన సుధీర్ బాబు

Maa Nanna Super Hero Trailer: కంటే తండ్రి అయిపోరు.. ఎమోషన్‌తో ఏడిపించేసిన సుధీర్ బాబు

Maa Nanna Super Hero Trailer: ప్రతీ సినిమాకు, తాను ఎంచుకునే ప్రతీ కథకు వేరియేషన్ చూపించే హీరోల్లో సుధీర్ బాబు ఒకడు. ఒక సినిమాలో యాక్షన్ హీరోగా మాస్ ఆడియన్స్‌ను అలరిస్తూనే.. మరో సినిమాలో ప్రేమికుడిగా అమ్మాయిల మనసు దోచేస్తాడు. ఇప్పుడు వాటికి భిన్నంగా ఒక తండ్రీ కొడుకుల కథతో ప్రేక్షకులను అలరించడానికి వచ్చేస్తున్నాడు సుధీర్ బాబు. ‘మా నాన్న సూపర్ హీరో’ అంటూ ప్రేక్షకులను ఎమోషనల్ చేయడానికి సిద్ధమయ్యాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలయిన టీజర్ చాలా ఎమోషనల్‌గా ఉందని ఆడియన్స్ ఫీల్ అవ్వగా.. ఇప్పుడు అంతకు మించిన ఎమోషన్స్‌తో ట్రైలర్‌ను విడుదల చేసింది మూవీ టీమ్.


డబ్బు కోసం

‘‘ఒకప్పుడు ఈ డబ్బు అవసరమే నా కొడుకును నాకు దూరం చేసింది. దాని విలువ 25 సంవత్సరాలు’’ అంటూ సాయి చంద్ చెప్పే డైలాగ్‌‌‌తో ‘మా నాన్న సూపర్ హీరో’ ట్రైలర్ ప్రారంభమవుతుంది. అదే సమయంలో బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక చిన్నపిల్లవాడి ఏడుపు వినిపిస్తుంది. ‘‘డబ్బుల కోసం క్యాన్సర్ అని చెప్పి కొడుకునే తాకట్టు పెట్టాడు. ఇన్ని అబద్ధాలు చెప్తారా డబ్బుల కోసం?’’ అంటూ ఒక వ్యక్తి అడగగానే.. ‘‘నాన్నకంటే డబ్బులేమీ ఎక్కువ కాదు’’ అని సమాధానమిస్తాడు సుధీర్ బాబు. అప్పుడే తన తండ్రి పాత్రలో సాయాజీ షిండే పరిచయమవుతారు. కుటుంబాన్ని పోషిస్తూ, తన తండ్రి అవసరాలను తీర్చే కొడుకు పాత్రలో సుధీర్ కనిపిస్తాడు.


Also Read: ‘శివ’ సినిమాకు 35 ఏళ్లు.. ఇది ఒక ఫేమస్ యాక్షన్ చిత్రానికి కాపీ అని మీకు తెలుసా?

బాధ్యత లేని తండ్రి

కొడుకు ఎంత బాగా చూసుకుంటున్నా కూడా షేర్స్‌లో డబ్బులు పోగొట్టుకుంటూ బాధ్యత లేని తండ్రిగా సాయాజీ షిండే వ్యవహరిస్తారని ‘మా నాన్న సూపర్ హీరో’ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. అప్పుడే సుధీర్ లైఫ్‌లోకి ఆర్నా వస్తుంది. ఆర్నాతో ప్రేమలో ఉన్నా కూడా తండ్రి మీద భయంతో ఆ ప్రేమను దాచిపెట్టేస్తాడు సుధీర్. ‘‘నీ అసలు నాన్న గురించి ఎప్పుడైనా ఆలోచించావా? ఏదో ఒకరోజు వస్తాడేమో’’ అంటూ సుధీర్ ఫ్రెండ్ చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ మరో మలుపు తిరుగుతుంది. అప్పుడే సుధీర్ జీవితంలోకి అనూహ్యంగా తన అసలు తండ్రి సాయి చంద్ వస్తాడు. కానీ అతడే తన తండ్రి అని సుధీర్‌కు కూడా తెలియదు. అందుకే చూసేవాళ్లు తమను తండ్రీ కొడుకులు అనుకుంటున్నారని నవ్వుకుంటారు.

మహేశ్ బాబు రిఫరెన్స్

‘‘కళ్లజోడు పెట్టుకుంటే ప్రపంచం మారిపోదు. ప్రేమతో చేసినంత మాత్రానా తప్పు తప్పు కాకుండా పోదు, కంటే తండ్రి అయిపోవు. తనతో ఉండాలి, సరిగా పెంచాలి’’ అంటూ ‘మా నాన్న సూపర్ హీరో’ ట్రైలర్‌లో వచ్చే డైలాగ్స్ ఆడియన్స్‌ను ఎమోషనల్ చేసేలా ఉన్నాయి. మొత్తానికి డబ్బు అవసరం కోసం ఏ పని చేయడానికి అయినా సిద్ధపడతాడు. ‘‘నాకోసం చేస్తే తప్పు. ఇది నాన్న కోసం. తప్పదు’’ అంటూ తను చేసే తప్పు కూడా నాన్నకోసమే అనే డైలాగ్‌తో ట్రైలర్‌ను ముగించారు. ట్రైలర్ చివర్లో మహేశ్ బాబు రిఫరెన్స్ కూడా యాడ్ చేశారు. ‘మా నాన్న సూపర్ హీరో’ లాంటి ఎమోషనల్ డ్రామాతో అక్టోబర్ 11న ప్రేక్షకులను అలరించడానికి వచ్చేస్తున్నాడు సుధీర్ బాబు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×