Bunny Special Training : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘పుష్ప 2…ది రూల్’. రీసెంట్‌గా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. వచ్చే ఏడాది ఈ మూవీని రిలీజ్ చేయటానికి ప్లాన్ చేసుకున్నారు. ‘పుష్ప ది రైజ్’ పాన్ ఇండియా స్టైల్లో బ్లాక్ బస్టర్ అయిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘పుష్ప 2’ రానున్న సంగతి తెలిసిందే. తొలి పార్ట్ సూపర్ హిట్ కావటంతో డైరెక్టర్ సుుకుమార్ రెండో పార్ట్‌పై మరింత కేర్ తీసుకున్నారట. తగ్గేదే లే అనే కాన్సెప్ట్‌తో భారీ బడ్జెట్‌తో సినిమాను చేస్తున్నారు.
సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోన్న సమాచారం మేరకు సుకుమార్ థాయ్ లాండ్ అడవుల్లో పుష్ప 2 కోసం రియల్ టైగర్‌తో ఫైట్ ప్లాన్ చేశారట. దీని కోసం బన్నీ స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నారని టాక్. ఈ ఫైట్ ఆడియెన్స్‌కి గూజ్ బంప్స్ తెప్పిస్తుందని అంటున్నారు. వి.ఎఫ్.ఎక్స్ లో పులిని క్రియేట్ చేసి చేసుకోవచ్చు. కానీ సుకుమార్ అలా కాకుండా రియల్ టైగర్‌తో సన్నివేశం చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుంది. ఫహాద్ పాజిల్ విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో మరో స్టార్ హీరో కూడా కనిపించబోతున్నారని సమాచారం. హ్యూజ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్న ఈ చిత్రం గురించి బాలీవుడ్ సైతం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.