Hero Darshan.. శాండిల్ వుడ్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న కన్నడ హీరో దర్శన్ (Hero Darshan) కేవలం కన్నడ పరిశ్రమకు మాత్రమే పరిమితమయ్యారు. కానీ ఎప్పుడైతే తన ప్రేయసి కోసం అభిమాని అయిన రేణుకా స్వామి (Renuka Swamy)ని హత్య మార్చి హంతకుడిగా మారాడో .. దాంతో యావత్ సినీ పరిశ్రమ ఉలిక్కిపడింది. ఫలితంగా హీరో దర్శన్ ఎవరు అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు. ముఖ్యంగా అభిమానిని చంపిన కేసులో ఏ 2 ముద్దాయిగా మారిన హీరో దర్శన్ ప్రస్తుతం జైలు జీవితం గడుపుతూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. హంతకుడిగా మారి పాపులారిటీ సంపాదించుకున్న నటుడిగా ఈయనే పేరు దక్కించుకున్నారు అంటూ నెటిజన్స్ కూడా విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.
దర్శన్ ను బెంగళూరు నుంచి బళ్లారి జైలుకు మార్చిన కోర్ట్..
ఇదిలా ఉండగా.. హత్య కేసులో భాగంగా బెంగళూరులోని పరప్పన అగ్రహారం సెంట్రల్ జైల్లో ఉన్న ఈయన అక్కడ రాజభోగాలు అనుభవిస్తున్నారని ఫోటోలు కాస్త బయటకి రావడంతో.. హంతకుడు దర్శన్ కు జైలులో విఐపి సౌకర్యాలు లభిస్తున్నాయని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. రేణుకా స్వామి తండ్రి కాశీనాథ కు ఈ విషయం తెలిసి తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడమే కాదు , హంతకుడైన హీరో పై కఠిన చర్యలు తీసుకోవాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కోరారు. గతంలో దర్శన్ ఇంటి భోజనం అడిగినప్పుడు కోర్టు కూడా అనుమతించలేదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు న్యాయ వ్యవస్థ, పోలీసులు పట్ల పూర్తి నమ్మకం ఉంది. కానీ ఇది ఎలా జరిగిందో అర్థం కాక ఆశ్చర్యం వేస్తోంది. దీనిపై దర్యాప్తు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాను అంటూ రేణుక స్వామి తండ్రి వాపోయారు. దీంతో దర్శన్ పై సిబిఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేయగా.. విచారణ జరిపిన తర్వాత కోర్టు బళ్లారి జైలుకు దర్శన్ ను తరలించాలని ఆదేశాలు జారీ చేసింది.
దర్శన్ ను వెంటాడుతున్న రేణుకా స్వామి ఆత్మ..
ఈ దర్శన్ విషయంలో ప్రస్తుతం ఊహించని పరిణామం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.. ప్రస్తుతం నిందితుడిగా బళ్లారి జైల్లో ఉన్న దర్శన్ ను రేణుక స్వామి ఆత్మ వెంటాడుతోందని, కలలోకి వచ్చి భయపెడుతోందని జైలు అధికారులకు దర్శన్ చెప్పినట్లు సమాచారం. తనను బెంగళూరు జైలుకు మార్చాలని కూడా కోరుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాదు అర్ధరాత్రి దర్శన్ గట్టిగా కేకలు వేస్తున్నారని, ముఖ్యంగా నిద్రలో కలవరిస్తూ తోటి వారిని ఇబ్బంది పెడుతున్నారని తోటి ఖైదీలు కూడా చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
నెటిజన్స్ కామెంట్స్ వైరల్..
ఈ విషయం తెలిసి నెటిజన్స్ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. అమాయకుడైన రేణుకా స్వామి నీ మంచి కోరితే.. నువ్వు అతడిని హతమార్చావు. ఇక అతడి ఆత్మ ఊరికే ఉండదు.. కచ్చితంగా నిన్ను వెంటాడుతుంది. కచ్చితంగా ఆ ఆత్మ నీపై రివేంజ్ తీర్చుకోనిదే పరలోకానికి వెళ్ళదు అంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
ప్రేయసి కోసం అభిమానిని హతమార్చిన దర్శన్..
అసలు విషయంలోకి వెళ్తే.. దర్శన్ ప్రముఖ సీరియల్ నటి పవిత్ర గౌడ (Pavitra Gouda) తో సహజీవనం చేయడంతో.. అప్పటికే వివాహమైన దర్శన్ తన భార్యకు దూరమవుతున్నాడనే బాధను తట్టుకోలేక పోయిన దర్శన్ అభిమాని రేణుకా స్వామి పవిత్ర గౌడ కు అసభ్యకరమైన మెసేజ్లు చేశాడట. ఈ నేపథ్యంలోనే ఆ కోపంతోనే పవిత్ర గౌడ దర్శన్ తో పాటు మరో 15 మందితో కలిసి రేణుకా స్వామిని అత్యంత దారుణంగా హతమార్చినట్లు సమాచారం. జూన్ 9వ తేదీన బెంగళూరులోని ఒక ఫ్లై ఓవర్ సమీపంలో రేణుకా స్వామి మృతదేహం లభ్యమవగా.. పోస్ట్మార్టం నివేదికలో బాధితుడికి షాక్ ఇచ్చి, తీవ్రంగా దాడి చేయడంతో రక్తస్రావం అయ్యి, శరీరంపై అనేక గాయాలు ఉన్నాయని వైద్యులు రిపోర్టులో తెలిపారు. ప్రస్తుతం ఆ రేణుకా స్వామి ఆత్మ దర్శన్ ను వెంటాడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.