BigTV English

Sudigali Sudheer : ఒకే ఒక్క వ్యక్తిని ఫాలో అవుతున్న సుడిగాలి సుధీర్… పవన్ ను మాత్రం కాదండోయ్

Sudigali Sudheer : ఒకే ఒక్క వ్యక్తిని ఫాలో అవుతున్న సుడిగాలి సుధీర్… పవన్ ను మాత్రం కాదండోయ్

Sudigaali Sudheer : పర్ఫెక్ట్ కామెడీ టైమింగ్ తో, పంచులతో ఓ మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న బుల్లితెర సెలబ్రిటీలలో సుడిగాలి సుధీర్ (Sudigaali Sudheer) కూడా ఒకరు. ఈయనకు ఏ రేంజ్ లో ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సుడిగాలి సుధీర్ మాత్రం కేవలం ఒక్కరంటే ఒక్కరినే ఇన్స్టాలో ఫాలో అవుతున్నారు. అయితే ఈ విషయం చెప్పగానే టక్కున అందరూ ఇంకెవరిని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని అయ్యి ఉంటుంది అని అనుకుంటారు. కానీ సుడిగాలి సుధీర్ ఫాలో అవుతుంది పవన్ కళ్యాణ్ ని కాదు. మరి ఆయన ఎవరిని ఫాలో అవుతున్నారో తెలుసుకుందాం పదండి.


‘జబర్దస్త్’ అనే కామెడీ షో తో పాపులర్ అయిన నటుల్లో సుడిగాలి సుధీర్ (Sudigaali Sudheer) కూడా ఒకరు. ఇతనిలో ఉన్న మల్టీ టాలెంట్ కి బుల్లితెర ప్రేక్షకులు భారీ సంఖ్యలో ఫిదా అయ్యారు. ప్రస్తుతం స్మాల్ స్క్రీన్ ను షేక్ చేస్తున్న సుడిగాలి సుధీర్ కేవలం కమెడియన్ మాత్రమే కాదు అద్భుతమైన నటుడు, డాన్సర్, యాంకర్, మెజీషియన్ కూడా. కమెడియన్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన సుధీర్ ఒక్కో మెట్టు ఎక్కుతూ ప్రస్తుతం హీరో స్టేజ్ కు చేరుకున్నాడు. ‘జబర్దస్త్’ తర్వాత అతని కెరీర్ పూర్తిగా మారిపోయింది. టాప్ పర్ఫామర్ గా ఈ కామెడీ షోలో చక్రం తిప్పిన సుడిగాలి సుధీర్ వెండితెరపై కూడా ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకున్నాడు.

అయితే ముందుగా చిన్న చిన్న పాత్రలు చేసిన సుధీర్ ఆ తర్వాత వచ్చిన పాపులారిటీతో హీరోగా మారాడు. అందులో భాగంగానే త్రీ మంకీస్, వాంటెడ్ పండుగాడు, సాఫ్ట్వేర్ సుధీర్ వంటి సినిమాలను చేశాడు. కానీ ఈ సినిమాలు ఆడలేదు. ఆ తర్వాత ‘గాలోడు’ అంటూ మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చి అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఈ సినిమా ఫర్వాలేదు అనిపించుకుంది. ఇక ఇప్పుడు సుడిగాలి సుధీర్ (Sudigaali Sudheer)  చేతిలో పెద్దగా సినిమాలేవి లేవుగాని ఇంతకు ముందే మొదలు పెట్టిన మరొ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ లేదు. నరేష్ కుప్పిలి దర్శకత్వంలో ‘గోట్’ అనే సినిమాను స్టార్ట్ చేశాడు.. ఆ సినిమా ఎప్పుడో మొదలైంది గాని ఇప్పటిదాకా అసలు ఆ మూవీ రిలీజ్ అవుతుందా లేదా అన్న విషయం పై క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలోనే సుడిగాలి సుధీర్ ఓటిటి వెబ్ సిరీస్ లలో నటిస్తూనే మరోవైపు హోస్ట్ గా రాణిస్తున్నాడు.


ఇక ప్రస్తుతం సుడిగాలి సుధీర్ ను ఇన్స్టాలో ఏకంగా 14 లక్షల మంది ఫాలో అవుతున్నారు. ఇంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సుడిగాలి సుధీర్ మాత్రం కేవలం ఒకే ఒక్కరిని ఫాలో అవుతున్నారు. నిజానికి సుడిగాలి సుధీర్ (Sudigaali Sudheer)  ఎక్కువగా అభిమానించేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ను. కానీ ఆయన ఇన్స్టా లో ఫాలో అవుతుంది మాత్రం పవన్ కళ్యాణ్ ని కాదు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)ని. అయితే తనను ఎంతగానో అభిమానించే పవన్ కళ్యాణ్ ని కాకుండా ఆయన చిరంజీవిని ఫాలో అవుతుండడం మెగా అభిమానులను ఆశ్చర్యపరుస్తుంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×